బావా ఏంటిది………??
ఇది 2 క్రోర్స్ చెక్ అర్జున్ ప్రెసెంట్ ఉన్న సిచుయేషన్ లో మీ ఇద్దరికీ ఇక్కడ మంచి జాబ్స్ దొరకడం కాస్త కష్టం అని నాకు తెలుసు……….. !! అందుకే ఈ డబ్బుతో ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయండి అందులో సక్సెస్ అయ్యి మీరిద్దరూ సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు……..!! దన్విత్ చెప్పింది విన్న అర్జున్ ఆ చెక్కును తిరిగి అతని చేతిలో పెడుతూ………… !! బావ సీరియస్లీ నాకు దీని అవసరం లేదు ప్లీస్ మరో సారి మన మధ్య డబ్బు మ్యాటర్ తీసుకుని రాకండి………. !!!
అర్జున్ ఎందుకలా ఆలోచిస్తున్నావ్……….?? నేను ఇది పరాయివాడికి ఇస్తున్న డబ్బు కాదు నా చెల్లి సంతోషం కోసం చేస్తున్న చిన్న ప్రయత్నం కాదనకుండా తీసుకో………….!!
మీ ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను బావ……… !! కానీ నా భార్యను సంతోషంగా చూసుకునే బాధ్యత నాది ఆ బాధ్యతను నేను మరొకరికి అప్పగించలేను ప్లీస్ నన్ను బలవంత పెట్టద్దు……..!!
ధన్విత్ అర్జున్ మాటలకు చిన్నగా నవ్వుతూ నీ ఆలోచన నాకు నచ్చింది అర్జున్ కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం మొహమాటపడకుండా అడుగు………. !!
అర్జున్ చిరునవ్వుతో నాకు మైసూర్‌లోని ఒక మంచి కంపెనీలో జాబ్ కన్ఫర్మ్ అయింది బావ…….. !! ఇంకో రెండు రోజుల్లో మేమిద్దరం అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాం………..!!