ఒక పదిహేను నిమిషాలకి శౌర్య వైపు చూడకుండానే వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి బెడ్ పై కూర్చున్నాడు… అరణ్య్ అని శౌర్య పిలిచిన కూడా ఏం పలకకుండా లైట్ ఆఫ్ చేసి పడుకొని కళ్ళు మూసుకున్నాడు ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా అరణ్య్ రెస్పాండ్ అవ్వడు అని అదే బెడ్ పై శౌర్య కూడా పడుకున్నాడు ఇద్దరు కళ్ళు మూసుకున్నారు కానీ ఎవరికీ నిద్ర దరి చేరట్లేదు.. @ @ @ @ @ ఆఫీస్ అయిపోయాక మార్ట్ కి దగ్గర లో ఉన్న పార్క్ కి వెళ్ళింది అర్చిత…