పరవశం – 30
అనుకున్నట్లుగానే విక్రమ్, మేఘనల పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలని ఫిక్స్ అవుతారు..
దానికి తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేశారు.. అలాగే అదే పెళ్ళిలో విజ్జుకి, రాజీకి కూడా ఎంగేజ్మెంట్ చేయాలని ఫిక్స్ అవుతారు..
ముందుగా విజ్జుకి రాజీకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, అదే మండపంలో విక్రమ్ వాళ్ళకి పెళ్ళి చేయాలని అనుకుంటారు..
అలా పెళ్ళి పనులన్నీ ముగించుకుని పెళ్ళిరోజు రానే వస్తుంది..
రాథోడ్ ఫ్యామిలీలో పెళ్ళి కాబట్టి చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేశారు.. బిజినెస్ పర్సన్స్, పొలిటీషియన్స్, మోడలింగ్ వాళ్ళు.. అందరూ, ప్రతి ఒక్కరూ వచ్చారు..