New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 16

మాంగళ్య బంధం – 16

ఓయ్ ఇప్పుడు నేను అంతల మీ తమ్ముడ్ని ఎం ఆట పట్టించానే.. నేనింకా చాలా మంచి వాడిని కాబట్టి  నా నిర్ణయం ఏంటో  మీ తమ్ముడి మీద రుద్దేయకుండా ని తమ్ముడికి పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి అని ఉందొ అని అతని నిర్ణయం చెప్పమని అడిగాను..

 

అది కూడా తప్పేనా.. ఏంటో బాబు ఈ మధ్య మంచికి రోజులు లేవు అంటుంటే ఏంటో అనుకున్నాను.. కానీ ఇక్కడ నిన్ను, ని మాటల్ని వింటుంటే మాత్రం అది నిజమే అని అర్ధం అవుతుంది…

 

అయిన పెళ్ళి చేసుకునేది మీ తమ్ముడు . చేసేది మీరు..  ఇందులో నీ ఇష్టం, ని తమ్ముడి ఇష్టం.. మధ్యలో  నాకెందుకు లే అమ్మ నేను సైలెంట్ గా ఉంటే పోతుంది అని అమాయకం గా మొహం పెట్టి అంటాడు భరత్..

 

అతని మాటలు విన్న వాళ్ళందరూ  భరత్ చేసే సరదాకి చిన్నగా నవ్వుకుంటారు..

 

భర్త మాటలు విన్న భాను మాత్రం అదేంటి  అలా అంటున్నారు.. ఈ ఇంటి అల్లుడిగా, మా తమ్ముడికి వున్న ఒక్కగానొక్క బావ మరిది గా వాడి పెళ్ళి బాధ్యత లు మొత్తం తీసుకోవాల్సింది మీరేగా..

 

మీరే ఇలా నాకెందుకు అంటే ఎలా.. పెళ్ళి పనులు తప్పించుకుందాం అని చూస్తున్నారా ఏంటి.. అలా ఏమి కుదరదు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue