New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షసప్రేమ – 39

రాక్షసప్రేమ – 39

రాక్షస ప్రేమ -39

 

 

 

“విరాట్ ఇది ఎవరి ఇల్లు మనం ఎవరి ఇంటికి వచ్చాం, అయినా తీర్థయాత్రలకు వెళ్దాం అని ఇంటి దగ్గర చెప్పి ఇక్కడ న్యూయార్క్ తీసుకొని వచ్చావ్ ఏంటి..? ఒకవేళ అమ్మమ్మ గారికి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా..?” అని గుండె మీద చేతిని పెట్టుకుంటూ ఇంటి లాక్ ఓపెన్ చేస్తున్న విరాట్ ని అడిగింది విరాజిత. 

 

“ఇది మన ఇల్లే, ఇంతకుముందు మనం క్యాబ్ దిగిన తర్వాత మనకి కీ ఇచ్చి వెళ్ళాడు కదా అతను నా ఫ్రెండ్.

అతనికి ఇక్కడ బాగా తెలుసు మనకి హెల్ప్ చేస్తాడు” అని చెప్పి డోర్ ఓపెన్ చేసి “మన ఇంటిలోనికి మనం గృహప్రవేశం చేద్దాం” అని ఆమె చేతిని పట్టుకొని కుడికాలు ముందు పెట్టి ఇంటి లోపలికి ఇద్దరు వచ్చారు. 

 

“విరాట్ నువ్వు చెప్తుంటే అంతా వినటానికి చాలా బాగుంది కానీ భయంగా ఉంది” అని అతడి చేతిని గట్టిగా పట్టుకొని భుజం మీద వాలిపోయి అన్నది విరాజిత. 

 

“నీ పక్కన నేను ఉండగా ఇక భయం ఎందుకు..? హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేద్దాం” అని ఆమె నుదుటిమీద ముద్దు పెట్టి అన్నాడు విరాజ్. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue