New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 79

పెళ్లి చూపులు – 79

పెళ్లిచూపులు-79

 

“నన్ను బురదలో పడేసావు కదా, ఆ బురదని క్లీన్  చేయాల్సిన బాధ్యత కూడా నీదే కదా, కానీ నువ్వేమో ఏమీ తెలియని అమాయకుడిలా నీకు అంటినా బురదని క్లీన్ చేసుకుంటున్నావ్, మరి నా సంగతి ఏంటి..?” అని అడిగింది సిరి.

 

“నన్ను కింద పడేసింది నువ్వే కదా, అటువంటప్పుడు ఈ క్వశ్చన్ నేను నిన్ను అడగాలి, పెళ్లి కి ముందే నాకు స్నానం చేపించు అని,  ఇది పబ్లిక్ ప్లేస్ అయిపోయింది అందుకే అలా డైరెక్ట్ గా అడగలేకపోతున్నాను” అని దాదాపు తన శరీరానికి అంటుకొని ఉన్న బురదని మొత్తం క్లీన్ చేసుకుని చేతులు క్లీన్ చేసుకుంటూ ఆమె వైపు చూసి ఇక చూపు తిప్పుకోలేక అంతే చూస్తూ ఉండిపోయాడు. 

 

సిరి అతనితో మాట్లాడుతూనే తన వోనీ పూర్తిగా తీసేసి నీళ్లలో ముంచి తీసింది. ఆ తర్వాత చేతులకి కాళ్ళకి ఉన్న బురదని క్లీన్ చేసుకుంటూ లంగా కొంచెం పైకి జరుపుకుంది అలానే పైన బ్లౌజ్ కూడా అటూ ఇటూ కదిలిస్తూ నీళ్లు లోపల పోసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంది అది చూసిన వైష్ణవ్ ఇక చూపు తిప్పుకోలేక ఆమె వైపు అలానే చూస్తూ ఉన్నాడు.

 

రా నీకు స్నానం చేయిస్తా నా ముందుకు రా, ఈ చెరువులో ముంచి లేపుతాను అని ఆమె అంటున్నా కూడా వైష్ణవ్ నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవటంతో ఏంటి ఏం మాట్లాడటం లేదు అని అతని వైపు తిరిగి చూసింది.. అప్పటికి కూడా అతని చూపు తన మీదే ఉండటం అంతకుమించి ఆ చూపు ఎక్కడ ఉందో గమనించి తనని తాను చూసుకొని కోపంగా వైష్ణవ్ దగ్గరకు వచ్చి అతని చెంప మీద ఒక్కటి పీకి నువ్వు బయటికి వెళ్ళు అని అన్నది.

 

ఆమెకు ఇంకాస్త దగ్గరగా జరిగి లేదు నేను ఇక్కడే ఉంటాను ఇదేదో బాగుంది ఇంతకుముందు నీకు అంటుకున్న బురదని క్లీన్ చేయమని నన్ను అడిగావు కదా మరి ఆ పని చేయకుండా నేను బయటికి ఎలా వెళ్తాను అని వాటర్ ఆమె ఫేస్ మీద కొడుతూ అన్నాడు వైష్ణవ్. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue