New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమ దూరమైన తర్వాత 💔 – 2

ప్రేమ దూరమైన తర్వాత 💔 – 2

సాయంత్రం  స్కూల్ అయిపోయాక తన కొడుకు శ్రేయస్‌తో కలిసి నడుచుకుంటూ వస్తోంది నిత్య……….. !!  దారిలో శ్రేయస్ కి ఇష్టమైన ఐస్‌క్రీమ్ కనిపించగానే అది వాడికి కొనిపెట్టి మెల్లగా నడుస్తూ వెళ్తున్నారు…….. !! నిత్య పక్కనే నడుస్తున్న రక్ష నిత్య వైపు చూస్తూ అదేంటి నిత్య  మేడమ్ చెప్పగానే మంగళూరుకి షిఫ్ట్ అవ్వడానికి వెంటనే ఒప్పేసుకున్నావు……..?? To be honest ఈ ఊరిని వదిలి వెళ్లాలంటే నీకు ఏమాత్రం బాధ గా అనిపించడం లేదా……..?? ఫోర్ ఇయర్స్ గా ఈ సిటీ నీకు షెల్టర్ ఇచ్చింది & నీకు ఇక్కడ ఎన్నో కొన్ని మెమోరీస్ ఉంటాయి కదా అలా ఎలా అన్నిటినీ వదిలేసి వెళ్ళాలి అనుకున్నావ్……….. ??

 

 

 

నిత్య రక్ష వైపు చూసి విరక్తిగా నవ్వుతూ……… !! లేదు రక్షూ… ఎందుకు బాధపడుతాను చెప్పు? నువ్వు చెప్పేది నిజమే ఈ ఊరు నాకు చాలా మెమోరీస్ ను ఇచ్చింది …………. !!  But life means change right…… ?? జీవితంలో వచ్చే changes ని accept చేయక తప్పదు కదా అని బాధగా చెప్తూ……… !! చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకున్న సొంత కుటుంబాన్నే ఒకరి లవ్ ని బ్లైండ్‌గా నమ్మి వదిలేసి వచ్చేశాను……….. !! అలాంటిది ఇప్పుడు ఏ ఊరినీ  , మనుషుల్నీ మనసుకి బాగా దగ్గర చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యాను……… !!  It really hurts me తన

మాటల్లోని లోతైన బాధను అర్థం చేసుకున్న రక్ష కంగారుపడుతూ……… !! సారీ నిత్య నేను అనవసరంగా మాట్లాడి నీకు పాస్ట్ మెమోరీస్ ని గుర్తొచ్చేలా చేశాను I am so sorry నిత్య……… !! అదేం లేదు రక్షూ  it’s ok ముందు నువ్వు దీని గురించి ఇంట్లో ఆంటీతో మాట్లాడు………… !! ఎందుకంటే ఇంకో టెన్ డేస్‌లో మనం మంగళూరు బయలుదేరాలి……… !! అని మాట్లాడుకుంటూ ఇద్దరూ ఒకరికొకరు సెండ్ ఆఫ్ చెప్పుకుని తమ ఇళ్లకు వెళ్లారు……… !! ఇంటికి వెళ్లగానే నిత్య శ్రేయస్‌కు బాత్ చేయించి తినడానికి స్నాక్స్ ఇచ్చి, టీవీలో కార్టూన్స్ ఆన్ చేసి పెట్టి  తాను కిచెన్‌లోకి వెళ్లి వంట పనుల్లో పడింది……… !!

 

 

 

కొద్దిసేపటికి మమ్మీ అంటూ కిచెన్ లోకి వచ్చిన శ్రేయస్  నిత్య చీర కొంగు పట్టుకుని నిలబడ్డాడు……… !! నిత్య శ్రేయస్ వైపుకు తిరిగి  What happened Shreyas అని ప్రేమగా తన ముందు నీస్ మీద కూర్చుంటూ అడుగుతుంది ……… !! శ్రేయస్ తన అమాయకపు కళ్లతో నిత్య వైపు చూస్తూ మమ్మీ నాకు పప్పా… తాతయ్య…. అమ్మమ్మ….. ఎవరూ లేరా…….?? నా ఫ్రెండ్ అనూ ఇంట్లో చూడు వాళ్ల డాడీ తనతో ఎంత బాగా ఆడుకుంటారో ………. ?? మరి నాకెందుకు Dad లేరు నన్ను చూడ్డానికి ఎందుకు రారు అని అడుగుతాడు……. !! ఆ మాట వినగానే నిత్య గుండె ఘల్లుమంది  గుండెల్లో ఎవరో కత్తితో పొడిచినట్టు కళ్లలో నీళ్లు తిరుగుతుంటే బలవంతంగా పెదవుల మీద నవ్వు తెచ్చుకుంటూ ………. !! ఎవరు చెప్పారు బంగారం నీకు ఎవరూ లేరని మనకు అందరూ ఉన్నారు……… !!

 

 

 

నిజమా మమ్మీ మరి ఎక్కడున్నారు …….. ??

 

 

 

అది మమ్మీ వాళ్ల మనసు ను హర్ట్ చేసింది  నాన్న…………. !! అందుకే వాళ్లు మమ్మీతో మాట్లాడటం మానేశారు……..    !!  It’s all my mistake  నువ్వు కొంచెం big boy అయ్యాక మనిద్దరం వాళ్ల దగ్గరకు వెళ్దాం………. !! నీకు తెలుసా అక్కడ నీకు ముగ్గురు అమ్మమ్మలు, ముగ్గురు తాతలు, నలుగురు మామయ్యలు, నలుగురు అత్తయ్యలు ఇలా అందరూ ఉన్నారు……!! నిన్ను వాళ్ళు నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటారు ఒకే అని చెబుతుండగానే నిత్య ఎమోషనల్ అవుతూ శ్రేయస్ ను గట్టిగా హాగ్ చేసుకుని ఏడ్చేస్తుంది………. !! నిత్య  ఏడవడం చూసిన శ్రేయస్ కంగారుపడిపోతూ తన చిన్నచిన్న చేతులతో నిత్య కళ్లలోని నీళ్లను తుడుస్తూ …….. !! మమ్మీ please don’t cry! నాకు ఎవరూ వద్దు నువ్వు ఒక్కదానివే చాలు……… !! I love you Mummy ఇంకెప్పుడూ వాళ్ళ గురించి అడిగి నిన్ను హర్ట్ చేయను అని చెప్పి నిత్య బుగ్గపై ముద్దు పెడుతున్న………. !! శ్రేయస్ అమాయకత్వానికి, ప్రేమకు నిత్య కళ్లు తుడుచుకుని సరే నువ్వెళ్ళి టీవీ చూస్తూ మమ్మీ ఈ లోగా డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది అని శ్రేయస్ ను మళ్లీ టీవీ ముందు కూర్చోబెట్టి ………. !! నిత్య కిచెన్‌లోకి వచ్చింది కానీ  ఆమె మనసంతా పూర్తిగా తన గతం వైపు పరుగెత్తింది……… !!

 

 

 

మాది కూర్గ్ ఎంతో అందమైన, పచ్చని కొండల మధ్య ఉండే ప్రశాంతమైన ప్రాంతం……….. !! మడికేరిలో మా ఫ్యామిలీ కి ఎంతో respect అండ్ status ఉండేది………. !!  వేల ఎకరాల కాఫీ తోటలు, పెద్ద పెద్ద బిజినెస్‌లు ఒక్క మాట లో చెప్పాలంటే మాకు ఆస్తిపాస్తులకు కొదవే లేదు…….. !! “మాచి మాడ” ఫ్యామిలీ అంటే ఆ ప్రాంతంలో తెలియని వారు ఉండరు……….. !! అంతటి పేరున్న పెద్ద కుటుంబం లో పుట్టిన ఒక్కగానొక్క ఆడపిల్లని నేను…….!!మా తాతయ్య అచ్చయ్య, అమ్మమ్మ కావేరమ్మలకు ముగ్గురు కొడుకులు ……… !! వాళ్లే బోపన్న, దేవయ్య, కుశాలప్ప  నా నాన్న పేరు కుశాలప్ప………. !!  ఇంట్లో తాతయ్య పెద్దవారే అయినా  family decisions అన్నీ పెద్దనాన్న బోపన్న గారే తీసుకునేవారు……… !! ఆయనే మా ఇంటి పెద్ద. ఇక పెద్దమ్మ జానకి, రెండో పెద్దమ్మ జాజీ, మా అమ్మ క్రాంతి……… !! పెద్దనాన్నకు ఇద్దరు కొడుకులు  జతిన్, జనిత్ &  దేవయ్య పెద్దనాన్న కొడుకు నివిన్……… !! నా  సొంత అన్నయ్య పేరు ధన్విత్.నలుగురు అన్నలు, ముగ్గురు నాన్నలు, ముగ్గురు అమ్మలు, తాతయ్య, అమ్మమ్మ  వీళ్లందరి గారాబంలో పెరిగిన చిన్న రాకుమారిని నేను……. !! మా కుటుంబంలో వరసగా నాలుగు ఐదు తరాలుగా ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదట……… !!  అమ్మ రెండోసారి pregnant అయినప్పుడు ఈసారైనా ఆడపిల్ల పుడితే బాగుణ్ణు  అని మా ఇంటి ఇలవేల్పు కావేరమ్మకు మొక్కుకున్నారట……….. !! అదృష్టవశాత్తూ పవిత్రమైన కావేరి సంక్రమణ రోజునే నేను పుట్టాను……… !! కానీ  నన్ను చూడగానే డాక్టర్ పెద్దనాన్నతో పాప చాలా వీక్‌గా ఉంది బతకడం కష్టం  అని చెప్పారట………. !!  ఆ మాట వినగానే ఇంట్లో వాళ్లంతా శోకసంద్రంలో మునిగిపోయారు………. !!

 

 

 

 

పెద్దనాన్న నన్ను ప్రేమగా గుండెలకు హత్తుకుని కన్నీళ్లతో  నాన్నకు ఇవ్వబోతుంటే  నేను నా చిన్న వేళ్లతో పెద్దనాన్న వేలిని గట్టిగా పట్టుకున్నానట……..!! అది చూసి డాక్టర్లు మళ్లీ నాకు ట్రీట్మెంట్ చేసి నన్ను కాపాడారు……… !!

అందుకే ఇంట్లో అందరికీ నాపై ఆన్ కండిషనల్ లవ్ ఉండేది………. !! ముఖ్యంగా పెద్దనాన్నకి నేను అంటే ప్రాణం  నేను ఏది అడిగినా వద్దు  అనే వర్డ్ ఆయన నోటి నుంచి వచ్చేదే కాదు………. !!  ఇంట్లో అందరూ పెద్దనాన్న మాట వింటే, పెద్దనాన్న మాత్రం నా మాట వినేవారు………… !! అందరూ ప్రేమగా నన్ను అమ్ము అని పిలిచేవారు & నాకు తినిపించే భోజనం దగ్గర్నుంచి, వేసుకునే dresses, టీవీలో ఏ ఛానెల్ చూడాలనే దానివరకు అంతా నా ఇష్ట ప్రకారం  నడిచేది………. !! బయటకు వెళ్తే నా నలుగురు అన్నలు నాకు బాడీ గార్డ్స్ లా ఉండేవారు………. !! వాళ్లు నాకంటే 10-15 ఏళ్లు పెద్దవాళ్లయినా, నా పాదాలు నేలకు తగలకుండా ఒక చిన్న పాపలా చూసుకునేవారు…….. !!

 

 

 

 

ఒకసారి స్కూల్లో వాలీబాల్ ఆడుతూ నా చేతులు ఎర్రబడ్డాయని తెలిసి ……… !!  పెద్దనాన్న, నాన్న, అన్నలందరూ కలిసి స్కూలుకి వెళ్లి మా పి.టి. సార్ తో గొడవ పడ్డారు……..!! ఇంట్లో ఎవరికైనా పెద్దనాన్న దగ్గర మనీ కావాలంటే నాతో రికమెండ్ చేయించుకునేవారు………… !!  అంత ప్రేమ మధ్య పెరగడం వల్ల నేను చాలా మొండిగా తయారయ్యాను……….. !! ఇన్ఫాస్ట్ వంటలు, ఇంటిపనులు ఇవేమీ నాకేమీ రావు……… !! చదువుకోవడం ఒక్కటే నా పని & ప్రతిరోజూ ఎవరో ఒకరు ప్రేమగా చేతిముద్దలు తినిపించేవారు……… !!  నిద్రవస్తే నాన్న లేదా పెద్దనాన్న ఒడిలో తలపెట్టి పడుకునేదాన్ని ……….. !! నేను నిద్రపోయాక అన్నలు నన్ను ఎత్తుకెళ్లి బెడ్‌పై పడుకోబెట్టేవారు…….. !! కాస్త జ్వరం వచ్చినా ఇంట్లో అందరూ అప్సెట్ అయి ఉపవాసాలు ఉండేవారు……… !! ప్రతి సంవత్సరం కావేరి సంక్రమణ మా కొడగులో పెద్ద పండుగ……… !! మా ఇంట్లో అయితే అది డబుల్ సెలబ్రేషన్  ఎందుకంటే ఆరోజే నా బర్త్డే……… !! అప్పుడు నా ఏజ్ 23 ఊరిలో  ఒక ప్రైవేట్ స్కూల్లో పిల్లలకు ఇంగ్లీష్ టీచర్‌గా జాబ్ చేస్తున్నాను……… !!  I just loved that job మనకి అంత ఆస్తి ఉంది నీకెందుకు ఈ జాబ్ అని ఇంట్లో అందరూ వద్దన్నా  ఒక రోజంతా ఫుడ్ తినకుండా స్ట్రైక్ చేసి మరీ ఆ జాబ్ సాధించుకున్నాను………. !! అంతా ప్రశాంతంగా, సంతోషంగా సాగిపోతోంది నా లైఫ్………. !! నా 23వ పుట్టినరోజు వచ్చే వరకు అంతా బావుంది…….. !! ఆ రోజే  నా జీవితంలో అతడిని మొదటిసారి చూశాను  ………….. !! అతని రాకతో నా జీవితం తలకిందులవుతుందని  నా వాళ్లే నన్ను వదిలేస్తారు అని అప్పుడు నాకు తెలియదు………. !!

 

 

కుక్కర్ విజిల్ శబ్దంతో నిత్య గతం నుంచి ప్రెసెంట్ లోకి వచ్చి  కళ్లలోని నీళ్లను తుడిచేసుకుని కొడుకు శ్రేయస్ దగ్గరకు నడిచింది………. !!

 

 

రాత్రి 10 గంటలు .!!

 

ముంబై !!

 

తన బంగ్లాలోకి అడుగుపెట్టాడు అర్జున్ భట్టాచార్య………. !! ఎప్పటిలాగే పీకల దాకా తాగి ఇంట్లోకి వస్తూ తడబడుతున్న అతడిని చూసి ……….. !!  సృష్టి పరుగెత్తుకుంటూ వచ్చి అర్జున్ చెయ్ పట్టుకుని  డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది………. !!

అన్నయ్యా ఇవాళ నీకు ఇష్టమైన స్వీట్ కుక్ చేశాను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు ప్లీస్…….. !! అంటూ బౌల్ లో స్వీట్ నవ్వుతూ సర్వ్ చేసి అర్జున్ ముందు పెడుతుంది సృష్టి……… !! ఆ స్వీట్ చూడగానే అర్జున్ మనసులో తనకు నిత్య తో ఉన్న  జ్ఞాపకం గుర్తొస్తుంది …….. !! ఆ స్వీట్ అంటే నిత్య కి చాలా ఇష్టం నువ్వు చేసే ఈ స్వీట్ బలే టేస్టీ గా ఉంటుంది అర్జున్ ఐ లవ్ ఇట్ అంటూ ………… !! ఆమె ముద్దుగా అన్న మాటలు అర్జున్ చెవుల్లో వినిపిస్తున్నాయి ……… !! గుండెను పిండేస్తున్న బాధతో అర్జున్ కష్టంగా నోరు తెరిచి నాకేమీ తినాలని లేదు సృష్టి  అని  చేర్ నుండి లేవబోయాడు అర్జున్……… !! అప్పుడే అక్కడికి వచ్చిన తన అత్తయ్య మానస  కోపంతో ఊగిపోతూ ……… !! వాట్ ఇస్ దిస్ అర్జున్ ప్రతిరోజూ ఇలా తాగడం ఏంటి నీకోసం ఇంట్లో అందరూ డిన్నర్ కూడా తినకుండా వెయిట్ చేస్తుంటే……….. ?? నువ్వు జరిగిపోయిన దరిద్రపు గతాన్ని  తలచుకుంటూ నీ కళ్ళ ముందు ఉన్న బ్రైట్ ఫ్యూచర్ ను చూడలేక పోతున్నావ్…….. ??

 

 

అర్జున్ ఆమె వైపు ఎర్రటి కళ్లతో చూస్తూ …….. !!

గతమా……..?? It’s not just past అత్త  నా భార్యను… నా కడుపున పుట్టిన బిడ్డను కోల్పోయాను……!! కానీ remember one thing ఇకపై నా  నా జీవితంలో ఎలాంటి changes జరగనివ్వను ……… !! అంటూ పక్కనే ఉన్న తన ఫాదర్ కేసవ్ వైపు సీరియస్ గా చూస్తూ……….. !! చూడండి మిస్టర్ కేసవ్ మీ చెల్లికి నోరు మూసుకుని ఉండమని చెప్పండి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే అందరికీ బావుంటుంది……… !! మరో సారి నా పర్సనల్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయితే ఇంత కూల్ గా అసలు ఆన్సర్ ఇవ్వను మైండ్ ఇట్……… !!

 

 

 

అర్జున్ కోప్పడకు తనకు అర్థం అయ్యేలా నేను చెప్తాను………. !! ఇప్పటికే నీ జీవితాన్ని మా చేతులారా నాశనం చేశాం కానీ ఇకపై నువ్వు తీసుకునే ప్రతి decision కి మా full support ఉంటుంది ………. !! కేశవ్ మాటలకు అర్జున్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు…….. !! ఇదంతా చూస్తున్న మానస కోపంతో ఉడికిపోతూ ఉండిపోయింది……….. !!

 

 

 

కొద్ది రోజుల తర్వాత…!!

 

 

తన ఓల్డ్ స్కూల్ లో రెస్పాన్సిబిలిటీ పూర్తి చేసిన నిత్య, తన ఫ్రెండ్ రక్షతో కలిసి అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి మంగళూరు కి స్టార్ట్ అవుతుంది…….. !! స్కూల్ మ్యానేజ్మెంట్ వాళ్లిద్దరికీ ఒక బెడ్‌రూమ్ ఉన్న చిన్న ఇంటిని accommodation గా ఇచ్చింది……… !! ఇల్లు చూడ్డానికి నార్మల్ గా చాలా పీస్ఫుల్ & కంఫర్టబుల్ గా ఉంది………. !! కొత్త ఊరు… కొత్త environment స్కూల్ రీఓపెన్ అవ్వడానికి ఇంకా టైమ్ ఉండటంతో ఇద్దరూ మంగళూరు అంతా తిరుగుతూ ఒక సాయంత్రం బీచ్‌కి వెళ్లారు……… !! విచిత్రంగా అదే సమయంలో అర్జున్ ప్రయాణం కూడా మంగళూరు వైపే సాగుతోంది…….!!

ఓన్లీ వన్ వీక్ ఉండి వస్తాను అని ఇంట్లో చెప్పి మంగళూరులోని తమ పాత ఇంటికి రీచ్ అయ్యాడు అర్జున్………. !! మరుసటి రోజు కుటుంబ దేవతకు మొక్కు తీర్చుకున్నాడు. ……… !! రోజుకో బిజినెస్ క్లయింట్‌ని కలుస్తూ కాలం గడుపుతున్నాడు…….. ;!

ఒక రోజు సృష్టి కొడుకు బీచ్ చూడాలని మారాం చేయడంతో ఫ్యామిలీ అంతా కలిసి బీచ్‌కి వెళ్లారు………. !!  అందరూ ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటుంటే అర్జున్ మాత్రం డిప్రెస్డ్ గా దూరంగా ఒక బెంచ్ మీద కూర్చున్నాడు……… !! అప్పుడే కొద్దిదూరంలో ఫుట్‌బాల్‌తో ఆడుకుంటున్న ఒక చిన్న బాబు అతని దృష్టిని ఆకర్షించాడు……… !! గుండ్రంగా, బొద్దుగా తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేలా క్యూట్ గా ఉన్నాడు ఆ బాబు…….. !!  ఆ బుడ్డోడు ఎంతో ఆనందంగా నవ్వుతూ ఆడుకుంటున్నాడు. …….. !! అది చూస్తూ తెలియకుండానే అర్జున్ ముఖంలో ఒక చిన్న నవ్వు వచ్చింది……… !! అంతలో ఆ బాబు తన్నిన బాల్ వచ్చి అర్జున్ కాలుకి తగిలింది…….. !! అది చూసిన ఆ బాబు వెంటనే అర్జున్ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ……… !!తన చిన్న చేతులతో రెండు చెవులు పట్టుకుని క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ సారీ అంకుల్ మిస్ అయి మీకు బాల్ తగిలింది అని ముద్దుగా చెప్పాడు……… !!

 

 

 

 

ఆ మాట వినగానే అర్జున్ గుండెల్లో తెలియని ఒక తండ్రి ప్రేమ ఉప్పొంగింది……… !! బాబును దగ్గరకు తీసుకుంటూ అరెరే దీనికి సారి ఎందుకు బంగారం అయినా ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావురా నువ్వు……… !! No need to say sorry kiddo అంటూ ………….. !! ఆ బాబు బుగ్గలు లాగి  తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అర్జున్…….. !!

 

 

 

నీ పేరేంటి లిటిల్ మాస్టర్…….. ??

 

శ్లేయస్….. !!

 

అర్జున్ నవ్వుతూ ఓహ్… శ్రేయస్ అన్నమాట…..!! Very nice name, buddy అంటూ తన ప్యాకెట్ లో ఉన్న చాక్లెట్ తీసి ఇచ్చాడు…….. !! కానీ శ్రేయస్ అది తీసుకోకుండా వద్దు అన్నట్టు తోసేశాడు…….. !! No uncle మా మమ్మీ చెప్పింది తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఏమీ తీసుకోకూడదని……. !! అప్పుడే అక్కడికి వచ్చిన రక్ష  శ్రేయస్… ఇక్కడున్నావా……. ?? కమ్ Let’s go, Mummy is waiting  అని పిలుస్తుంది…….. !! శ్రేయస్ అర్జున్ ఒడిలో నుంచి దిగుతూ Okay… Bye Uncle అని చేయి ఊపాడు…….. !! శ్రేయస్ తన నుండి వెళ్తుంటే అర్జున్ కళ్లు చెమర్చాయి ఎందుకో ఆ బాబును చూసినప్పుడల్లా తన అన్న అనుభూతి కలుగుతోంది……….. !!  తన చేతులారా కోల్పోయిన తన సొంత బిడ్డ గుర్తొచ్చి గుండె ముక్కలైంది……… !!కొంతసేపటి తర్వాత అర్జున్ బెంచ్ మీది నుంచి లేచి ఒంటరిగా అలల వైపు నడవడం ప్రారంభించాడు………. !!

అప్పుడే ఆల్ ఆఫ్ ది సడెన్ అర్జున్  గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది…….. !! మనసులో ఏదో తెలియని తీయని అనుభూతి…….. !!

 

 

 

అరే… ఇదేంటి? నా నిత్య పక్కన ఉన్నప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చేదో  ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తోంది ……… !! వై  అని ఆశ్చర్యపోతూ చుట్టూ చూశాడు……. !! అంతలో కొంచెం దూరంలో జనాల మధ్య అతని నిత్య  కనిపించింది…….. !! అది నిజంగానే ఆమేనా  లేక తన పిచ్చి భ్రమా……..?? అర్జున్ గుండె ఆగిపోయినంత పనైంది  ఆమె వైపు పిచ్చిగా పరుగెత్తడం ప్రారంభించాడు……… !!

 

 

Nithya! Nithya ……..?? అని అరుస్తూ ముందుకు పరిగెడుతున్నాడు ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తోంది………. !! అదే తన నిత్య! తన ప్రాణం!

ఇంకా ఐదారు అడుగులు వేస్తే ఆమెను పట్టుకుంటాడు అనుకుంటున్న సమయంలో అతని పాకెట్ లోని మొబైల్ రింగ్ అయింది……… !! అర్జున్ అడుగులు ఆగిపోయి డిస్‌ప్లే వైపు చూశాడు మళ్లీ ఫోన్ పాకెట్ లో పెట్టి తలెత్తి చూసేసరికి అక్కడ ఆమె లేదు…….!!ఆందోళనతో, భయంతో చుట్టూ వెతికాడు కొద్ది దూరంలో ఒక ఆటో ఎక్కి వెళ్తున్న నిత్య అతని కంటపడింది……… !! నిత్యా… నిత్యా ఆగు……అని అరుస్తూ అర్జున్ ఆ ఆటో వెనకాలే రోడ్డు మీద  తాగిన మైకంలోనే పరిగెడుతున్నాడు ………… !!  కానీ ఆటో వేగాన్ని అందుకోలేక  అలసిపోయి నడిరోడ్డుపై మోకాళ్లపై కూలబడిపోయాడు……….. !! కళ్ల నుంచి నీళ్లు కారుతుంటే వెళ్తున్న నిత్య వైపు బాధగా చెప్తూ ఉండిపోయాడు…….. !!

 

 

అర్జున్‌కు తన నిత్య నిజంగానే దొరుకుతుందా……..? శ్రేయస్ తన సొంత కొడుకే అని అర్జున్ తెలుసుకోగలడా………?

 

 

 

కొత్త కథతో మీ ముందుకు వచ్చేశాం… !!✨

ఈ కథలోని ప్రతి క్యారెక్టర్, ప్రతి ఎమోషన్ మీకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం………!!🥰

కథ చదువుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది , ఈ సీన్ ఇంకా బాగా ఉండాలి , తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుంది అనిపించినా… మీ మనసులో ఏ ఫీలింగ్ వచ్చినా మాతో తప్పకుండా షేర్ చేయండి……….!!💬❤️

ఎందుకంటే మీ కామెంట్స్ మాకు కామెంట్స్ మాత్రమే కాదు… మా కథను ఇంకా బాగా రాయడానికి మాకు వచ్చే చిన్న చిన్న ప్రోత్సాహాలు………!!. 🫶

మీకు ఈ కొత్త కథ నచ్చితే ఒక కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి……….!!

మీకు నచ్చిన క్యారెక్టర్ ఎవరు? ఎవరి సీన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు? కథ ఎలా వెళ్తుందని అనుకుంటున్నారు……..?? 👀

మీ ఒక్క కామెంట్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్… ఎందుకంటే ఈ కథ మాది మాత్రమే కాదు, చదువుతున్న మీ అందరిదీ కూడా……..!! ❤️✨