హైదరాబాద్ నుండి రామచంద్రాపురం ప్రయాణానికి శివ, సాహిత్యలు తెల్లవారుజామునే సిద్ధమయ్యారు. అయితే ఈసారి శివ కారు తీయలేదు. మొన్నటి యాక్సిడెంట్, ఆ తర్వాత మాల్ లో కడుపునొప్పి హడావుడి చూశాక, మనసు ప్రశాంతంగా ఉండటానికి తన పాత ‘రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్’ బైక్ మీద వెళ్దామని డిసైడ్ అయ్యాడు. పొద్దున్నే చలిగాలిలో గోదావరి రోడ్డుపై బుల్లెట్ ప్రయాణం అంటే ఉండే మజాయే వేరు.
సాహిత్య జీన్స్, వైట్ టాప్ వేసుకుని, తలకి హెల్మెట్ పెట్టుకుని చాలా స్టైల్గా వచ్చి బైక్ వెనుక సీట్లో కూర్చుంది. నిన్నటి కోపం ఇంకా పూర్తిగా తగ్గలేదు అన్నట్లు ముఖం కాస్త పక్కకు పెట్టింది.