పంచమ వేదం – 3
పంచమ వేదం -3
రేయ్,, రోజు ఈ వర్క్స్ కాదు కానీ,, చిరాకు వస్తుంది… ఎక్కడకి అయిన పోదాం రా… మనం ట్రిప్ కి వెళ్ళి వన్ ఇయర్ అయ్యింది… వెళ్దాం రా అంటాడు అభినవ్….
ఏంటి రా బాబు… నీ గోల… ఊరికే రెండు రోజులు నుండి విసిగిస్తున్నావ్!! ఎక్కడకి పోదాం నువ్వే చెప్పు అంటాడు సింహ…
గోవా పోదామా అంటాడు వంశీ…
విడి గోవా గోల తగలయ్య… అనుకుంటాడు ధ్రువ….
పోనీ,, ఇది అయినా గుడికి వెళ్దాం అంటాడు అరవింద్…
నేను గోవా అంటే నువ్వు గుడి అంటావు ఏంటి రా బాబు… కొంచం సేపు నువ్వు నోరుమూసుకుని కూర్చో చెప్తున్న…
నువ్వు కొంచం మనం వెళ్ళే ప్లేసెస్ చెప్తే… నేను కూడా నోరుమూసుకుని కూర్చుంట… గోవా అంట గోవా… మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్!!!
పోనీ,, ఏది అయిన మిస్టీరియర్స్ ప్లేసెస్ కి వెళ్దామా!! అంటాడు సింహ…
వచ్చిండు అయ్యా సైంటిస్ట్… కన్నుకోవడానికి… ఎంజాయ్ చేసే ప్లేసెస్ చెప్పండి రా అంటాడు ధ్రువ…
ఒక పని చెయ్యండి రా… అందరం కలిసి మా ఊరికి పోదామా?? అంటాడు అభినవ్….
మీ ఊరు ఏం అయిన ఊటీ అనుకున్నావా?? అంటాడు వంశీ…
బాగుంటుంది రా మంచి వెదర్ ఉంటుంది… పైగా,, మా ఊరిలో పెద్ద అడవి కూడా ఉంది…అలా ఫుల్ గా తిరిగొచ్చు… మా అమ్మ ఇంకా నాన్న కూడా ఒక నెల వేరే ఊరు వెళ్తున్నారు అంట… మనం హ్యాపీ గా ఉండచ్చు… మన ఇష్టం…
అది కదా… నువ్వు మీ ఇంటి నీ మిస్ అవుతున్నావ్!! అందుకే ఎక్కడకి అయిన వెళ్ళాలి అని లాస్ట్ కి మీ ఊరికి వెళ్ళేలా ప్లాన్ చేశావు కదా రా… నిజం చెప్పు అంటాడు సింహ….
అలా ఏం లేదు రా….
మరి అక్కడకి తీసుకొని వెళ్ళి… మమ్మలిని చంపే ప్లాన్ చేశావు ఏంటి రా… అంటాడు వంశీ….
మనకి వచ్చే బడ్జెట్ కి ఊరే బెస్ట్… అభి ఊరికి వెళ్దాం అంటాడు ధ్రువ…
నేను రెడీ రా… అంటాడు వంశీ అప్పుడే కాలి బ్యాగ్ తగిలించుకొని….
ఎక్కవ చెయ్యకు… 2 డేస్ ఆగి వెళ్దాం లీవ్స్ అప్లై చేసుకొని అంటాడు అరవింద్…
సరే లే,, రా బాబు…
అభి మనసులో… ఆ అడవిలో ఉన్న గుడికి ఎందుకు ఎవ్వరూ పోరు అని ఈసారి అయినా తెలుసుకోవాలి… ఆ వంశీ గాడు అసలు పెద్ద దూల గాడు అన్ని గెలుకుతూ వుంటాడు… వాడి కి ఉన్న దూల కి కచ్చితంగా ఆ గుడికి ముందు వాడే పోతాడు… వాడితో పాటు నేను పోత….
వంశీ : రేయ్,, అభి అని పిలుస్తున్నాడు… కానీ అభి పలకడం లేదు… రేయ్,, అభి మళ్ళీ గెట్టిగా అంటాడు…
ఏంటి రా?? నాకు ఏం అయిన చెవుడు ఆ?? అంత గెట్టిగా పిలుస్తున్నావ్??
నువ్వు పలికితే కదా… ఏదో ఊహల్లో మునిగిపోయావు??
ఏం లేదు రా… చెప్పు ఏంటి??
మీ ఊరి పేరు ఏంటి?? అంటాడు వంశీ…
ఒరేయ్,, నువ్వు నిజంగా నా ఫ్రెండ్ వే నా?? కనీసం,, నా ఊరి పేరు కూడా తెలియదు అంటున్నావు!!!
చెప్పినావు లే రా… నేను మర్చిపోయా….
రేయ్ అభి,,, ట్రైన్ ఆ బస్ ఆ?? దేంట్లో పోదాం… అంటాడు సింహ…
ట్రైన్ లో నే పోదాం రా….
సరే,, టికెట్స్ బుక్ చేస్తా….
రేయ్,, వంశీ… నీకు తప్ప మా ఊరి పేరు అందరికీ గుర్తు ఉంది రా… చూడు సింహ నీ ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తున్నాడు… అంటాడు అభి…
మీ ఊరికి ట్రైన్ కూడా ఉందా??
లేదు రా… పట్టాలు మీద నడుచుకొని వెళ్ళి… అలా సక్కగా పోతూ ఉండు వస్తుంది…
అబ్బా… అది సరే రా… మీ ఊరి పేరు ఏంటి?? అది చెప్పు ముందు…
“రుద్రవరం”
అబ్బో,, పేరు చాలా పవర్ఫుల్ గా ఉందే…
వూరు కూడా పవర్ఫుల్ అంటాడు అభి…
అబ్బా,, పల్లెటూరు అంటే… ఫుడ్,, పొలాలు,, అమ్మాయిలు,, చెరువు గట్లు,, కొబ్బరి చెట్లు…. ఫుల్ గా ఎంజాయ్ చెయ్యచు అని అనుకుంటూ… రేయ్ అభి,,, ఆంటీ నీ ఫుల్ గా పిండి వంటలు చేయమని చెప్పు రా… అని ఊహల్లో తేలిపోతున్నాడు వంశీ…
అలాగే లే రా…. ఫస్ట్ అయితే వెళ్ళి తిందాం పద… అంటాడు అభి…
ఎప్పుడూ ఈ చారు తో చంపుతున్నారు కదా రా అంటాడు వంశీ…
అవును ఆ,, మరి అయితే వెళ్ళి చికెన్ తీసుకొని రా పో… వండుకొని తిందాం అంటాడు ధ్రువ…..
వంశీ తన అకౌంట్ బ్యాలెన్స్ ఓపెన్ చేసి చూపిస్తాడు….
ఒరేయ్,, అ డబ్బులు తో చికెన్ కాదు రా… కనీసం,, చాక్లెట్ కూడా రాదు రా నీ అబ్బ… ఆ బ్యాలెన్స్ పెట్టుకొని నీకు చికెన్ కావాలి ఆ మూసుకొని చారు తిను….
To be continued…..
Swipe left/right or tap the sides to turn pages