ప్రేమలో పడితే -21
మహాలక్ష్మి అలా ధైర్యంగా చెప్పడంతో “థాంక్యూ సో మచ్, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తావు అని తెలుసు కానీ నీ గురించి ఫిలిం కాబట్టి పర్మిషన్స్ తప్పనిసరి” అని అన్నాడు చైతన్య..
“ఎందుకురా ఆడపిల్ల లైఫ్ లోనే ఇలాంటివి జరుగుతాయి ఆడపిల్లకు మాత్రమే ఇలాంటి సెన్సిటివ్ విషయాలు ఎక్కువ అవుతుంటాయి” అని ఏదో ఆలోచిస్తూ అన్నది రమ్య..
రెండు నిమిషాలు ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత మహాలక్ష్మి రమ్య చెవి పట్టుకుని చిన్నగా లాగి “సెన్సిటివ్ అది మనం సృష్టించుకున్నాం. ఒక్కసారి ఆ విషయాన్ని మన బ్రెయిన్ లో నుంచి తీసేస్తే ఇక సెన్సిటివ్ అనే పదమే ఉండదు, అయినా ఎంత కష్టం వచ్చినా నిలబడి బ్రతికేది ఆడది” అని అన్నది మహాలక్ష్మి..
టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది, అంతకుమించి రమ్య మహాలక్ష్మి ఇద్దరూ బాధపడుతున్నారు వాళ్ళని డైవర్ట్ చేయాలి అనుకున్న గణేష్ “రేయ్ ఏంట్రా ఇది తినడానికి ఇక్కడికి తీసుకొని వచ్చారు కానీ ఇక్కడ ఏమో డైలీ సీరియల్ నడుస్తుంది నాకు ఆకలి వేస్తుంది” అని ఫేస్ డల్ గా పెట్టి చిన్న పిల్లాడిలా అమాయకంగా అడిగాడు గణేష్.
అప్పటివరకు వాళ్ళ జీవితంలో జరిగినవి ఆలోచిస్తూ ఉన్నా మహాలక్ష్మి రమ్య ఇద్దరు గణేష్ ఫేస్ చూసి చిన్నగా నవ్వేశారు.