New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమించా కొత్తగా 💖 – 3

ప్రేమించా కొత్తగా 💖 – 3

రిషిని ఎప్పుడు అలా చూడని శ్రీను ఏంటిరా నువ్వు నిజంగానే ఆ అమ్మాయిని సీరియస్ గా లవ్ చేస్తున్నావా ?

 

 

అయినా అలా ఎలారా ఒక్కసారి చూడగానే ప్రేమ పుడుతుంది?తనెవరో ఏంటో, తన గురించి ఏం తెలియకుండా ఎలా అలా ప్రేమించేస్తావ్ అంటాడు…  

 

ఏమోరా.. అవన్నీ నాకు తెలియదు..అయినా ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు అండ్ ప్రేమించిన వాళ్ళ గురించి అన్నీ తెలిశాకనే ప్రేమించాలని రూల్ ఏం లేదు. 

 

అలాగే నాకు ఆ అమ్మాయిని చూడగానే ఎందుకో నా మనసుకు నచ్చేసింది .. అందుకే తను మిస్ అయిందని నా చిట్టిగుండె తట్టుకోలేకపోతుంది అంటాడు రిషి తన గుండె మీద చెయ్యి వేసుకుని…. 

 

ఆ మాటలకి రిషి నిజంగానే ఆ అమ్మాయిని ఎంతగానో ఇష్టపడుతున్నాడు అని అర్ధం చేసుకుని సరేలేరా నువ్వంత ఫీల్ అవ్వకు…

 

 

 నీ మాటల్లోనే అర్ధం అవుతుంది ఆ అమ్మాయి నీకు ఎంతగా నచ్చిందో అని, నీ ప్రేమ నిజం అయితే ఆ అమ్మాయి నీకు తప్పకుండ కనిపిస్తుంది.

 

ప్లీజ్ రా నాకు ఆకలేస్తుంది..ఇప్పటికైనా నువ్వు ఫ్రెష్ అయి వస్తే ఇద్దరం కలిసి తిందాం అంటాడు శ్రీను తన పొట్టపై చేయి వేసి తడుముకుంటూ … 

 

దాంతో రిషి శ్రీను ఆకలికి ఆగలేడని ఓకేరా ఇప్పుడే వస్తాను అంటూ వెళ్లి ఫ్రెష్ అయి వస్తాడు… 

రిషి వచ్చేసరికి శ్రీను అన్ని తెచ్చి సిద్ధంగా పెడతాడు. దాంతో ఇద్దరు కలిసి లంచ్ చేయడం స్టార్ట్ చేస్తారు.

 

తర్వాత  శ్రీను రిషికి బాయ్ చెప్పి తన  ఆఫీస్ కి వెళ్ళిపోయాడు… 

 

( ఆఫ్టర్నూన్  ఆఫీస్కెళ్ళడం ఏంటి అని అనుకుంటున్నారా శ్రీను ఇప్పటికే వేరే ఆఫీస్ లొ జాబ్ చేస్తున్నాడు..ఈరోజు ఏదో  వర్క్  ఉందని హాఫ్ డే  లీవ్ తీసుకున్నాడు…సో మధ్యాహ్నం నుండి  ఆఫీస్ కి  వెళ్తున్నాడు )

 

రిషి, శ్రీను చిన్నప్పటి నుండి  బెస్ట్  ఫ్రెండ్స్.. వాళ్ళది  నెల్లూరు జిల్లా లోని ఒక విలేజ్…ఇద్దరు  b.టెక్  కంప్లీట్ చేసి  హైదరాబాద్ కి వచ్చి  ఒక రూమ్ తీసుకుని ఉంటూ  ఒక కోచింగ్ సెంటర్ లో జాయిన్  అయి , 3 మంత్స్  కోచింగ్  తీసుకుంటారు.. 

 

రిషి కాలేజ్ టాప్పర్.. శ్రీను ఆవేరేజ్  స్టూడెంట్.. 

బట్ ఇద్దరు చాలా  క్లోజ్  ఫ్రెండ్స్ ..అలా కోచింగ్  ఫినిష్  అయ్యాక ఇద్దరు  జాబ్  ట్రైల్స్ వేస్తారు.. రిషి అన్ని  ఇంటర్వ్యూ స్  లో   సెలెక్ట్  అవుతాడు.. 

 

మనోడి  టాలెంట్  అలాంటిదిలెండి..బట్  రిషికి  ఏ కంపెనీ  నచ్చక అండ్  తన టాలెంట్ కి తగ్గ ప్యాకేజీ  కాదని  ఇంతవరకు ఎక్కడ  జాయిన్  అవడు.. 

 

మన  శ్రీను మాత్రం తనకి  అది రావడమే  గొప్ప  అన్నట్టు  ఒక మోస్తారు కంపెనీలో 20k  సాలరీకి  జాయిన్  అవుతాడు … 

 

అలా  శ్రీను ఆఫీస్ కి,రిషి  జాబ్  ట్రైల్స్ లో ఇంకో నెల  రోజులు  గడిచిపోయాయి.. జాబ్ సెర్చింగ్ చేస్తున్న రిషికి   పేపర్లో పలానా  కంపెనీ లో, పలానా రోజు   ఇంటర్వ్యూ  జరుగుతున్నాయి అని వేయడం కనిపించి,  ఆ కంపెనీ కి  మంచి  పేరు  ఉండడంతో  మన  హీరో గారు  ఇంటర్వ్యూ కి అటెండ్  అవ్వడం, సెలెక్ట్  అవ్వడం  దానికి  బోనస్ గా అమ్మాయిని  కూడా  చూసి ప్రేమలో పడి రావడం  ఇలా  అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గ  జరిగిపోయాయన్నమాట… 

 

శ్రీను  ఆఫీస్ కి  వెళ్ళిపోయాక డోర్ లాక్  చేసేసి  వచ్చి   కొంచెం  సేపు  టీవీ చూస్తాడు రిషి … కాసేపటికి అది బోర్ కొట్టి  కొద్ది సేపు ఫోన్ లొ గేమ్ ఆడుతాడు.. 

 

ఆ తర్వాత  అలసటగా  ఉండడంతో  బెడ్ రూమ్ కి  వెళ్లి పడుకుంటాడు.. అదేంటో వింతగా  పడుకున్న కాసేపటికే  నిద్రాదేవి  ఆవహించినట్టుగా  గాఢ  నిద్రలోకి  జారుకున్నాడు… 

 

ఈవెనింగ్  మళ్ళీ శ్రీను ఆఫీస్ నుండి వచ్చి  కాలింగ్ బెల్  కొట్టె  వరకు  కూడా  మన రిషి గారు  నిద్ర లేవరు … 

పదే  పదే శ్రీను బెల్ కొట్టడంతో ఆ సౌండ్ కి  ఉలిక్కిపడినట్టు  లేచి  కూర్చుని,  టైం చూసి  ఓహ్ గాడ్ టైం 7  అయిందా..శ్రీను కూడా వచ్చినట్టున్నాడు నేనేంటి  ఇలా  నిద్రపోయాను  అనుకుంటూ మెల్లిగా బయటకి వచ్చి  డోర్  ఓపెన్  చేస్తాడు… 

 

ఎదురుగ  శ్రీను  రిషిని  కొట్టేలా చూస్తున్నాడు.అది  చూసిన రిషి ఏంటి బే అలా కోపంగా  చూస్తున్నావ్  అంటాడు… 

 

కోపంగా  చూడగా  ఇంకెలా  చూడాలిరా నీ మామ…  అరగంట  నుండి  చేతులు  నొప్పి పుట్టేలా  కాలింగ్  బెల్  కొడుతూనే  ఉన్నాను.. డోర్  ఓపెన్  చేయడానికి  ఇంత  సేపా? అంతలా  ఏం వెలగబెడుతున్నారు  సార్  లోపల  అంటాడు  గుర్రుగా  చూస్తూ… 

 

ఏం లేదురా..మధ్యాహ్నం  ఆఎండలో బయటకి వెళ్లి  వచ్చాను  కదా.. చాలా  టైడ్ గా అనిపించి  కొద్దిసేపు  అలా  పడుకున్నాను…ఏంటో  నాకే  తెలియకుండా  మొద్దు  నిద్ర పట్టేసింది.నువ్వొచ్చి బెల్ మోగిస్తుంటే ఆ సౌండ్ కి మెలుకువ వచ్చి  నిద్ర  లేచాను  అని  చెప్తాడు రిషి.

 

 

continued….