మార్పులు చెయ్యాల్సినవి ఏమి లేవు పంతులు గారు అన్నీ సరిగ్గానే వున్నాయి అని చెప్తాడు భరత్..
శుభం అయితే ఇంకెందుకు ఆలస్యం అమృత ఘడియలు మొదలయ్యాయి తాంబులాలు మార్చుకోండి అని చెప్తారు పంతులు గారు..
దాంతో పూలు, పండ్లు, అన్నీ వున్న తాంబులాన్ని భరత్, భాను అందించగా శేఖర్, శాంతి ఆ తాంబులాన్ని అందుకుని పక్కన పెట్టి వాళ్ళు తెచ్చిన వాటిని భరత్, భాను చేతికి అందిస్తారు..
అలా ఇరువురు తాంబులాలు కూడా మార్చేసుకోవడం పూర్తయిన తర్వాత పంతులు గారు శేఖర్, శాంతి ల వైపు చూస్తు హ్మ్ ఈ క్షణం నుండి మీ అమ్మాయి ప్రతిమ ఈ ఇంటి అమ్మాయి గా మారి పోయింది..
అమ్మ శాంతి, యశోద రేపు ఉదయం ఎనిమిది గంటలకి దివ్యమైన ముహూర్తం వుంది.. అప్పుడు పసుపు దంచి పెళ్ళి పనులు మొదలు పెట్టుకోండి..
నేను పెళ్ళి రోజు కలుస్తాను.. ఇక నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి పైకి లేస్తారు పంతులు గారు..