ప్రేమించా కొత్తగా 💖 – 1
హైదరాబాద్….
సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు..
రోడ్డు మీద వాహనాలు రక రకాల శబ్దాలు చేసుకుంటూ, వేగంగా పరుగులు పెడుతూ ఉన్నాయి…
ఆ వాహనాలు నడిపే వాళ్ళు వాళ్ల వాళ్ల గమ్యాలు చేరడం కోసం, తమ వాహనాలను పరుగులు పెట్టిస్తున్నారు…
అలా రోడ్డు మొత్తం గజిబిజిగా, వాహనాల శబ్దాలతో,జనాల రద్దీతో నిండిపోయి వుంది…
అదే రోడ్డు మీద ఒక అబ్బాయి ఆరడుగలకి కొంచెం తక్కువ హైట్ లొ , మహేష్ బాబులాంటి మంచి మిల్కీ వైట్ కలర్ తో, స్మార్ట్ లుక్ ,సిల్కీ హెయిర్, కిల్లింగ్ స్మైల్ తో,వైట్ కలర్ షర్ట్, విత్ బ్లాక్ కలర్ ప్యాంటు వేసుకుని ,నీట్ గ టక్ చేసుకుని, కళ్ళకి స్టైలిష్ స్పెడ్స్ పెట్టుకుని , ఆఫీస్ నుండి తన బైక్ మీద తన రూమ్కి వెళ్తు ఏ టైం లో స్టార్ట్ అయిన ఈ ట్రాఫిక్ మాత్రం తగ్గదు అని నిట్టూరుస్తూ ఉంటాడు …
సరిగ్గా అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది.దాంతో ఆ అబ్బాయి ఈ టైంలో ఎవరు కాల్ చేసి ఉంటారు అనుకుంటూ…
తన జేబులో నుండి మొబైల్ బయటకి తీసి కాల్ చేసింది ఎవరా అని చూడగా అమ్మ కాలింగ్ అని స్క్రోల్ అవుతూ ఉంటుంది…
దాంతో తన బైక్ ని రోడ్డు పక్కన ఆపి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో అమ్మా ఎలా ఉన్నావ్ అని అదే స్మైలీ ఫేస్ తో అడుగుతాడు..
అవతల నుండి హా “రిషి” నేను బాగున్నాను నాన్న… నువ్వెలా ఉన్నావ్ అంటూ చాలా ప్రేమగా అడుగుతుంది అతని తల్లి..
హా మా నేను కూడా చాలా బాగున్నాను… ఏంటి మా ఈ టైమ్ లో కాల్ చేసావ్… ఏదన్న ముఖ్యమైన విషయమా అని అడిగాడు రిషి.. తన తల్లి తనకి ఎప్పుడూ రాత్రిపూట మాత్రమే కాల్ చేస్తుంది…ఎప్పుడంటే అప్పుడు కాల్ చేసి విసిగించదు కదా అని మనసులో అనుకుంటూ …
హ రిషి… నీకో విషయం చెప్తాము అని కాల్ చేశాను.. మేము నీ కోసం ఒక సంబంధం చూసాము..నువ్వు ఒక రోజు లీవ్ పెట్టుకుని ఊరికి వస్తే మనం వెళ్లి అమ్మాయిని చూసొద్దాం అని తను ఆ సమయంలో కాల్ చేయడానికి గల రీజన్ని చెప్తుంది అతని తల్లి చాలా సౌమ్యంగ….
ఆ మాటలు విన్న రిషి మొహం లో నవ్వు మాయం అవగా…కొంచెం అసహనంగా ఫీల్ అవుతూ అబ్బా ఇప్పుడే నా పెళ్ళికి తొందరేంటమ్మ..ఇంకొన్ని రోజుల తర్వాత చూద్దాంలే అంటాడు..
కానీ అవతల అతని అమ్మ అదేంటి నాన్న అలా అంటావ్? ఇంకా నువ్వేమైనా చిన్నపిల్లాడివా ఏంటి? అప్పుడే పెళ్లి వద్దు అనడానికి…
నీతోటి పిల్లలందరికీ ఎప్పుడో పెళ్లిళ్లు అయిపోయి, ఒకరిద్దరు పిల్లల్ని కూడా కంటేను… నువ్వింకా అప్పుడే పెళ్లేంటి అంటావ్ అంటూ కాస్త గ్యాప్ తీసుకుని అవును నాన్న ఇంతకీ నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఆ విషయం మాకు చెప్పలేక ఇలా ఎప్పటికప్పుడు పెళ్లి మాటలు దాటేస్తున్నావా అని అనుమానంగా అడుగుతుంది…
ఆ మాటకి వెంటనే అయ్యో అలాంటిదేం లేదమ్మా అంటాడు రిషి..
నిజంగా నువ్వు ఎవర్ని ప్రేమించట్లేదు కదా కన్న… అలాంటిదేమైనా ఉంటె చెప్పు… ఆ అమ్మాయితోనే నీ పెళ్లి జరిపిస్తాం అని మరొకసారి చెప్తుంది ఆవిడ …
అయ్యో మా నేను నిజమే చెప్తున్నాను… నేను ఎవర్ని ప్రేమించట్లేదు అని చెప్తాడు రిషి ..
ఆ మాటకి వాళ్ళ అమ్మ సరే కన్న అలా ఐతే మంచి రోజు చూసుకుని నీకు చెప్తాను… నువ్వు లీవ్ పెట్టి ఇంటికి వచ్చేయ్ అని చెప్తుంది…
అబ్బా ప్లీజ్ అమ్మా ఇంకొన్ని డేస్ అయ్యాక చూద్దాం అని అంటూ ఉండగానే .. రిషి ఇంక నువ్వేం మాట్లడకు… ఇంక నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను…
ఇన్ని రోజులు నువ్వు ఏం చేసిన నేను వద్దు అని అడ్డు చెప్పలేదు .. కానీ నువ్వు ఎప్పుడు పెళ్లి మాటెత్తిన ఇలానే కొన్ని రోజులు ఆగండి అంటూ రెండేళ్ల నుండి చెప్తూనే ఉన్నావ్ … మేము వింటూనే ఉన్నాం…ఇంక మా వల్ల కాదు …
నాకు మాత్రం నా కొడుకు పెళ్లి కళ్లారా చూసుకోవాలని ఉండదా? నీకు పుట్టే పిల్లల్తో సరదాగా ఆడుకోవాలని అనిపించదా?
కనుక నువ్వు ఇంకేం మాట్లాడకుండా పెళ్ళికి సిద్ధం అవ్వు అంటూ రిషికి మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా కాల్ కట్ చేస్తుంది.
దాంతో రిషి కట్ అయిన ఫోన్ వంకే చూస్తూ ఎందుకమ్మా ఎప్పుడు నా పెళ్లి గురించే ఆలోచిస్తుంటావ్….
అయినా నువ్వు ఏమడిగావ్ అమ్మా ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని కదా..ఇదే మాట నువ్వు ఇప్పుడు కాదమ్మా రెండేళ్ల క్రితం అడుగుంటే హ అమ్మా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను.
ఆ అమ్మాయే నా ప్రాణం అని భావిస్తున్నాను… తనే నా జీవితం అని చెప్పేవాడినేమో …కానీ ఇప్పుడు నేను నీతో ఆ మాట చెప్పలేనమ్మా.
ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరం అయిపోయింది.ఈ మాట నీతో ఎలా చెప్పగలనమ్మా..చెప్పి నిన్ను ఎలా బాధ పెట్టగలను అని చాలా బాధపడుతూ తన గతాన్ని తలుచుకుంటాడు.
continued….
Swipe left/right or tap the sides to turn pages