డియర్❤️🔥బీస్ట్ – 2
నమ్మిన వాళ్లకి అక్షయపాత్ర లాంటి వాడు, ఆదర్శంగా తీసుకున్న వాళ్లకి అత్యుత్తమమైనవాడు, తోడ కొట్టి ఎదురు నిలబడ్డ వారికి తెగ నరికే పలనాటి కత్తి లాంటివాడు.
నీ అంతటోడు ఇండియాలోనే లేడని ఎవరెస్ట్ ఎక్కించేశారు.
వాట్ ఎ గ్రేట్ కాలమ్.. అని రుద్ర గురించి వచ్చిన న్యూస్ కాలమ్స్ చదివి అప్రిషియేట్ చేస్తూ అసలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు రా ఈ పద ప్రయోగాలు.. అంటూ విస్మయాన్ని వ్యక్తం చేశాడు శిఖర్.
రుద్ర కి ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్, అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ శిఖర్ పట్వాని.
కళ్ళ ముందు కనిపించే ఎవరెస్టుతో కంపేర్ చేయడం గొప్పగా ఉన్న రుద్ర లో అంతకు మించిన గొప్పతనం ఉంది అని శిఖర్ ఫీలింగ్.
అదే ఎక్స్ప్రెస్ చేస్తున్న శిఖర్ స్పీచ్ కి బ్రేక్ వేస్తూ.. నాకు ముందు ఈ ఎవరెస్టు ప్లేస్ లో చాలామంది నిలబడ్డారు, నా తర్వాత కూడా చాలామంది ఆక్యుపై చేస్తారు.
ఆ ప్లేస్ లో నిలబడి మనం ఏం చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. దీనిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎవరెస్ట్ అధిరోహించాలి అనుకునే వాళ్ళకి మనం రోల్ మోడల్ గా ఉండాలి.
మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవార్డు గ
బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఎవరి దగ్గర ఉన్న నేర్చుకోవాలి, అందుకోవాలి. టేక్ ఇన్నోవేషన్ తో లాస్ట్ ఇయర్ ‘నేషనల్ ఎంటర్ పెన్యూర్షిప్’ అవార్డ్ విన్నర్ గా నిలిచాడు.
వన్ ఇయర్ గ్యాప్ లోనే జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ తో ఇండియా వైడ్ టెక్ ఎక్సలెన్స్ సాధించాడు, అవార్డు విన్నర్ గా నిలిచాడు.
అప్పుడు అందరూ రిస్క్ అన్నారు ఆ గొంతులో నువ్వు కూడా ఉన్నావు అన్వీర్. ఇట్స్ ఏ లాడర్ అన్వీర్, డోంట్ లూస్ యువర్ టెంపర్.
కీప్ ఇన్వెస్ట్ ఇట్ ఇన్ ఎ రైట్ వే, నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా సాధిస్తావు అని భుజం తట్టి వెళ్లిపోయింది అన్వీర్ మదర్ అనుపమ.
రాసిన వాడి కవిత్వానికి వాడి క్రియేటివిటీకి కనెక్ట్ అయితే ఎవరెస్ట్ తప్ప మన కళ్ళకి ఏది కనబడదు. అక్కర్లేని వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా కం ఫాస్ట్ అని కసిరి కార్ దిగిన రుద్ర చిరుత స్టైల్ వాకింగ్ తో కాంప్లెక్స్ లోకి వెళ్ళాడు.
ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనేది రుద్ర గుణం.
తల్లి నుంచి నేర్చుకున్న ఈ విలువలకి తను ఏం సాధించిన మొదటిగా తల్లికి గిఫ్ట్ ఇవ్వడం రుద్ర సెంటిమెంట్.
నీ వాల్యూస్ వేరే లెవెల్ రా బాబు.. అని గిఫ్ట్ సెలెక్షన్ కి రుద్ర ను ఫాలో అయ్యాడు శిఖర్.
వారణాసికి వన్నె తెచ్చిన బనరసి షాల్.
సున్నితమైన వెండి పోగులతో నేసిన చేనేత శాలువా.. సున్నితంగా పట్టుకుంటే జారిపోతూ అద్భుతంగా ఉంది.
ఏరి కోరి ఎంపిక చేసి తెచ్చిన శాలువా వేళ్ళతో తడుముతున్న రంజని గారి కళ్ళు ఆనందభాష్పాలతో మెరిసాయి.
కొడుకు చేతితో ఏది ఇచ్చిన ఆవిడకి అపురూపమే.
ఎందుకంటే ఆ గిఫ్ట్ లో కొడుకు ప్రేమతో పాటు ఒక ప్రత్యేకమైన సందర్భం, ఒక అత్యున్నతమైన గెలుపు, ఒక అనిర్వచనమయిన భావోద్వేగం కలిసి ఉంటాయి.
హౌ ఇస్ ఇట్ డాడ్?? అని శాలువా తల్లి చుట్టూతా సెట్ చేస్తూ రుద్ర అడగడమే నువ్వు ఏది ఇచ్చిన మీ మామ్ కు అది చాలా స్పెషల్.
మీ మామ్ ముఖంలోనే తెలిసిపోతుంది అని ఒక్క మాటతో కితాబు ఇచ్చారు వినోద్ మెహతా.
అంకుల్ చాలా సింపుల్ గా సర్టిఫికెట్ ఇచ్చేస్తారు అని నీకెలా ఉంది.. అంటూ వేద్ ని అడిగాడు శిఖర్.
వాడికి ఏం తెలుసు చిన్నపిల్లాడు అని మురిపం చేశారు రంజని.
ప్రతిదీ పది సెకండ్స్ లేట్ అన్నట్టు వెద్ నోరు తెరిచేలోపే అనురాగ వందనాల మధ్య కట్టడి అయిపోతాడు.
తల్లి ప్రేమలోని ఆప్యాయత తను చిన్నవాడు అంటున్న ఆ పొజిషన్ తీసుకోలేని వేద్ ముఖంలో రంగులు మారాయి.
బట్ అవి బయటకు ఎక్స్పోజ్ చేయలేదు.
చేయలేడు కూడా.. మెహతా కుటుంబంలో మొదటిగా రుద్రాన్ష్ ప్లేస్ లో పుట్టలేదన్న జెలసి వేదాన్ష్ ది.
అయితే అన్ని విషయాలలో అంటి ముట్టనట్టుగా ఉండే వేదాన్ష్ ని ప్రతి విషయంలో ముందు ఉంచడం రుద్రా స్పెషాలిటీ.
నా తమ్ముడు చిన్నవాడైనా వాడి డెసిషన్ నాకు చాలా ప్రిషియస్ మామ్ అంటూ వేద్ ఇంపార్టెన్స్ ఎక్స్పోజ్ చేస్తూనే చెప్పమని అడిగాడు రుద్ర.
నీ సెలక్షన్ చాలా పర్టికులర్ గా ఉంటుంది అన్నయ్య. ఈ శాలువా వెనుక ఇంపార్టెన్స్ ఏంటి..?? అని పాయింట్ కి వచ్చాడు వేద్.
అవార్డు ఫంక్షన్ గురించి చెప్పి ఈ షాల్ కి మ్యాచింగ్ సారీ తో రావాలి మామ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు రుద్ర.
దేశమంతా తెలిసేలా జరుగుతున్న అవార్డు సెర్మనీ .. ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు.
వినోద్ లో కూడా అదే హ్యాపీనెస్.
రుద్ర మోస్ట్ అచీవ్మెంట్ అవార్డు గెలవడం ఒకటైతే, దాని వెనుక ఇన్నోవేటివ్ ఐడియాస్ తో బిజినెస్ డెవలప్ చేయడం, కంపెనీ షేర్ వాల్యూ 10 టైమ్స్ రైజ్ అవ్వడం మొత్తం రుద్ర క్రెడిట్.
పేరు పలుకుబడితో పాటు ఫైనాన్షియల్ గా వచ్చిన ఆ క్రెడిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు వినోద్ మెహతా.
తల్లి సంతోషం, తండ్రి గొప్పతనం ఏమాత్రం అందుకోలేని స్టేజిలో మౌనంగా ఉన్న వేద్ లో ఒకటే ఆలోచన.
నీ ప్లేస్ లో నేను పుట్టి ఉంటే ఈ క్రెడిట్ మొత్తం నాకే దక్కేది.
ఎలాగైనా ఈ ప్లేస్ కి నేను చేరాలి, లేదంటే నిన్ను ఆ ప్లేస్ నుంచి దించాలి అని డిసైడ్ అయిన వేద్ లో కోపంతో కూడిన ఆసహనం.
ఆ మూమెంట్స్ ని తీసుకోలేని ఇరిటేషన్ తో ఫ్రెష్ అవుతాను అంటూ తప్పుకుని వెళ్ళిపోయాడు.
హిమాచల్ ప్రదేశ్.. కాంగ్రా వాలి.
ఈవినింగ్ 7:20, వర్క్ ఫినిష్ అవ్వడంతో అక్కడ ఎంప్లాయిస్ తో మాట్లాడి పంపించేసి రిలాక్స్ అవ్వడానికి టీవీ పెట్టుకున్నాడు ఒక వ్యక్తి.
అలవాటు పడిన న్యూస్ చానల్స్ ఎప్పటిలా స్క్రోల్ చేస్తున్న అతను ఒక చానల్ స్క్రీన్ మీద సింహం గాంబీర్యం పునికి పుచ్చుకున్న సన్నటి చిరునవ్వుతో వెలిగిపోతున్న రుద్ర పేస్ చూడడమే ఆయన కళ్ళల్లో ఒక తీక్షణత.
ππππππππππππππππππππππππππππππππππ
కామెంట్స్ మస్ట్.
వర్ణ.__
Swipe left/right or tap the sides to turn pages