“అమ్మా… మేము ఇప్పుడు బుడ్డోడిని దత్తత తీసుకోవాలంటే ముహూర్తం చూశారా మీరు?” అని యశోద గారి దగ్గరకు వస్తూ అడిగాడు యష్.
“చూడలేదు రా… చూపించాలి. పంతులుగారిని అడిగి మంచి ముహూర్తం పెట్టించాలి,” అని చెప్పారామె.
“అలాగే అమ్మా! ఇక అంతా అయిపోయింది కదా… వెళ్ళిపోదామా?” అంటూ అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు.
“ఇప్పుడే వెళ్లిపోవడం ఏంట్రా? బంధువులందరూ ఉన్నారు కదా! కాసేపు వాళ్లతో మాట్లాడి వెళ్దాం,” అన్నారు యశోద గారు.
“అది కాదు అమ్మా… బాబుని ఎక్కువసేపు బయట ఉంచడం నాకు ఇష్టం లేదు. వాడు ఇంకా చిన్నపిల్లాడు కదా! ఇంటికి వెళ్లి హాయిగా రెస్ట్ తీసుకుంటాడు. అందుకే వెళ్ళిపోదామంటున్నాను,” అన్నాడు యష్.
కొడుకు మాటల్లోని ఆతృతను గమనించిన యశోద గారు ఇంకేమీ అనలేకపోయారు.