మా అమ్మ ఇచ్చే డబ్బుల కోసం నన్ను పెళ్లి చేసుకున్నావా శాన్వి అంటే నీ దృష్టిలో నా విలువ అంతేనా……..?? నా ప్రేమకు, నా మనసుకు, నా జీవితానికి నీ దగ్గర ఉన్న విలువ అంతేనా………… !! అంటూ శాన్వి వైపు కోపంగా చూస్తూ ఆవేశంగా అడుగుతాడు శౌర్య………… !! తను అంటున్న మాటలకు శాన్వి గుండె ఒక్కసారిగా బరువెక్కింది………… !! శౌర్య క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడానికి శాన్వి దగ్గర ఎన్నో మాటలు ఉన్నాయి కానీ శౌర్య కళ్లలో కనిపిస్తున్న ద్వేషాన్ని చూసిన తర్వాత ఒక్క మాట కూడా శాన్వి నోటి నుంచి బయటకు రాలేదు………….. !! తన పెదవులు వణుకుతున్నాయి గొంతు కూడా మూగబోయింది చివరికి శాన్వి కళ్ల నుంచి కన్నీళ్లు మాత్రమే బుగ్గల మీదకు జారాయి……………. !!
కళ్ళ నిండా నీళ్ళతో తన వైపు చూస్తున్న శాన్వి వైపు చూస్తూ నిజం తెలిసినప్పుడు నాకు కూడా ఇలాగే ఇంత కంటే 100 టైమ్స్ ఎక్కువ బాధ కలిగింది………. !! నిన్ను అందరి అమ్మాయిలా ఎప్పుడూ చూడలేదు నిన్ను నేను ఎపుడు స్పెషల్ గానే చూసాను……… !! నా జీవితంలోకి నువ్వు వచ్చిన తర్వాత నా ప్రపంచమే మారిపోయిందనుకున్నాను………… !! నువ్వు నా భార్యవే కాదు నా జీవితంలో నాకు దొరికిన ఒక అందమైన వరం అనుకున్నాను………… !! కానీ నువ్వు కూడా అందరిలా డబ్బు కోసం ఏమైనా చేయగలవని తెలిసిన తర్వాత నీ మీద నేను పెట్టుకున్న నమ్మకం మొత్తం కూలిపోయింది…………. !! ఇన్నాళ్లూ నేను ప్రేమించినది నిన్నేనా? లేక నా ముందు నువ్వు చూపించిన ప్రేమంతా నటనేనా అంటూ కోపంగా అడుగుతాడు……… !!
ఒక్కసారి నా మాట వినండి శౌర్య మీరు నన్ను ఎంతగా ద్వేషించినా నేను భరిస్తాను………. !! కానీ నా ప్రేమను మాత్రం అబద్ధం అనకండి మీకు నిజం చెప్పడంలో నేను తప్పు చేశాను……….. !! ఆ తప్పుకు మీరు నన్ను శిక్షించండి కానీ నేను మీతో గడిపిన ప్రతి క్షణం అబద్ధమని మాత్రం అనకండి……… !! ఎందుకంటే మీతో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ యాక్ట్ చేయలేదు నా మనసులో ఉన్న ప్రేమను మాత్రమే మీకు చూపించాను అంటూ కన్నీళ్లతో చెప్తుంది శాన్వి ………… !!
ఛీ….. నన్ను అలా పిలవకు అలా పిలిచే రైట్ నువ్వు కోల్పోయి 24 ఆర్స్ అవుతుంది అంటూ ……….. !! శాన్వి మాటలను మధ్యలోనే ఆపిన శౌర్య ఇదంతా కాదు ముందు నాకు ఒక విషయం చెప్పు………. !! మన పెళ్లికి ముందే ఆ డబ్బుల విషయం నీకు తెలుసా లేదా అని సూటిగా చూస్తూ అడగ్గానే……….. !! శాన్వి ఒక్క క్షణం శౌర్య కళ్లలోకి చూసి తె…… తెలుసు అండి నాకు మ్యారేజ్ కి ముందే అమౌంట్ గురించి తెలుసు అని చాలా లో వాయిస్ తో చెప్తుంది……….. !! శాన్వి ఆన్సర్ విన్న శౌర్య ముఖం మరింత ఎర్రగా మారింది అంటే నీకు అంతా ముందే తెలుసన్నమాట………….!! మరి నాకు ఆ విషయం తెలియక నీతో నార్మల్ గా ఉంటుంటే నువ్వు మాత్రం అన్ని తెలిసి కూడా నా ముందు అమాయకంగా నటిస్తూ వచ్చావా………..?? నా ప్రేమను చూసి నీకు నవ్వొచ్చేదా నేను నీ కోసం ఏదైనా పిచ్చోడిలా చేస్తుంటే ………….. ?? నన్ను చూసి వీడు నన్ను పూర్తిగా నమ్ముతున్నాడు అని నీలో నువ్వే నవ్వుకునే దానివా……….. ??