ఉదయం 9:00 – వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్
అనన్య కొత్త ఉద్యోగంలో మొదటి రోజు.
తనకు కేటాయించిన డెస్క్ దగ్గర కూర్చుని ఫైల్స్ పరిశీలిస్తోంది. అప్పుడే ఒక అబ్బాయి ఆమె దగ్గరకు వచ్చాడు.
“హాయ్! నేను సూర్య. మీ కొత్త టీమ్మేట్ని.”
“హాయ్! నేను అనన్య.”
“మీ గురించి మేఘన చెప్పింది. మీరు చాలా టాలెంటెడ్ అట.”
అనన్య నవ్వింది.
“అంతేం లేదు. ఇంకా చాలా నేర్చుకోవాలి.”
“ఏదైనా సహాయం కావాలంటే చెప్పండి. మనం ఫ్రెండ్స్ కదా!”
“తప్పకుండా.”
ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకోవడం దూరం నుంచి అర్జున్ గమనించాడు.
అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది.