New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షసప్రేమ – 38

రాక్షసప్రేమ – 38

రాక్షస ప్రేమ -38

 

 

శౌర్య రౌద్రా తనకోసం వచ్చి తన వెనుక నడుస్తున్నాడు అని తెలియక పది నిమిషాలు వాకింగ్ చేసి ఒక బెంచ్ మీద కూర్చుంది కరెక్ట్ గా అప్పుడే రౌద్ర కూడా ఆమె దగ్గరకు వచ్చి పక్కన కూర్చుని ఆమె భుజం చుట్టూ చేతిని వేసి హాయ్ అని పలకరించాడు. 

 

“ఇప్పటికీ నా దగ్గరకు రావడానికి నీకు ధైర్యం వచ్చిందా..?” అని శౌర్య నవ్వుతూ తలతిప్పి తన చెవిలో ఉన్న ఇయర్ బర్డ్స్ తీసి అడిగింది. 

 

“అంటే నువ్వు నన్ను ముందే చూసావన్నమాట, చూసి కూడా పట్టించుకోలేదా..?” అని ఆమె బుగ్గ గిల్లుతూ అన్నాడు. 

 

“ఇక్కడ కాదు నువ్వు నా వెనక కారులో ఫాలో అవుతూ వచ్చావు కదా అక్కడ ఇంటి బయట చూశాను కానీ ఎంతసేపు ఇలా నన్ను ఫాలో అవుతూ ఉంటావో అని నేను కూడా చూస్తున్నాను” అని నవ్వుతూ బుగ్గ మీద చేతిని పెట్టుకొని అన్నది. 

 

“ఏంటే ఈమధ్య ఫోన్ చేయటం లేదు, ఇంతకుముందు రోజు ఫోన్ చేసి కనీసం 10 నిమిషాలైనా నాతో మాట్లాడాలి అని చెప్పేదానివి ఇప్పుడు నువ్వే ఫోన్ చేయడం మర్చిపోయావా..?” అని అడిగాడు రౌద్ర. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue