బ్యాగ్ పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న ప్రతిమని చూసి ఊర్లో వాళ్ళు అంత ఈ అమ్మాయికి పెళ్ళి కుదిరింది అంట..
అది కూడా పక్క వీధి యశోదమ్మ కొడుకు ప్రణయ్ బాబు తో అంట .. పెళ్ళి కూడా ఇంకో పది రోజుల్లోనే అంట ఈ విషయం మీకు తెలుసా వదిన అంటు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వుంటారు చిన్నగా..
అప్పటికే ఆ నోట, ఈ నోట విషయం తెలిసిన వాళ్ళు హా మాకు తెలుసు నిన్ననే పక్కింటి పెద్దమ్మ చెప్పింది అని చెప్పగా తెలియని వాళ్ళు మాత్రం అవునా.. నిజమా ఈ విషయం ఇంకా మా వరకు రాలేదు వదిన..
మనం అంత ఒకే ఊర్లో పక్క, పక్క వీధుల్లోనే ఉంటున్నాము.. ఎప్పుడు వీళ్లిద్దరికీ పెళ్ళి చేస్తాము అని కాని, చెయ్యాలి అనుకుంటున్నట్టు గాని చిన్న వార్త కూడా మన చెవిన పడింది లేదు..
అలాంటిది మాట మాత్రం బయటకి రానివ్వకుండా ఉన్నట్టుండి భలే పెళ్ళి కుదుర్చుకున్నారుగా…
బహుశా ఆ శేఖర్ అన్నయ్య శ్రీరాములు బావ గారితో వున్న స్నేహాన్ని వదులుకోకుండా ఇలా ఆ ఇంటి అమ్మాయిని చేసుకుని వియ్యంకుడి గా మారుదాం అనుకున్నాడేమో…