New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 179

మాంగళ్య బంధం – 179

అనగనగా ఒక ఊరు.. ఆ ఊరిలో శక్తి అనే అమ్మాయి ఉంది.. ఆ అమ్మాయి చాలా తెలివైనది అని ఆ ఊర్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు..

 

ఒకరోజు శక్తి ఆదివారం సెలవు అని ఇంట్లో కూర్చుని చదువుకుంటూ ఉంటుంది.. ఆ సమయంలో శక్తిని వాళ్ళ నాన్నగారు పిలిచి పక్కూరులో ఉండే నా స్నేహితుడు ఇంటికి వెళ్లి అతని దగ్గర నా వస్తువు ఒకటి ఉంది..

 

దాని నువ్వు భద్రంగా ఇంటికి తీసుకుని రావాలి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వస్తువుని పోగొట్టుకుని రాకూడదు.. చాలా జాగ్రత్తగా తీసుకుని రావాలి..ఆ వస్తువు నాకు చాలా విలువైనది  అని చెప్తారు ..

 

తండ్రి చెప్పిన మాటలు విన్న శక్తి  అలాగే నాన్నగారు నేను మీరు చెప్పినట్టే చేస్తాను.. మీరు తెమ్మని చెప్పిన వస్తువుని చాలా జాగ్రత్తగా తీసుకువచ్చి మీ చేతుల్లో పెడతాను..

 

మీరు నామీద కాస్త నమ్మకం ఉంచండి.. నేను ఇప్పుడే బయలుదేరుతాను.. మీరు మీ స్నేహితుడి పేరు, వాళ్ళ ఇల్లు   ఎక్కడ ఉంటుందో  కాస్త వివరాలు చెప్తే నేను వెళ్లి మీ పనిని త్వరగా పూర్తి చేసుకుని వస్తాను హనీ నమ్మకంగా చెప్తుంది..

 

దాంతో శక్తి వాళ్ళ నాన్నగారు  తన స్నేహితుడి పేరు మరియు అతని ఇంటి అడ్రస్సు వివరంగా కూతురుతో చెప్తారు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue