ప్రేమలో పడితే -20
తన పిఏగా ఉన్న మహాలక్ష్మి తన పర్మిషన్ కూడా అడక్కుండా బయటకు వెళ్ళిపోతుంది అని తనకి గుర్తులేదు మర్చిపోయాడు తన కళ్ళ ముందు తన చెల్లెలు కనిపిస్తుంది..
తను చెల్లెలు కనుమరుగు అయ్యేంతవరకు చూసి ఆ తర్వాత పిడికిలి బిగించి నా చెల్లెలు ఎవరిని ప్రేమిస్తుంది ఇంతవరకు నేను కనుక్కోలేకపోయాను. తను నోరు తెరిచి చెప్పడం లేదు అసలు ఎవడు ఎవడు..? ఒక్కసారి నా కళ్ళ ముందుకు రావాలి అప్పుడు వాడి పని చెప్తాను అని మనసులో అనుకుంటూ ఇక తనకి కూడా వర్క్ ఏమీ లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయాడు..
అప్పటికే చైతన్య మహాలక్ష్మికి నాలుగు సార్లు ఫోన్ చేశాడు ఆఫీస్ టైమింగ్ అయిపోయింది ఇంకా మీరు రాకుండా ఏం చేస్తున్నారు అని కనుక్కోవడానికి కానీ మహాలక్ష్మి ఫోన్ సైలెంట్ లో ఉండటంతో ఫోన్ వచ్చిన సంగతి కూడా తనకు తెలియలేదు.
ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మహాలక్ష్మి బ్యాగ్ లో నుంచి ఫోన్ బయటికి తీసి చూసింది. అందులో చైతన్య నుంచి మిస్డ్ కాల్ రావటంతో వెంటనే తిరిగి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావ్ రా అని అడ్రస్ అడిగింది.
చైతన్య లైవ్ లొకేషన్ పెట్టడంతో వెంటనే అక్కడికి ముగ్గురు కూడా బయలుదేరారు అరగంటలో చైతన్య దగ్గరకు చేరుకున్నారు.