New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పంచమ వేదం – 2

పంచమ వేదం – 2

పంచమ వేదం – 2

 

 

సాయంత్రం 6 గంటలు…. డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వస్తారు సింహ ఇంకా అభినవ్… 

 

 

అభి: చస్తున్నా రా బాబు… ఆ మ్యానేజర్ గాడితో… వాడిని….

 

 

ఆ వాడిని… చెప్పు ఏం చేస్తావు??

 

 

వాడు ఏం నా అయిన పెళ్ళాం ఆ ఏంటి?? ఏం అయిన చేయడానికి??… నేను ఏం చేస్తా వాడిని… కానీ,, రిజైన్ చేసేటప్పుడు మాత్రం… ఆఫీస్ లో దొరికిన వస్తువులు అని అమ్మేసి సెటిల్ అయిపోత… 

 

 

 

సింహ: హ్మ్మ్… ఎంప్లాయ్ కి ఎక్కవ… దొంగ కి తక్కవ రా వెధవ నువ్వు….

 

 

అభి: సరే,, లే…. ఆ మ్యానేజర్ పెట్టిన టార్చర్ కి ఇది చాలా తక్కవ…

 

 

ఆలోపు,,, ధ్రువ వస్తాడు… తన కోట్ విప్పేసి సోఫా మీద పడేసి… అబ్బా అని తల పట్టుకున్నాడు…

 

 

ఏం అయింది రా… అలా తల పట్టుకున్నావ్?? అంటాడు సింహ…

 

 

ఏం చెప్పను రా నా బాధ… అసలు,, హాస్పిటల్ లో నేను డాక్టర్ ఆ లేకపోతే…  పేషెంట్స్ ఆ డాక్టర్స్ ఆ అర్థం కావడం లేదు రా బాబు… ఒకరు ఏమో వాడికి వాడే ఏం ప్రాబ్లం లేదు అని డిసైడ్ చేసుకుంటాడు… ఒకడు ఏమో వాడి రిపోర్ట్స్ వాడే చూసుకుంటాడు… లిటిరల్లీ,, ఒక అమ్మయి అయితే… డాక్టర్ నాకు ఇంజెక్షన్ వద్దు అన్నది… పోనీ,, టాబ్లెట్స్ ఇస్తా అన్న నేను… ఆ అమ్మాయి వదు అన్నదీ… మరి,, ఏం కావాలి అని నేను అడిగా ఆ అమ్మాయి నీ… దానికి ఆ అమ్మాయి టానిక్ రాసి ఇవ్వండి డాక్టర్ అన్నది రా బాబు… 

 

 

చిన్న పిల్లలు అంతే రా…. అందులో ఏమి ఉంది అంటాడు అభి…

 

 

ఆహా,, 20 ఇయర్స్ ఉంటే చిన్న పిల్ల నా… అంటాడు ధ్రువ… 

 

 

ఓహో,, ఇది ఊహించనీ పరిణామం అయితే… 

 

 

ఛా,, నోరుమూయి… అసలే,, చిరాకుగా ఉన్న… ఆ పిల్ల అంత ఇంత విసిగించ లేదా రా బాబు… ఇంజెక్షన్ వద్దు అంటుంది… టాబ్లెట్ వద్దు అంటుంది… టానిక్ కావాలి అంట… వాళ్ళ అమ్మ ఏమో… ఇంజెక్షన్ వెయ్యి బాబు అన్నది.. సరే,, అని వేద్దాం అని డిసైడ్ అయ్యి… వాళ్ళ అమ్మ నీ ఆ పిల్ల చెయ్యి నీ పట్టుకోమని చెప్ప… నేను ఇంజెక్షన్ వేస్తూ ఉంటే… నా చెయ్యి గెట్టిగా పట్టేసుకుంది… చూడండి ఆ పిల్ల నెయిల్స్ వి గుర్తులు ఎలా పడ్డాయో… ఆమె కి ఇంజెక్షన్ వేశానా?? లేక నాకు బ్యాండేజ్ వేసుకున్న నా తెలియదు… ఇంకా,, సరే అని… డ్రిప్స్ పెట్ట ఆ పిల్లకి… వామ్మో,, ఇంకా కొంచం ఉంటే నా షర్ట్ చిరిగేది… ఎంత అల్లరి చేసిందో… చెప్పలేము రా బాబు… అంటాడు ధృవ…

 

 

యూర్ హానర్… నా క్లయింట్ ను ఒక అమ్మాయి తీవ్రముగా హింసించింది… అంటాడు అరవింద్… 

 

 

రేయ్,, నోరుమూసుకుని ఉండు రా బాబు… అని పక్కన ఉన్న దిండు విసిరేస్తాడు ధ్రువ… 

 

 

అబ్బా,, ఇంట్లోకి రాకముందే… హెడ్ షాట్ ఆ?? అంటాడు అరవింద్…

 

 

ఇప్పుడే అందిన తాజా వర్త… నా బెస్ట్ ఫ్రెండ్ అయిన అరవింద్ నీ… ధృవ గారు దిండు తో కొట్టారు… అంటాడు వంశీ….

 

 

వీడు ఒక చెత్త వెధవ… అంటాడు ధృవ… 

 

 

వంశీ: ఏంటి రా,, వచ్చి రాగానే నన్ను తిడుతున్నావ్…

 

 

అరవింద్: సంతోషం… నిన్ను అయినా తిట్టాడు… నా మీద అయితే దిండు తో హత్య ప్రయత్నం చేశాడు వాడు…

 

 

రేయ్,, ఆపండి రా బాబు… వెళ్ళి వంట చేయండి… ఎవరిది ఈరోజు డ్యూటీ… అంటాడు అభి..

 

 

ఈరోజు,, వంశీ ది… అంటాడు సింహ…

 

 

వంశీ కి ఫోన్ రాకపోయినా… హలో,, ఆ చెప్పండి సార్ అంటాడు….

 

 

రేయ్,, ఎగస్ట్రాలు చేయకు రా నీ అబ్బా… ఫోన్ రాలేదు కానీ,, వెళ్ళి మూసుకొని వంట చెయ్యి…  అంటాడు సింహ

 

 

ఈ ఒక రోజు… నువ్వు చెయ్యి రా సింహ…

 

 

అమ్మో,, నాకు ఓపిక లేదు… 

 

 

పోనీ,, అభి నువ్వు చెయ్యి రా అంటాడు వంశీ…

 

 

సింహ: వామ్మో,, వద్దు రా… అసలే ఆ అభి గాడు మేనేజర్ మీద కోపం లో ఉన్నాడు… ఆ కోపం లో విషం కలిపిన కలిపేస్తాడు…ఆ కోపం అంత వంట లో చూపిస్తే మనం అసలు తినలేము… 

 

 

పోనీ,, ఈరోజు కి ఆర్డర్ పెట్టుకుందాం… అంటాడు ధృవ…

 

 

సరే,, డబ్బులు మొత్తం స్ప్లిట్ చేసుకుందాము…. అంటాడు అరవింద్…

 

 

రేయ్,, సింహ నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి రా… పోయిన మంత్ రెండు వందలు తీసుకున్నావ్!! అంటాడు వంశీ…. 

 

 

సింహ: ఏంటి రా ఇచ్చేది రెండు వందలు… నువ్వు నా పెర్ఫ్యూమ్ వాడుకున్నావ్ రా… దాని కాస్ట్ మూడు వందలు… నువ్వు నాకు వంద ఇవ్వాలి…

 

 

ఫ్రెండ్స్ మధ్య డబ్బులు ఏంటి రా?? అంటాడు వంశీ మాట మార్చేసి…

 

 

To be continued….