New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 71

పెళ్లి చూపులు – 71

పెళ్లి చూపులు -71

 

 

తను వెళ్లేసరికి చాలా లేట్ అవ్వడం, వైష్ణవ్ కి రవి ఇల్లు ఎక్కడో తెలియక పోవడంతో ఆ ఊరి ఎంట్రన్స్ దగ్గరే రవికి ఫోన్ చేస్తూ ఉండిపోయాడు. కానీ రవి ఫోన్ పిల్లలు గేమ్స్ ఆడుకుంటూ ఉండటంతో వైష్ణవ్ ఫోన్ చేస్తుంటే డిస్టబెన్స్ అని కట్ చేస్తూ ఉన్నారు…

 

నాలుగైదు సార్లు రవికి ఫోన్ చేసిన తర్వాత రవి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అసహనంగా అనిపించి ఇప్పుడు ఏం చేయాలి ఎలా రవి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడే భార్గవ్ అటువైపుగా వచ్చారు.. 

 

ఎవరో బైక్ మీద ఇటు వస్తున్నారు.. ఆయనను అడిగితే రవి వాళ్ళ ఇల్లు ఎక్కడో అడ్రస్ నాకు చెప్పారు అని అనుకుంటూ బైక్ మీద వెళ్తున్న భార్గవ్ ని  ఆపాడు వైష్ణవ్.

 

భార్గవ్ కూడా వైష్ణవ్ ని చూసి బైక్ ఆపి నవ్వుతూ “బాగున్నావా వైష్ణవ్” అని అడిగారు.

 

“బాగున్నాను” అని వైష్ణవ్ సమాధానం అయితే చెప్పాడు కానీ మనసులో ఈయన ఎవరు నన్ను పేరు పెట్టి పిలిచి మరి బాగున్నావా అని అడుగుతున్నారు ఈయనకి నాకు ఇంతకుముందు పరిచయం ఏమైనా ఉందా, ఈయన ఎవరో నాకు గుర్తు రావడం లేదే అని మనసులో అనుకున్నాడు 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue