ఉదయం ఆఫీసులోకి అడుగుపెట్టిన అనన్య తన డెస్క్ దగ్గర కూర్చుని ల్యాప్‌టాప్ ఆన్ చేసింది. పక్కనే ఉన్న మేఘన ఆమెను చూసి నవ్వింది.
“ఏంటి అనన్యా… ఈరోజు నీ డెస్క్ పక్కన సూర్య కనిపించడం లేదు?”
“అతనికి వేరే టీమ్‌తో మీటింగ్ ఉందట.”
“అవునా… మరి మన అర్జున్ సార్‌కి ఈరోజు ప్రశాంతంగా ఉంటుందేమో!” అంటూ మేఘన నవ్వింది.
అనన్య ఆమె మాటలకు అర్థం కాక కనుబొమ్మలు పైకెత్తింది.
“ఏంటి మేఘనా?”
“ఏం లేదు లేవే!” అంటూ మేఘన తన పనిలో పడిపోయింది.
అంతలో అర్జున్ క్యాబిన్ తలుపు తెరుచుకుంది.
“అనన్యా… నా క్యాబిన్లోకి రండి.”
అనన్య ఫైల్ తీసుకుని లోపలికి వెళ్లింది.
“ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని సూర్యతో కలిసి పూర్తి చేయాలి. రేపు క్లయింట్ మీటింగ్ ఉంది.”
అనన్య ఆశ్చర్యంగా చూసింది.