New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 178

మాంగళ్య బంధం – 178

క్షణక్షణానికి స్వీటీ మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ ని చూస్తుంటే  ప్రణయ్, ప్రతిమ, భరత్ ముగ్గురికి  ఎంత ఆపుకుందాం అనుకున్నా నవ్వు ఆగకపోవడంతో పైకే గట్టిగా నవ్వేస్తారు..

 

ఉన్నట్టుండి నాన్న, అత్త, మావయ్య ఎందుకు అలా నవ్వుతున్నారో అర్థం కాని స్వీటీ  ముగ్గురు వంక తలలు తిప్పి చూస్తూ  ఇప్పుడు మీరు ఎందుకు నవ్వుతున్నారు అని ముద్దు ముద్దుగా అడుగుతుంది..

 

ఏం లేదు బంగారు తల్లి నువ్వు ఇంత ముద్దుగా మూతి పెడితే ముచ్చటగా అనిపించి నవ్వొచ్చి నవ్వుకుంటున్నాము అంతే..

 

ఇప్పుడు నువ్వు మా ముగ్గురిలో ఎవరి దగ్గర పడుకోవాలి అన్న విషయం గురించి అంతలా ఆలోచించి నీ చిట్టి బుర్రని పాడు చేయొద్దు..

 

నీకు ఎవరి దగ్గర పడుకోవాలి అనిపిస్తే వాళ్ల దగ్గరే పడుకో ఎవరు ఏమీ అనరు సరేనా అని అనునయంగా చెప్తాడు భరత్..

 

తన నాన్న ఆ మాట చెప్పడంతో  స్వీటీకి పెద్ద భారం దిగిపోయినట్టుగా ఫీల్ అవుతూ  అలాగే నాన్న అని తల ఊపి నాన్న నేను మన ఇంటి దగ్గర ప్రతిరోజు నీ దగ్గరే పడుకుంటాను కదా,

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue