51
అతను ఆమెకు అలా పెదవుల మీద ముద్దు పెట్టడం కొత్తమి కాదు, కానీ ఇప్పుడు ఇలా అతని ఇంటిలో అతని రూమ్లో అతని బెడ్ మీద అతని భార్యగా మారిన శౌర్య పెదవులు అందుకోవటం మాత్రం తనకి చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఇష్టంగా ముద్దు పెడుతున్నాడు. అంతకుమించి అతని ప్రేమ ఆ ముద్దులో తెలుస్తుంటే శౌర్య మరో లోకంలో తేలిపోతుంది..
అతనికి కోపం వస్తే ముద్దు చాలా హార్డ్ గా ఉంటుంది. ప్రేమతో పెడుతున్నప్పుడు తామర పువ్వు మీద ఝుమ్మని తుమ్మెద వాలి ఆ తామరలోని మకరందాన్ని తాగుతుంటే ఎలా ఉంటుందో అతని ప్రేమతో పెట్టే ముద్దు కూడా అంత మధురంగా ఉంటుంది. కోపంలో అయితే తేనెటీగ తామర పువ్వుని కుట్టిన ఫీలింగ్ కలుగుతుంది అనుకోండి అది వేరే విషయం.
అలా అయిదు నిమిషాలు ఇష్టంగా ప్రేమతో ఆమెకు ముద్దు పెట్టి పైకి లేచి ఆమె వైపు చూసాడు. అప్పటివరకు ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉన్న శౌర్య అప్పుడే చిన్నగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది.
అతను నవ్వుతూ అల్లరిగా కన్ను కొట్టడంతో వెంటనే కళ్ళు మూసుకొని అతని చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకుని అతని గుండెల్లో ఒదిగిపోవాలి అనుకున్నది కానీ తన చేతులు అతని చేతుల్లో బంధి అయిపోవడంతో, కుదరక అతని గుండెల్లో ఒదిగిపోవాలి అన్న కూడా అతను కొంచెం పైకి జరిగి ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించి చిన్నగా పెదవుల మీద నవ్వుని దాచుకోవడానికి ట్రై చేస్తూ ఫేస్ పక్కకు తిప్పుకుంది.
ఆమె ఫేస్ పక్కకు తిప్పుకోవటంతో రౌద్రా కి ఆమె మరింత అందంగా కనిపించడంతో ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి అప్పటివరకు తన చేతుల్లో బంధీగా ఉన్న ఆమె చేతుల్ని వదిలిపెట్టి తన చేతుల్ని ఆమె చుట్టూ వేసి గట్టిగా పట్టుకొని తన బిగి కౌగిలిలో బంధించేశాడు..