New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమించా కొత్తగా 💖 – 2

ప్రేమించా కొత్తగా 💖 – 2

గతం..

 

టూ ఇయర్స్ బ్యాక్…

 

  ఒక  కంపెనీ లో ఇంటర్వ్యూ కి  వెళ్లిన  రిషి     బయట  చైర్ లో కూర్చుని  తన  నేమ్  ఎప్పుడు  పిలుస్తారా  అనుకుంటూ కాస్త టెన్షన్ గా వెయిట్  చేస్తు  ఉంటాడు… 

 

 సరిగ్గా అప్పుడే  ఒక  అమ్మాయి ఆ  ఆఫీస్ లోకి  అడుగుపెడుతుంది .. తను  కూడా ఇంటర్వ్యూ  కోసమే  వచ్చింది.. 

 

ఆ అమ్మాయి  కూడా  చూడడానికి  రిషి లానే   అందంగా  ఉంది … 

 

తెల్లటి  రంగు, అయిదు అడుగుల రెండు అంగుళాల ఎత్తు, పింక్  కలర్  చుడీదార్  వేసుకుని,చూడచక్కగా, ట్రెడిషనల్ గా ఉంది… 

 

రిషి  ఆ  అమ్మాయిని చూడగానే తొలి చూపులోనే   మనసు  పారేసుకున్నాడు …తనని  రెప్ప  వేయడం కూడా మరచి  అలా చూస్తూ  ఉండి పోయాడు … 

 

అప్పుడే  అక్కడకి  ఆఫీస్  బాయ్ వచ్చి  మిస్టర్  రిషి  అంటే ఎవరు ? సార్  రమ్మని పిలుస్తున్నారు  అని  చెప్పడంతో  రిషి  ఆ అమ్మాయి  వైపు  నుండి ఎంతో   కష్టంగా చూపు మరల్చి నేనే అంటు లేచి ఇంటర్వ్యూ  చేసే  రూమ్ లోకి  వెళ్తాడు… 

 

అక్కడ  వాళ్ళడిగిన  ప్రశ్నలన్నిటికి కరెక్ట్గ  సమాధానం  చెప్పడంతో ఇంటర్వ్యూ లో   రిషి  సెలెక్ట్  అవుతాడు … 

ఆ ఆనందంలో   బయటకి  వచ్చిన అతను ఆ అమ్మాయి  కోసం  తన కళ్ళతోనే చుట్టు వెతుకుతాడు… 

 

బట్ ఉపయోగం  లేదు …ఇందాక ఆ  అమ్మాయి  ఉన్న  ప్లేస్ లో ఇప్పుడు ఆ అమ్మాయి  కనిపించలేదు …

దాంతో  రిషి ఆనందం ఒక్కసారిగా  ఆవిరయి పోయి తన  కోసం  అక్కడంతా  తెగ  వెతికేస్తాడు .. 

 

కానీ  మన  రిషి  బ్యాడ్  లక్  అనుకుంట ఆ అమ్మాయి ఆ ఆఫీస్ లో ఎక్కడ కనిపించ లేదు.. దాంతో  అక్కడి నుండి వెళ్ళిపోయింది ఏమో అనుకుంటూ మొహం  వేలాడేసుకుని  తన రూమ్కి  చేరుకుంటాడు…  

 

రిషి  అలా డల్ గా రూమ్ కి  రావడంతో  తన  ఫ్రెండ్ కం బ్రదర్ అయిన  శ్రీను ” శ్రీనివాస్”  ఏంటిరా  ఫేస్  అలా   వాడిపోయిన  ఆకుకూర  కట్టల వేలాడేసుకుని వచ్చావ్…ఇంటర్వ్యూ ఏమైంది? కొంపతీసి  ఇది  కూడా  పోయిందా… అదే అదే నో చెప్పి వచ్చేసావా  అని అడిగాడు… 

 

ఎందుకంటే మన రిషి బాబు ఎన్నో జాబ్స్ వచ్చిన అవి తనకి  నచ్చక, ఏ జాబ్లో అంటే ఆ జాబ్ లో, చిన్న కంపెనీస్ లో జాయిన్ అవ్వకూడదు..తన మనసుకు నచ్చిన జాబ్ లో  బెస్ట్ కంపెనీస్ లోనే జాయిన్ అవ్వాలి అని చాలా  జాబ్స్ రిజెక్ట్ చేసి వచ్చాడు..అందుకే శ్రీను అలా అడిగాడు…

 

శ్రీను అలా అడగ్గానే ఊహు లేదురా… నేను సెలెక్ట్  అయ్యాను… అదే ఆ జాబ్ కి ఓకే చెప్పాను…నాకు  జాబ్  కన్ఫర్మ్ అయింది… శాలరీ 50  k  అని   చెప్తాడు.. 

 

ఆ  మాట  విన్న  శ్రీను  చాలా హ్యాపీగా రిషిని  హగ్  చేసుకుని ,ఎంత  గుడ్  న్యూస్  చెప్పావ్ రా అంటూ  రిషిని  పట్టుకుని  తిప్పేస్తు ఏదో  తట్టిన వాడిలా… 

 

అవునురా జాబ్  వస్తే హ్యాపీగ ఉండాల్సింది  పోయి    ఇలా మాడిపోయిన  మసాలా  దోసల మొహం  పెట్టుకుని కూర్చున్నావ్ ఎందుకు?

 

విషయం ఏంటి?  నీకు  ఈ జాబ్  కూడా మనస్ఫూర్తిగా నచ్చలేదా  లేక  ఆ కంపెనీ నువ్వు ఎక్సపెక్ట్ చేసినంత మంచిది కాదా అంటూ  తన  అనుమానాన్ని  బయటపెడతాడు… 

 

అదేం  లేదురా  అది మంచి కంపెనీ అండ్  ఆ జాబ్  కూడా నాకు ఇష్టమే  అంటాడు రిషి .. 

 

మరి అన్నీ  బాగుంటే  నువ్వెందుకిలా ఉన్నావ్?    అసలేమైంది రా? నువ్వెందుకు  ఇంత  డల్ గ ఎప్పుడు లేనిది ఏదో  కోల్పోయినట్టు  మొహం అంత  దీనంగా  పెట్టుకుని  ఉన్నావ్ అని అడిగాడు శ్రీను … 

 

ఆ  మాటకి  రిషి  శ్రీనుతో ఆరోజు  ఆఫీస్ లో    జరిగింది మొత్తం చెప్తాడు… 

 

అంత  విన్న  శ్రీను  ఓహ్ అంటే  తమరు  ఇప్పుడు  ఆ  అమ్మాయి మిస్ అయిందని ఇలా ఫీల్  అవుతున్నారా  బాబు  అంటాడు  చాలా వెటకారంగా.. 

 

హ్మ్  అవునురా అంటు ఆ అమ్మాయిని తలచుకుంటూ మైమరచిపోతు రేయ్  ఆ  అమ్మాయి ఎంత  అందంగా  ఉందొ  తెలుసా? తనని  చూసిన  క్షణమే  నాలో ఏదో  తెలియని  ఫీలింగ్  వచ్చిందిరా…  

 

తను  నాకోసమే పుట్టింది అనిపించింది… తను  నా  కళ్ళ ముందు ఉన్నంత  సేపు నాకు  ఇంకేం  కనిపించలేదు అంటే  నమ్ము … 

 

  తనని  అలా ఎంత  సేపు చూస్తుండిపోయానో  నాకే  తెలియదు అంటూ ఎంతో ఉత్సాహంగా చెప్తూ… సడన్గా డల్ అయిపోయి , బట్ తన నేమ్ అయిన   తెలుసుకోలేకపోయాను రా… నా ఇంటర్వ్యూ  ఫినిష్  అయి వచ్చి చూసేసరికి  తను అక్కడ  లేదు..  

 

చాలా బాధగా  అనిపించింది శ్రీను…ఎందుకో  తనని  మిస్ అవుతున్నాను అన్న  ఫీలింగ్  వస్తుంది అంటూ  బాధపడతాడు… 

 

రిషి మాటలు  విన్న  శ్రీను  ఒరేయ్  ఒరేయ్ ఏంటి రా  నువ్వు  చెప్పేది? ఏదో  ఒక్కసారి  చూసావో  లేదో  అప్పుడే  ప్రేమ?తనని మిస్  అవ్వడం … నువ్విలా బాధపడుతూ  కూర్చోవడం , ఏమన్నా  అర్ధం వుందారా?ఎవరైనా నీ మాటలు వింటే  నవ్విపోతారు….

 

అయినా ఎప్పుడూ లేనిది కొత్తగా, నీ నోట్లో నుంచి ఇలాంటి మాటలు రావడం ఏంటో నాకు చాలా వింతగా అనిపిస్తుంది….

 

  ఇంక తన గురించి నువ్వు ఫీల్  అయింది  చాలుగాని..పోయి  ఫ్రెష్  అయిరాపో లంచ్  చేద్దాం…నాకు  ఆకలి  దంచేస్తోంది అంటాడు… 

 

తన బాధని ఏమాత్రం పట్టించుకోనట్టుగా, అదసలు పెద్ద మ్యాటర్ నే కాదు అన్నట్టుగా  మాట్లాడుతున్న శ్రీను మాటలకి,ఏంటి రా  నువ్వు ?

 

నేను తను  మిస్ అయిందని  బాధపడుతుంటే, తిండి  తిందాంరా  అంటావ్ ..నాకేం తినాలని లేదు…నువ్వెళ్ళి తిను  అని చెప్పి ఆ  అమ్మాయిని  తలుచుకుంటూ  ఉంటాడు…

 

 

Continued….