రోజులు ఎవరి కోసం ఆగకుండా ఆనందంగా గడిచిపోతున్నాయి………. !! పెళ్లయిన కొత్తలో ఒకరి అలవాట్లు మరొకరికి కాస్త కొత్తగా అనిపించినా మెల్లమెల్లగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు………. !! అప్పుడప్పుడు చిన్న చిన్న అలకలు, సరదా గొడవలు వచ్చినా అవి ఎక్కువసేపు ఉండేవి కావు……… !!
శ్రీ ఏదైనా విషయానికి అలిగితే అర్జున్ తన మాటలతో శ్రీ ను ఆటపట్టిస్తూ నవ్వించేవాడు………. !! అర్జున్ ఏదైనా వర్క్ స్ట్రెస్ లో ఉంటే శ్రీ అర్జున్ కి సపోర్ట్ గా నిలబడేది……. !! ఇలా ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకుంటూ, చిన్న చిన్న ఆనందాలను పంచుకుంటూ వాళ్ల కాపురం మెల్లగా అందమైన ప్రయాణంలా మారుతోంది………. !!
వాళ్ల మధ్య ప్రేమను వాళ్ళు మాటల్లో చెప్పుకోకపోయినా, ఒకరి పట్ల మరొకరికి ఏర్పడుతున్న ఇష్టం మాత్రం రోజురోజుకీ పెరుగుతోంది……….. !!
అలా వాళ్లిద్దరికీ పెళ్లయి సరిగ్గా ఒక నెల గడిచిపోయింది……….. !! అసలు ఎలా గడిచిందిందో కూడా తెలియనంతగా రోజులు చాలా ఫాస్ట్ గా అయిపోయాయి………. !!
ఈ నెల రోజులలో అర్జున్ జాబ్ కోసం ఎన్నో కంపెనీలు తిరిగాడు……….. !! తన క్వాలిఫికేషన్‌కు తగ్గ జాబ్ కోసం చాలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ ఎక్కడా అర్జున్ అనుకున్నంత మంచి అవకాశం దొరకలేదు………. !!