విజయవాడకు వెళ్లే ప్రయాణంలో మేఘన చాలా ఉత్సాహంగా ఉంది. కిటికీ పక్కన కూర్చుని బయట చూస్తున్న ఆమెను ఆదిత్య గమనిస్తున్నాడు.
“ఏంటి మేఘనా… హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఇంత మాట్లాడేదానివి. ఇప్పుడు ఇంత సైలెంట్‌గా ఉన్నావేంటి?”
“మా ఇంట్లో నిన్ను ఎలా పరిచయం చేయాలో ఆలోచిస్తున్నా.”
“సింపుల్‌గా నీ ఫ్లాట్మేట్ అని చెప్పేయ్.”
“అంత సింపుల్‌గా అయిపోదు. మా అమ్మకు అనుమానాలు ఎక్కువ.”
ఆదిత్య నవ్వాడు.
“అయితే నిజమే చెప్పు. నేను నీకు ఫ్లాట్మేట్ని కదా!”
మేఘన అతని వైపు చూసి చిన్నగా నవ్వింది.
“ప్రస్తుతానికి!”
ఆ ఒక్క మాట ఆదిత్య మనసులో ఏదో కొత్త ఆశను నింపింది.
కారు ఇంటి ముందు ఆగగానే కార్తీక్ పరుగెత్తుకుంటూ బయటకు వచ్చాడు.