ప్రేమలో పడితే -19
కానీ ఇక్కడ శ్రీరామ్ ఒక ఫైల్ తర్వాత మరొక ఫైల్ అంటూ మహాలక్ష్మిని బయటకు వెళ్ళనివ్వకుండా అక్కడే లాక్ చేసేసాడు.
నేను వెళ్లి చూసి వస్తాను అని రమ్య శ్రీరామ్ క్యాబిన్ కి వెళ్తుంటే,
గణేష్ ఆపి నువ్వు ఎందుకులే నేను వెళ్తాను అని అన్నాడు.
” నువ్వు వద్దు నేను వెళ్లి కనుక్కొని వస్తాను” అంటూ రమ్య శ్రీరామ్ కాబిన్ లోపలికి వచ్చింది. అక్కడ మహాలక్ష్మి బిజీగా వర్క్ చేస్తూ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది.
ఈ మహాలక్ష్మి ఏదో తిక్క పని చేసి ఉంటుంది ఈ అన్నయ్యకి బీపీ పెరిగి ఉంటుంది ఇలా బయటికి వెళ్ళనివ్వకుండా పనిష్మెంట్ ఇచ్చి ఉంటాడు అని రమ్య మనసులో అనుకొని అన్నయ్య అని పిలవాలి అనుకున్నది కూడా లాస్ట్ సెకండ్ లో ఆగిపోయి సార్ అని పిలిచింది..
మహాలక్ష్మి ని బయటికి వెళ్ళకుండా ఆపేశాను అని ఆనందంలో చుట్టూ జరుగుతున్నది మర్చిపోయి వర్క్ లో లేనమైపోయి ఉన్నా శ్రీరామ్కి సార్ అనే పిలుపు వినిపించడంతో తల ఎత్తి చూసాడు.