New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 181

మాంగళ్య బంధం – 181

హ అత్త.. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా.. నేను కూడా పెద్దయ్యాక అలానే ఆలోచిస్తాను..నాకు కూడా శక్తి అక్కలాగే తెలివైన ధైర్యవంతురాలు అయిన అమ్మాయిని అనిపించుకోవాలి అని, మా నాన్నతో పొగిడించుకోవాలి అని ఉంది అని చెప్పి అందంగా నవ్వుతుంది స్వీటీ..

 

వెరీ గుడ్ గర్ల్.. నీకు ఇప్పుడే చాలా తెలివి ఉంది బంగారం.. నువ్వు ఇంకాస్త పెద్దయిన తర్వాత నీ తెలివిని కూడా ఇంకొంచెం పెంచుకుంటే సరిపోతుంది..

 

అప్పుడు నిన్ను మీ నాన్న ఒక్కడే కాదు అందరూ కూడా మెచ్చుకుంటారు.. నిన్ను చాలా గొప్పగా చూస్తారు.. ఎందుకంటే నువ్వు చాలా మంచి దానివి కదా, పెద్దయ్యాక ఇంకా మంచిగా, గొప్ప పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటావన్నమాట అంటు  స్వీటీ పెట్టిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి ముద్దొచ్చి స్వీటీ బుగ్గ మీద ముద్దు పెట్టడానికి ముందుకు వంగుతుంది ప్రతిమ..

 

  కానీ సరిగ్గా అప్పుడే కాలు మీద దోమ ఏదో కుట్టింది అని  స్వీటీ కాస్త కిందకి వంగడం తో స్వీటీకి పెట్టాల్సిన ముద్దు కాస్త  ప్రణయ్ చంప మీద పెడుతుంది  ప్రతిమ ..

 

సడన్గా తన చెంప మీద  తగిలిన పెదవుల స్పర్శకి ప్రణయ్ షాక్ అయిపోయాడు.. మెత్తగా ఉండాల్సిన స్వీటీ బుగ్గల కి బదులు గడ్డంతో ఉన్న ప్రణయ్ చంప తన పెదవులకు తగలడంతో ప్రతిమ అయితే కరెంట్ షాక్ కొట్టిన కాకి లాగా బిగుసుకుపోతుంది..

 

ఇద్దరి హార్ట్ బీట్  అమాంతం పెరిగిపోయింది.. తను ఒక వయసుకు వచ్చిన తరువాత  స్వీటీ లాంటి చిన్నపిల్లలతో తప్ప  వయసులో ఉన్న అమ్మాయిల పెదవుల స్పర్శ ఏమాత్రం తెలియని ప్రణయ్ కి  ప్రతిమా పెట్టిన చెంప ముద్దు కూడా  ఎంతో మత్తుగా,గమ్మత్తుగా అనిపిస్తుంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue