New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రాక్షసప్రేమ – 2

రాక్షసప్రేమ – 2

రాక్షస ప్రేమ-2
“డైవర్స్ కేసు అయితే ఓకే, కానీ ఈ కేసులో ఎన్నో ఇంటర్నల్ కేసెస్ పెట్టవచ్చు. కానీ ఆ అమ్మాయి ఇన్ని రోజులు భరించి ఇప్పుడు విడాకులకి వచ్చింది. నిజంగా భూమాతకు ఉన్నంత ఓర్పు ఆ అమ్మాయికి ఉంది అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది.. కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్యామిలీ ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వటానికి సిద్ధంగా లేరు. పాపం ఆ అమ్మాయిని తలుచుకుంటే నాకే బాధగా ఉంది” అని అన్నారు కృష్ణ మూర్తి…
“అదేంటి మీరు ఎప్పుడూ కూడా ఇలా ఫీల్ అవ్వటం నేను చూడలేదే, ఫస్ట్ టైం ఒక డైవర్స్ కేస్ కి మీరు ఇలా ఇంతగా ఫీల్ అవుతున్నారు. అది కూడా మీరు వాదిస్తున్న వ్యక్తి వైపు కాకుండా అవతల వైపు ఉన్న అమ్మాయి వైపు జాలి పడుతూ మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది” అని అడిగారు లాయర్
“ఏం జరిగింది అని అంత సింపుల్ గా అడుగుతారేంటి..?” అంటూ అక్కడ కొంచెం దూరంలో చైర్ లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉన్న రౌద్రన్ని చూపించి,
” అతడిని చూశారు కదా ఆటిట్యూడ్ ఎలా ఉందో అలాంటి ఆటిట్యూడ్ ఉన్న వ్యక్తిని ఆ అమ్మాయి ప్రేమించే పెళ్లి చేసుకుంది కానీ చివరికి విడాకుల వరకు వచ్చింది” అంటూ జరిగినది రెండు ముక్కల్లో చెప్పేశారు..
ఆ  మేటర్ విన్న ఆ పక్కన లాయరే ఆశ్చర్యం అంతకుమించి భయం, ఆ అమ్మాయి మీద జాలి కలుగుతుంటే “పాపం” అని అన్నారు.. 
అప్పుడే కోర్టులోనికి జడ్జిగారు రావడంతో అందరూ, లాయర్స్ లేచి నిలబడి ఆయనను విష్ చేశారు..
జడ్జిగారు అందరినీ కూర్చోమని చెప్పి ఆయన కూడా తన సీట్ లో కూర్చున్న తర్వాత పక్కన ఉన్న బండ్రోత్ తో ఈరోజు ఉన్న కేసులు మెంబర్స్ పిలవండి అని చెప్పటంతో
పక్కన ఉన్న బంట్రోత్ ఫస్ట్ రెండు సీరియల్ నెంబర్స్ పిలిచాడు.
వాళ్ళ కేసులు అయిపోయిన తర్వాత రౌద్ర డైవర్స్ కేస్. 
అక్కడ రౌద్రని చూసిన జడ్జి కూడా ఒక్క క్షణం వణికాడు. పేరుకు తగ్గట్టే రౌద్రంగా ఆటిట్యూడ్ గా ఉన్న అతడిని చూస్తే ప్రతి ఒక్కరు భయపడాల్సిందే, అది ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి అయినా సరే. 
బండ్రోత్ కేసు నెంబర్ 257 అని పిలవడంతో రౌద్ర అదే స్టైల్ అద్దె ఆటిట్యూడ్ తో వచ్చి బోన్లో నిలబడ్డాడు. అక్కడ అతడు ముందు ఉన్న భోన్ మీద చేతులు వేసి పట్టుకున్నాడు.. కాదు కాదు కాదు పిడికిలి బిగించాడు అతడు బలాన్ని ఉపయోగిస్తే ఆ బోన్ కూడా ముక్కలైపోతుందేమో అన్నంత కోపంగా ఆ బోనుని పట్టుకున్నాడు.  తనని కోర్టు వరకు తీసుకొని వచ్చింది తన భార్య అని 
అప్పటివరకు కోర్టు బయటే చెట్టు దగ్గర కూర్చుని ఉన్న శౌర్య ఫ్యామిలీకి సౌర్య లాయర్ అయినా భూపతి ఫోన్ చేసి చెప్పటంతో శౌర్య కోర్టు లోపలికి వచ్చింది. 
ఆమె రావడం చూసిన భూపతి ఆమెను కోర్టు బోనులో వెళ్లి నిలబడండి అని చెప్పటంతతో,
ఓకే సార్ అంటూ దిక్కులు చూడకుండా తలదించుకొని కోర్టు బోనులోనికి వెళ్లి నిలబడింది. 
శౌర్య చూడటానికి చాలా సన్నగా అస్తిపంజరం కి డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే కనిపిస్తుంది. 
ఆరు నెలల క్రితం ఆ కేసు వేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది ఫేస్ లో కలలేదు ఒక జీవం లేదు నిర్జీవంగా తల ఎత్తి జడ్జి గారి వైపు చూసి నమస్కారం చేసింది..
చక్కటి సంస్కారం పద్ధతి తెలిసిన అమ్మాయి ఇలాంటి ఆటిట్యూడ్ అన్న అబ్బాయిని ఎలా ప్రేమించిందో ఎలా పెళ్లి చేసుకుందో ఆ తర్వాత తన జీవితం ఎలా మారిపోయింది అని మనసులో విరక్తిగా అనుకొని ఆమెకు ప్రతి నమస్కారం చేశారు జడ్జిగారు 
భూపతి పైకి లేచి మై లార్డ్ ఈ కేసు గురించి పూర్తి వివరాలు మీకు మేము అందించాం ఇక మీరు నా క్లైంట్ కి డైవర్స్ ఇప్పిస్తే, బాధ కన్నీళ్లు కష్టం దుఃఖం వంటి పంజరాల నుండి తనని విముక్తి కలిగిస్తే తన జీవితం ఇకపైన ఆయన హ్యాపీగా ఉంటుంది, దయచేసి నా క్లైంట్ వైపు ఉన్న నిజాన్ని గుర్తించండి” అని అన్నారు. 
కృష్ణమూర్తి కష్టంగా చైర్ లో నుంచి పైకి లేచి “మై లార్డ్ మీరు అలా చేయటానికి వీల్లేదు అలా చేస్తే నా క్లైంట్ కి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు” అని అన్నాడు.
సుమారు ఐదు నెలల నుంచి కృష్ణమూర్తి నోటి నుంచి ఆ ఒక్క మాట వస్తుంది ఆ మాట మాట్లాడటానికి కూడా కృష్ణమూర్తి చాలా కష్టపడుతున్నాడు కానీ తప్పదు కేసు తీసుకున్నప్పుడు అన్నట్లుగా మాట్లాడతాడు.
ఆ కేస్ తన దగ్గరకు వచ్చిన మొదటి నెలలో ఆ అమ్మాయి వాళ్ళు అంతా అబద్దాలు చెప్తున్నారు ఏమో అని అనుకున్నాడు. కానీ ఒక నెల జరిగిన తర్వాత తనకి పూర్తి నిజ నిజాలు ఏంటో తెలిసి రౌద్ర మీదే కోపం వచ్చినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. 
ఆరు నెలల నుంచి ఆ కేసు గురించి జడ్జి గారు కూడా వింటూనే ఉన్నారు. తనకి కూడా మనసులో పాపం అనిపిస్తుంది కానీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ మన దేశంలో ఉన్న కొన్నింటిని పాటించక తప్పదు కాబట్టి ఆయన శౌర్య వైపు తిరిగి “శౌర్య నీకు విడాకులు కావాలా..?” అని అడిగారు.. 
“అవును జడ్జి గారు నాకు విడాకులు కావాలి” అని చాలా స్పష్టంగా విడాకులు కావాలి అని దృడ సంకల్పంతో ఉన్నట్లుగా చెప్పింది సౌర్య.
తన కళ్ళల్లో ఏ మాత్రం భయం లేదు.  మాటల్లో తడబాటు లేదు తన ఎదురు భోన్ లో ఉన్న రౌద్రని చూస్తూనే చెప్పింది శౌర్.
ఆ మాట విన్న రౌద్ర పిడికిలి మరింత బిగుసుకుంది. కళ్ళు నిప్పు కడికల్లా కోపంగా ఎర్రగా మారిపోయి ఆమె వైపు చూసాడు. 
జడ్జి గారు రౌద్ర వైపు తిరిగి “మిస్టర్ రౌద్ర మీకు విడాకులు కావాలా..?” అని అడిగారు.
“నాకు నా భార్య కావాలి” అని ఒకే మాట చెప్పాడు రౌద్ర. అది కూడా తన వైపే సూటిగా చూస్తున్న తన భార్య వైపు చూస్తూనే చెప్పాడు.
“నువ్వు నీ భార్య కావాలి అంటున్నావ్ కానీ నీ భార్య విడాకులు కావాలి అని కోరుకుంటుంది. న్యాయం కూడా ఆమె వైపే కనిపిస్తుంది కాబట్టి నేను మీకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను” అని జడ్జి చెప్పాలి అని నోరు తెరిచాడు.
కానీ రౌద్ర సూటిగా జడ్జి వైపు చూడడంతో ఆ మాటను చెప్పలేక భయంతో గుటకలు మింగుతూ సౌర్య వైపు తిరిగి “ఒక్కసారి ఆలోచించమ్మా భర్తతో విడిపోతే నీ పరిస్థితి ఏంటి? ఈ సమాజం నిన్ను ఎలా చూస్తుంది ఒంటరిగా జీవితాంతం ఎలా ఉండగలవు..?” అని అడిగారు. 
ఒంటరిగా బ్రతకగలిగే సామర్థ్యం నాకు ఉంది జడ్జిగారు. మీరు నా గురించి ఆలోచించి నా మీద మీరు జాలి చూపించాల్సిన అవసరం లేదు. నాకు ఏదైనా మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే విడాకులు ఇప్పించండి చాలు” అని అన్నది శౌర్య. ఇప్పుడు కూడా ఆమె మాటలో తడబాటు లేదు.
జడ్జి రౌద్ర వైపు తిరిగి “ఆమె నీతో కలిసి ఉండటానికి సిద్ధంగా లేదు” అని చెప్పాడు.. 
కానీ రౌద్ర మాత్రం “నాకు నా భార్య కావాలి” అని ఒకే మాట చెప్పాడు. 
జడ్జి అక్కడ ఉన్న లాయర్లు అందరూ కూడా తలలు పట్టుకున్నారు. 
అది అంతా కూడా వెనక కూర్చొని చూస్తూ ఉన్న శౌర్య ఫ్యామిలీ అలానే రౌద్ర అన్నయ్య అందరూ కూడా విడాకులు అయితే బాగుండు అని మనసులో కోరుకున్నారు. 
శౌర్య అక్క విరాజిత రౌద్ర అన్నయ్య ఆయన విరాట్ దగ్గరకు వచ్చి “ఏవండీ ఇప్పుడైనా వాళ్లకు విడాకులు వస్తాయి అంటారా..?” అని భయంగా తన భర్త చేతిని పట్టుకొని అడిగింది. 
“నువ్వేమీ భయపడకు విరాజిత, ఖచ్చితంగా విడాకులు వస్తాయి. శౌర్య  స్ట్రాంగ్ గా ఉంది కదా” అని అన్నాడు విరాట్..
“కానీ మీ తమ్ముడు రౌద్ర కూడా విడాకులు వద్దు అని స్ట్రాంగ్ గా ఉన్నాడు కదా, అది కాక బాగా పలుకుబడి ఉన్న ఫ్యామిలీ మీది. అటువంటప్పుడు శౌర్య మాట ఎలా నెగ్గుతుంది” అని తన భర్త చేతిని పట్టుకొని భుజం మీద వాలిపోయి భయం అంతకుమించి మనసులో బాధ తనని రగిలిస్తుంటే అడిగింది విరాజిత…
“చూద్దాం..! ఏం జరుగుతుందో, నేను కూడా వాళ్ళిద్దరికి విడాకులు రావాలి అని కోరుకుంటున్నాను” అని అన్నాడు విరాట్..
అలా ఒక గంట సేపు ఆ కోర్టులో వాదనలు జరిగిన తర్వాత, కాదు కాదు జస్ట్ ఆ జడ్జి గారు సౌర్య రౌద్ర ఇద్దరితో మాట్లాడిన తర్వాత ఈ కేస్ ని మరో పది రోజుల తర్వాత అంటే మార్చి 31వ తారీక్కి వాయిదా వేయడం జరుగుతుంది అని చెప్పి ఆ కేస్ ఫైల్ క్లోజ్ చేశారు. అప్పటికే ఆ జడ్జి గారికి తలనొప్పి పెరిగిపోయింది.
శౌర్యని చూసిన తర్వాత మనసులో బాధ తగ్గదు అంటుంది
వాయిదా వేయడంతో బ్రతికి పోయావు అన్నట్లుగా రౌద్ర జడ్జి వైపు ఒక లుక్ ఇచ్చి అక్కడ నుంచి బయటకు వెళ్లిపోయాడు..
ఇంకో పది రోజులు తర్వాత వాయిదానా, అని అసహనంగా బాధగా అనుకుంటూ అక్కడ నుంచి తన ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళిపోయింది శౌర్య.
“ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావ్ శౌర్య” అని అడిగారు భరద్వాజ్..
“ఇంకా అనుకోవటానికి ఏముంది నాన్న. 6 నెలల క్రితం నాకు అతడు వద్దు అతనితో జీవితం వద్దు అనుకొని డైవర్స్ కేసు అప్లై చేశాను. అప్పటినుంచి ఇప్పటికీ ఒకే మాట మీద ఉన్నాను. చూద్దాం ఎన్ని రోజులు ఈ కేసుని ఇలా సాగదీస్తూ ఉంటాడో. అతడి పలుకుబడిని ఎంతవరకు ఉపయోగించుకుంటాడో మనం కూడా చూద్దాం. కానీ నేను మాత్రం వెనక్కి తగ్గేది లేదు అతడి జీవితంలోనికి వెళ్ళేది లేదు” అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది సౌర్య. 
కొనసాగుతుంది.
రౌద్రా ఏం చేస్తాడు.
 శౌర్య రౌద్ర నుండి ఎలా తప్పించుకుంటుంది..
ఇంతకీ రౌద్రత్ చేసిన తప్పేంటి..? 
ఇవన్నీ తెలియాలి అంటే ఏమి స్టోరీ ఫాలో అయిపోండి