మైరా స్పృహ కోల్పోతుంటే ఇషాంత్ గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది.
ఆమెను తన బలమైన చేతుల్లోకి తీసుకుని, మెట్లెక్కి బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లాడు.
తెల్లటి బెడ్ షీట్ మీద ఆమెను పడుకోబెట్టాడు. ఆమె చేతి నుంచి కారుతున్న రక్తం ఆ తెల్లటి పరుపును ఎర్రగా మార్చేస్తోంది.
ఇషాంత్ వణుకుతున్న చేతులతో తన ఫోన్ తీసి డాక్టర్ కి కాల్ చేశాడు.
డాక్టర్ ఇప్పుడే గెస్ట్ హౌస్‌కి రండి.. అర్జెంట్ మైరాకు రక్తం చాలా పోతోంది.
మీరు వచ్చేసరికి ఒక్క నిమిషం ఆలస్యమైనా మీ ప్రాణాలు ఉండవు అని అరిచి ఫోన్ పడేశాడు.