పెళ్లింటే భయం ?? – 1
ప్రణవి … నాపేరు ముందు నా కష్టాలు బాధలు అదే నాకు పెళ్లింటే ఎందుకు భయం ???
నాకు పెళ్లింటే భయం కలిగేలా నా జీవితంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలు నేను నా కళ్ళతో చూసిన తరువాతే నేను ఎలా పెళ్లి చేసుకోవాలి ???
మరో పదిహేను రోజుల్లో నా భారం బరువు తగ్గించుకొని వదిలించుకోవాలని చూస్తున్నారు??
ఆడపిల్ల మరి అంత బరువుగా ఉంటుందా?? పెళ్లి చేసేయాలి అనే తొందరలో వాడు మంచోడు చెడ్డవాడో వివరం తెలుసుకోవాలిగా ??
వాడు చెడ్డు అయితే నా పరిస్థితి ఏంటి ?? నాకంటూ చదవు లేదు నా కాళ్ళు మీదా నేను నిలబడ లేదు ??
అప్పటి వరుకు ఆగచ్చు కదా నాకు 18 నిండి 19 వచ్చాయి అంతేగా ??
ఇక నాకు ఎంతో వయసు అయినట్టు ఇంకా పెళ్లి ఎప్పుడు ?? ఎప్పుడు ఇదే గోలా ??
నిన్నటి నుంచి ఒక్కటే టార్చర్ నాకు .. ఎందుకంటే నన్ను చూసుకోవడానికి ఒకడు వస్తున్నాడు అంటా
నేను ఎంత చెప్పిన ఇక్కడ నా బాధ వినేవాళ్ళు లేరు .. మీరు అయన నా బాధ విన్నాక మీరే చెప్పండి ..
నాకు పెళ్లి భయం ఉండడం తప్పులేదు అని మీరే అంటారు …
@@@@@
నాకు పెళ్లి భయం ఎలా వచ్చింది అంటే? … పెళ్లంటే భయం కలిగించింది ఒక మగడు ??
అది కుడా బాధ్యత మోయలేని మగవాళ్ళు వల్లనా? అలాంటి బాధ్యత లేని ఎందరో తండ్రులు చూశాను ??
నా కళ్ళతో అలాంటిది నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోవు ?? అనే ప్రశ్నకి నా సమాధానం …
పెళ్లి పెళ్లి ఒక్కటే పదం ఎవరి నోటా అయినా ” నాకు తెలియక అడుగుతాను…
నాపెళ్లి గురించి వాళ్ళు ఎవరికో ఎందుకు అంటా ??
నా బాధలు నేను పడతాను కానీ వాళ్ళు కాదుగా …
రేపు నా జీవితం అటో ఇటో అయినా బాధ పడాల్సిందే … అది ఎలాగో తప్పదుగా అది నా ఒక్కదాని వరుకు అయితే ఒకే ??
అణ్యం పుణ్యం తెలియని .. నావల్ల వచ్చిన నాపిల్లలు కుడా పడాల్సిందే ..
ఎవరో ఏదో అన్నారు అని మా అమ్మానాన్నలు కుడా ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అనే ప్రశ్న??
బయట వాళ్ళు అంటే ఏదో ఒకవేళ ఒక్కసారి అంటారు అంతే మరి ఇంట్లో అమ్మానాన్నలు కుడా మన్నల్ని అర్థం చేసుకోకపోతే ఎలా ??
నాకంటూ ఉంది అమ్మా నా బాధ్యత మోయలేని తండ్రి ఒకడు …
నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం కానీ ఆయన్ని ఎవరు అయినా వేలెత్తి చూపించే వాళ్ళంటే ?
ఆయన వేలెత్తి చూపించుకుండా ఆయన ఉండాలిగా ముందు నా పిచ్చి గానీ ??
నాకు చాలా కోపం వచ్చింది బాధ అసలు ఆయన ఎందుకు ఇలా ఉండాలి??
మా నాన్న మాట్లాడే నీచమైన మాటలు ఆ తాగుడు వల్లనా కాదా ??
ఒక ఆడపిల్లగా అడుగుతున్న ?? నాకు కలలు ఉండవా? కోరికలు ఉండవా??
ఆహా ఉండకూడదు ఎందుకంటే నువ్వు ఆడపిల్ల… ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల ఆడాపిల్ల అంటారు ..
నా చదవు కుడా ఆపేశారు ఇప్పుడు దేనికి పనికి రాకుండా ఇంట్లో కుర్చున్న ??
అంటే ఏ పని రాదు ఒకరి చేత మాటలు పడ్డాము నాకు ఇష్టం ఉండదు ..
అందుకే నా జీవితంలో ఏం జరిగిన పర్వాలేదు ఆత్మగౌరవం కోల్పోకూడదని ??
నా మదిలో చాలా ప్రశ్నలు ఉన్నాయి? మరి వాటికి సమాధానాలు ఏమి లేవు ??
ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకొని పరాయి ఇంటికి వెళ్తేనే మాకు గౌరవం ఈ చదవులు అవి వద్దు అంటా ??
నాకంటే చిన్నోడు వాడికి వేలకు వేలు పోసి చదివిసే వాడు తప్పడం.. అడిగితే ఏం అన్నారో తెలుసా??
వాడు మగాడు ఇవాళ్ళ కాకపోతే రేపు పాస్ అవుతాడు.. అలాగే వాడు ఇంటిని పోషించాలి కాబట్టి చదవు అవసరం ..
మరి అదే కడుపున పుట్టిన ఆడపిల్లకి ఎందుకు వద్దు నాకు అర్ధం కావడం లేదు ??
అమ్మా ఏమో నీకు ఇంటి పని వంట పని వస్తే చాలు అంటా ఇంకా నీకు అవసరమైన నాలుగు అక్షరాలు నేర్పిన ఇంకేంటి అనింది …
నేను ఇంటర్మీడియట్ లో క్లాస్ కాదు మా జిల్లా ఫస్ట్ నేను.. నా కోరిక టీచర్ అవ్వటం ??
ఆ కోరిక తీరిందా అంటే? లేదు అది నా కల.. కల కలగానే మిగిలి పోయింది ..
ఇప్పటి ఎప్పటికి బహుశా నెస్ట్ లైఫ్ లో అయినా అబ్బాయిగా పుట్టి నా కలలు కోరికలు తీర్చుకోవాలి అనిపిస్తుంది …
చాలాచాలా చాలానే చూశాను నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో ??
అదేంటి అమ్మాయి చిన్న కష్టమే కాదా అంటారు.. ఇదే ఓర్చుకోలేని దానివి రేపు పెళ్లి అయ్యాక చాలా ఉంటాయి …
మళ్లీ వాళ్ళే అంటారు .. అయన ఈరోజు కష్టపడితే రేపు అత్తారింటికి వెళ్లాక సుఖపడతావు …
ఏదైనా అయింది అంటే మళ్లీ వాళ్ళే అంటారు… దీని దశ ఏ అలాంటిది దీని రాత్రే అంతా ??
అంటే వీళ్ళు ఏం చెప్పుతున్నారు ఇక్కడ … అక్కడ అందరూ నీమీద పెత్తనం చేస్తారు అని గొప్పగా చెప్పింది వాళ్ళే …
నీకు ఒక కొత్త జీవితం భర్త బాధ్యతలు అన్ని వస్తాయి.. వాడు చేతకాని వాడు అయితే ఉచితంగా మాటలు నీకేరా అని తియ్యటి నరకంలో పడేసేది వీళ్ళే …
అన్ని మాటలు వాళ్ళేగా మరి మన మాటలు.. మన బతుకు ఎప్పుడు బ్రతకాలి ??
నీ జీవితం అంటారు కానీ అందులో నువ్వు ఉండకూడదు అంటారు ..
ఏమైనా మాట్లాడితే చాలు ఆడపిల్లలు అని హద్దులు గీస్తారు …
ఇది ఒకటే నా అంటే కాదు ఇలాంటివి చాలనే ఉన్నాయి … మొన్న ఒకడు వచ్చాడు పెళ్లి చూపులకి …
వాడికి కాబోయే భార్యకి ఉండే లక్షణాలు అంటా
ఫ్రెండ్స్ ఉండకూడదు అంటా.. తన సొంతం సొమ్ము ఉండకూడదు అంటా…
నాకు ఎదురు చెప్పకూడదు ? నేను ఏం చేసిన పడి ఉండాలి ? చిటికిమాటికి ఏడవకూడదు ?
వాడి పనులు చేయాలి నేను వాడిని ఏమి అనకూడదు అంటా తప్పు చేస్తున్నా ??
కేవలం వాడి భార్య అయితే చాలు అంటా ?? మరి నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ ??
వాడు చెప్పిన దానికి అందరూ ఆహా మల్లికా మీ పిల్ల ఎంత అదృష్టవంతులు అంటే పిచ్చి అమ్మా మురిసిపోయేది ..
వాడి మాటలు ఎలా ఉన్నాయి అంటే మీ అమ్మాయి నేను పెడితే తిన్నాలి ??
తిడితే పడాలి అంటున్నాడు?? డ్రైక్ట్ గా అలాంటి వాడిని నేను చేసుకోవాలా ??
ఇక నువ్వు భార్యగా నన్ను చేసుకోవడం ఎందుకు రా??లేరా ముందు
కోపంగా వాడి కాలర్ పట్టుకొని లేరా ముందు ముందు నువ్వు నా ఇంటి నుంచి పోరా బయటికి…
వాడి అమ్మా ఏయ్ ఏయ్ ఎంత పొగరే నీకు ?? ఒక్క మాట అంటే అంత కోపం వచ్చింది మరి నాకు రాదా
నేను మనిషినేగా ఆవిడ లాంటి ఆడదాని అది అంత మార్చి పోయింది అనుకుంటా ??
నా కొడుకు కాలర్ పట్టుకుంటావా ?? నేను ఏం తగ్గలేదు దానికి కట్టు సమాధానం చెప్పాను…
ఏయ్ ముందు నువ్వు నోరు ముయ్యి … నోరుమూసుకో ఇది నా జీవితం పెత్తనం చేయకు నామీద నిన్ను ఒకటి అడుగుతా సమాధానం చెప్పు
నాకు అర్థం కాక అడుగుతాను నన్ను మీ ఇంటికి పనిమనిషిగా తీసుకెళ్తున్నావా ?? కోడలుగా తీసుకెళ్తున్నావా??
ఏయ్ అంటా ఏయ్ పెళ్లి కాకముందే మీరు ఇస్తున్న గౌరవం చూస్తుంటే ..
రేపు పెళ్లి చేసుకున్నాక ఎలా చూసుకుంటది అనేది అర్థమైంది కాదా ఇక్కడే …
ఎంత పొరుగు నీకు .. నన్ను అంతమాట అంటావా పువ్వుల్లో పెట్టి చూసుకుందాం అనుకున్నానే నిన్ను …
మా అమ్మా ఒకటి ఆవిడా కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుతుంటే నాకు పిచ్చి కోపం వచ్చింది .. బాధగా నేను మాట్లడిన పట్టించుకోలేదు ..
అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి ఈ పెళ్లి ఆపకండి నా కూతుర్ని ఇలా నవ్వులు పాలు చేస్తే రేపు దాన్ని ఎవరు చేసుకుంటారు ??
ప్లీజ్ అమ్మా అమ్మా ముందు నువ్వు ఆవిడ కాళ్ళు పట్టుకోవడం ఆపుతావా లేకనే…
ఫట్ నువ్వు నోరుముసుకో నీకు ఏం తెలియదు … మొదటి ఎంత బాధగా అనిపించిందో …
అది అమ్మా కొట్టిందానికి కాదు .. నాకు ఏ గౌరవం లేని ఇంటికి బలవంతంగా నన్ను పంపించాలని చూస్తుంది చూడు ??
అక్కడ అక్కడే అర్థమైంది మన దేశంలో ఆడపిల్లలు తల్లిదండ్రులు ఎంత చులకనగా చూస్తున్నారు అనేది ..
పెళ్లి అనేది అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకటే ఒకరు సర్వస్వం వదులుకొని వస్తే మరొకరికి అలా కాదుగా
పెళ్ళికొడుకు తరుపు వాళ్ళందరూ పెళ్లికూతురని వాళ్ళు ఇచ్చే కట్నాన్ని వాళ్ళ నాన్న పడే కష్టాన్ని చులకనగా చేసి మాట్లాడటం నాకు నచ్చ లేదు ..
పెళ్లికొడుకు తల్లిదండ్రులు వాళ్ళ చుట్టాలు ఎంత చులకనగా చూస్తున్నారో అదే ఆడ పెళ్లి వాళ్ళం అనేమో??
అమ్మా బలవంతంగా నాకు ఈ పెళ్లి జరిగితే నా శవాన్ని చూస్తారు అందరూ ..
ఆమాట తో అమ్మా ఆవిడ కాళ్ళు వదిలేసింది .. నువ్వేంటే నా కొడుకుని పెళ్లి చేసుకునేది ??
బజారు దానే .. ఆమాట ఎప్పుడు అయితే ఆవిడ నోటి నుంచి వచ్చిందో అమ్మా వంటింట్లో వెళ్లింది …
నీకెవ్వడోస్తాడో నేను చూస్తాను ?? మా కోటీశ్వరులు కుటుంబాన్ని కాదు అనుకుని ఎవరినైనా నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటారో ??
నేను చూస్తాను పదరా … ఆగవే ఏమన్నా ఇందాక నా కూతుర్ని బజారు దానే ఎలా కనిపిస్తుంది నా కూతురు …
ఏయ్ ఇప్పుడు నాకు అర్థమైంది.. మనకి గౌరవం విలువ లేని చోట ఎప్పుడు ఉండకూడదని నా కూతురు చెప్పేది …
అది ఏంటో ఈరోజు నీ మాటల ద్వారా నాకు అర్థమైంది ?? నువ్వు వద్దనేదేంటి నేను వద్దంటాను ??
ఇలాంటి దిక్కుమాలిన సంబంధం తెచ్చిన వాళ్ళని తిట్టాలి … పో ఇంకోసారి నా ఇంటి గుమ్మం తోక్కితే కత్తిపీట చూసావుగా ఎంత పోదునుగా ఉందో నరికేస్తా
నీకు ఒక కూతురు ఉందిగా దాన్ని అలాగే అంటే ఊరుకుంటావా..
నీ కూతురు నీకంతో నా కూతురు నాకు అంతే పోవే పో నీ కాళ్ళ కాడికి ఎవడు వచ్చేది…
పెళ్లి కుదిరిచ్చిన మద్యమర్తి వాళ్లు వెళ్లిన వెంటనే ఫోన్ చేయడంతో షాపింగ్ అమ్మా మాట్లాడుతూనే పడిపోయింది ??
ఏం జరిగింది అంటారు ?? ప్రణవి తన భయాన్ని జయించిందా లేదా?? అనేది తెలియాలి అంటే చదవండి లాస్ట్ ఎపిసోడ్ వరుకు ??
💞💞💞💞💞
హే క్యూటీస్ కాంపిటీషన్ కి ఈస్టోరీ రాస్తున్న చదివి ఎలా ఉందో చెప్పండి క్యూటీస్ 😍😍
Swipe left/right or tap the sides to turn pages