తల పట్టుకుంటూ ” చూసుకోలేదు సిద్దు. ఎవరో వెనక నుండి తోసినట్టు అనిపించింది ” అంది.
సారిక, సంయుక్త ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఇదేంటి కాళ్ళు అడ్డు పెట్టాను అని చెప్పకుండా ఎవరో తోసారు అని చెప్తుంది అనుకునీ ” శ్యామ్ ఇది నిన్ను ఇరికిస్తుoది ” అంది సారిక.
” నన్ను ఎందుకు ఇరికిస్తుంది “
” ఎందుకు అంటావు ఎంటి. నిన్ను అన్నయ్య దృష్టిలో బ్యాడ్ చేయడానికి ” అని మాట్లాడుకుంటూ వుండగానే
” నిన్ను ఎవరు తోసారు ” అన్నాడు సిద్దు.
” నా వెనక సంయుక్త ఉంది. మరి తనో కాదో ” అంది.