New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రాక్షసప్రేమ – 1

రాక్షసప్రేమ – 1

రాక్షస ప్రేమ
హైదరాబాద్ హైకోర్టులో  లోపల చెట్టు కింద అరుగు మీద ఒక అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా కూర్చుని ఉంది. 
ఆమె పక్కన ఉన్న ఆమె తల్లి పూజిత భయపడుతూ “శౌర్య ఇప్పుడు ఈ కోర్టు కేసులు ఇవన్నీ ఎందుకే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా..! అని అన్నది..
“అమ్మ కూర్చుని మాట్లాడుకునేంత మేటర్ అక్కడ లేదు. కోర్టులోనే తేల్చుకోవాలి. ఇక నాకు ఓపిక సహనం లేదు. ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను అని లేటుగా నాకు అర్థం అయింది.  ఇప్పుడు కన్నీళ్లు కార్చటానికి నా కంట్లో కన్నీరు కూడా లేవు.. ఇంకిపోయాయి..
ఇక చాలా నా బ్రతుకేదో నేను బ్రతకాలి అనుకుంటున్నాను జరిగిన దాని గురించే తలుచుకుంటూ ఆ ఇంటిలో ఆ వ్యక్తి పక్కన ఉండటం కూడా నాకు నచ్చటం లేదమ్మా..
, ఒకవేళ నేను నీకు భారం అని అనుకుంటే నేను ఒంటరిగా బ్రతకడానికి కూడా సిద్ధంగానే ఉన్నానమ్మా.. నా జీవితం నాకు ఒంటరిగా ఎలా బ్రతకాలో కూడా నాకు నేర్పించింది అమ్మ అని చాలా స్ట్రాంగ్ గా చెప్పింది సౌర్య… 
“ఇప్పుడు విడాకులు తీసుకోవాల్సిందేనా శౌర్య తప్పదా…?” అని తన కూతురు నిర్ణయాన్ని మనసులో ఒక వైపు సమర్థిస్తున్న,, మరోవైపు కూతురు జీవితం విడాకుల తర్వాత ఏమైపోతుంది ఏమో అనే భయంతో అన్నారు శౌర్య తండ్రి అయిన భరద్వాజ్. 
“అవును నాన్న విడాకులు తీసుకోవాల్సిందే ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను అనిపిస్తుంది. ఆడదానిలో సహనం ఉంటుంది అంటారు కానీ ఆ సహనం కూడా ఆడదానిలో ఉండకూడదు అని నా జీవితం నాకు నేర్పించింది. ఇంకా ఆ నరకంలో బ్రతకాలి అని నాకు లేదు” అని అన్నది శౌర్య. 
ఏం చేయాలో తెలియని అయోమయం, కూతురు జీవితం ఏమైపోతుంది ఏమో అన్న బాధలో ఉన్న పూజిత భరద్వాజ్ ఇద్దరు ఏమీ మాట్లాడలేకపోయారు. 
వాళ్ళ ముగ్గురిని చూస్తూ పక్కనే కూర్చుని ఉన్న శౌర్య అక్క విరాజిత ఇదంతా నా వల్లే. నా చెల్లెలు జీవితం ఇలా కావడానికి నేనే కారణం అని బాధగా మనసులో అనుకుంది.
శౌర్య మాత్రం చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని వెనక ఉన్న చెట్టుకి అనుకుంది. 
ఆమెకి  ప్రేమ పెళ్లి రెండిటి మీద విరక్తి కలిగింది. నిజంగా పెళ్లి చేసుకుంటే ఇంత నరకం అనుభవించాలా అని తన కళ్లారా చూసిన మూడు సంవత్సరాల జీవితం తనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంటే  అసహ్యం వేస్తుంది తన మీద తనకే,
అలాంటి ఊబిలోనికి తనంతట తానుగానే వెళ్లి కూరుకుపోయినందుకు..
కరెక్ట్ గా అప్పుడే ఆ కోర్టులోనికి బెంజ్ కార్ ఎంటర్ అయింది. 
ఆ బెంజ్ కార్ లో నుంచి 6.2 ఫీట్ హైట్ ఉన్న అందాల రాజకుమారుడు, 27 సంవత్సరాలు ఉన్న అబ్బాయి దిగాడు. 
అతనిని చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నారు. అంత అందంగా ఉన్నాడు నిజంగానే దేవతలు ఎంత అందంగా ఉంటారో ఎవరు చూడకపోవచ్చు కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ వ్యక్తిని మాత్రం వర్ణించడం ఎవరివల్లా కాదేమో, 
సిల్కీ హెయిర్, విశాలమైన నుదురు, షార్ప్ ఐస్ మగతనం ఉట్టిపడే విధంగా ఉన్న మీసపుకట్టు, మెడలో గోల్డ్ చైన్ చేతికి జస్ట్ రింగ్ ఫింగర్ కి ఉన్న ఒక్క రింగ్, అది కూడా తన భార్య తనకు ఇష్టంగా ఇచ్చిన రింగ్… ఎప్పటికీ అతడు తీయడు అని ఆమెకు మాట ఇవ్వడంతో ఆ మాట ప్రకారమే ఆ రింగ్ ని తను పెట్టుకున్నాడు. మరో చేతికి సింపుల్ వాచ్,  సూట్ లో ఉన్న ఆ వ్యక్తి చూడటానికి చాలా హుందాగా అనిపించాదు. 
అతడు కార్ దిగి కోట్ సరిచేసుకొని,  వాచ్ లో టైం చూసుకొని కోర్టు లోపలికి అడుగు పెట్టాడు.. 
అతడి వెనకే వస్తున్నా అతడి అన్నయ్య విరాట్ మనసులో ఏదో తప్పు చేసిన భావన కలుగుతుంటే అదే ఫీలింగ్ తో రౌద్ర అని పిలిచాడు.
ఏంటి అన్నట్లుగా రౌద్ర వెనక్కి తిరిగి తన అన్నయ్య విరాట్ వైపు చూసాడు.
“ఒక్కసారి ఆలోచించరా..?” అని విరాట్ నోటి నుంచి పూర్తిగా మాట కూడా బయటకు రాలేదు..
రౌద్రంగా తన అన్నయ్యని చూసి “ఆ విషయం నువ్వు మన ఇంటి గడప దాటక ముందు ఆలోచించి ఉంటే బాగుండేది” అని ఆటిట్యూడ్ గా చెప్పి తన అన్నయ్యని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు రౌద్ర…
విరాట్ తప్పు చేసిన వాడిలాగా బాధగా తలదించుకున్నాడు. నావల్ల ఒక ఆడపిల్ల జీవితం ఊబిలోనికి కూరుకు పోయిందా అన్న ఫీలింగ్ ప్రతిక్షణం తనని వెంటాడుతూనే ఉంది..
కానీ అది తను కావాలి అని చేసింది కాదు తప్పక తప్పని పరిస్థితుల్లో తాను ఆనందంగా పక్షుల స్వేచ్ఛగా ఎగరాలి అనుకుని చేసిన ఒక తప్పు ఒక కుటుంబాన్ని చిదిమేస్తుంది అని,, అంతకుమించి తన జీవితాన్ని కూడా పద్మవ్యూహంలోనికి నెట్టేస్తుంది అని తను ఊహించలేదు.
ఆరోజు తన ఇష్టానికి తాను తీసుకున్న ఒక్క నిర్ణయం ఇప్పుడు మన కుటుంబాన్ని కోర్టు మెట్లు ఎక్కించే వరకు వచ్చింది అని బాధగా అనుకుంటూ కోర్టు లోపలికి వెళ్ళిపోయాడు విరాట్. 
అక్కడ రౌద్ర చైర్ లో స్టైల్ గా కాలు మీద కాలు వేసుకుని ఆటిట్యూడ్ గా లాయర్ వైపు చూస్తుంటే, 
లాయర్ భయపడుతూ “సార్ ఈ కేస్ కచ్చితంగా మనమే గెలుస్తాం” అని నమ్మకంగా చెప్తున్నాడు. 
రౌద్ర లాయర్ ని  కింద నుంచి పై వరకు ఒకసారి చూసి ఆది చూద్దాం అని అన్నాడు. 
లాయర్ భయపడుతూ లోపలికి వెళ్లి తన ప్లేసులో కూర్చుని, అమ్మో ఈ కేసు ఒప్పుకొని తప్పు చేశాను అనిపిస్తుంది. మనీ బాగా వస్తాయి అని ఒప్పుకున్నాను, ఇంతకు ముందు ఈ ఫ్యామిలీ గురించి ఒకటి రెండు సార్లు  విన్నాను.. కానీ ఇప్పుడు కల్లారా చూస్తుంటే తెలుస్తుంది.. నిజంగా ఇలాంటి ఫ్యామిలీని నేనెక్కడ చూడలేదు రా బాబోయ్! అని భయంగా గుండె మీద చేతులు వేసుకున్నాడు  లాయర్ కృష్ణమూర్తి..
కృష్ణమూర్తి గారి పక్కనే కూర్చుని ఉన్న మరొక లాయర్ “ఏంటండీ ఆరు నెలలుగా ఈ కేస్ వచ్చినప్పుడల్లా మీరు భయపడుతూ ఉండటం నేను చూశాను. ఇప్పటివరకు మీరు ఎన్నో కేసులు చూశారు ఇలాంటి డైవర్స్ కేసులు చాలా సింపుల్ గా ఇప్పించారు. ఇప్పటివరకు మీరు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. ప్రతి కేసు ఒక నెలలోనే తీర్పు వచ్చే విధంగా చేసేవాళ్ళు ఒకటి భార్యాభర్తలు కలిసి ఉండటం లేదంటే విడిపోవడం, కానీ ఆరు నెలలగా ఈ కేసు మాత్రం ఇలానే సాగుతూ ఉంది ఒక కొలిక్కి రాలేదు” అని అడిగారు..
కృష్ణమూర్తి తల కొట్టుకుంటూ “ఏం చెప్పమంటారు ఇంత డిఫరెంట్ కేసుని నేనెక్కడ చూడలేదు. అనవసరంగా ఈ కేసు ఒప్పుకున్నాను అని ఫస్ట్ టైం నాకు అనిపిస్తుంది..!” అని కోపం బాధ గిల్ట్ ఫీలింగ్ మనసులో కలుగుతుంటే చెప్పారు..
“మీరేం మాట్లాడుతున్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు. డైవర్స్ కేసే కదా..!” అని సింపుల్ గా అన్నారు పక్కన ఉన్న లాయర్. 
“డైవర్స్ కేసు అయితే ఓకే, కానీ ఈ కేసులో ఎన్నో ఇంటర్నల్ కేసెస్ పెట్టవచ్చు. కానీ ఆ అమ్మాయి ఇన్ని రోజులు భరించి ఇప్పుడు విడాకులకి వచ్చింది. నిజంగా భూమాతకు ఉన్నంత ఓర్పు ఆ అమ్మాయి ఉంది అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది.. కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్యామిలీ ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వటానికి సిద్ధంగా లేరు. పాపం ఆ అమ్మాయి తలుచుకుంటే నాకే బాధగా ఉంది” అని అన్నారు లాయర్. 
ఇంతకీ ఈ రౌద్ర ఎవరు..? శౌర్య ఎవరు..?
లాయర్ కృష్ణమూర్తి తనకి తీసుకున్న రౌద్ర డైవర్స్ కేసు గురించి ఎందుకు అంత భయంకరంగా మాట్లాడుతున్నాడు..
రౌద్ర అన్నయ్య విరాట్ చేసిన తప్పు ఏంటి ఆ తప్పు వల్ల జరిగిన పరిణామాలు ఏంటి..?
శౌర్య అక్క విరాజిత చేసిన అపరాధం ఏంటి తెలియాలి అంటే రౌద్రుడు స్టోరీ చదివేయండి..
రౌద్ర పేరుకు తగ్గట్టే రౌద్రంగా, రాక్షసుడు పోలికలు ఎక్కువ ఉనికిపుచ్చుకున్నవాడిలా, అతడు చేసే పనులు చూస్తే నెత్తి మీద కొబ్బరికాయతో తల పగలగొట్టాలి అనిత కోపం మనసులో కలిగే విధంగా ఉంటాడు. 
రాక్షసుడుని ప్రేమని భరించలేము కోపాన్ని భరించలేము.
శౌర్య పేరుకు తగ్గట్టే ధైర్యం కలిగిన అమ్మాయి.
చూద్దాం ఈ ఇద్దరి కలయికలో వచ్చే స్టోరీ ఎంతవరకు రీచ్ ఉంటుందో..
ఈ స్టోరీ స్టార్టింగ్ కన్ఫ్యూజన్ గానే ఉంటుందండి ఫస్ట్ పది భాగాలు చదివిన వెంటనే స్టోరీ అర్థమయిపోతుంది మీకు అని నేను చెప్పలేను. 
హాయ్ అండి 
ఇది నా కొత్త స్టోరీ అనేక రకాల మలుపులు తిరుగుతుంది 
నెక్స్ట్ ట్విస్ట్ ఏంటి అనేది మనకు తెలిసినట్లే ఉంటుంది కానీ అర్థం కాదు