ప్రేమదేశం యువరాణి💘 7.
కూతురు ఆనందాన్ని వింటున్నా వసుంధర గారికి ఒక క్షణం ఏదో గుర్తొచ్చి గుండె పట్టేసినట్టు అయింది.
ఆమె కళ్ళు మూసుకుని గట్టిగా బిగించింది. ఆమె కళ్ళల్లోంచి నీరు కారిపోతుంది. అవతల నుంచి మీను మా మా ఉన్నావా? నేను చెప్పింది విన్నావా? హా విన్నాను తల్లి నేను నీకు ముందే చెప్పాను కదా?
నా మీను తల్లి అనుకున్నది సాధిస్తుందని ఇదిగో తన గోల్ రిచ్జ అయిపోయింది. అవును మా నీ కూతురు అనుకున్నది అనుకున్నట్టు సాధించింది ఇకమీదట డబ్బుల కోసం మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పనిలేదు.
ఫైనాన్స్ గా మనం ఇకనుంచి ఇంకా స్ట్రాంగ్ అవుదాం డబ్బు లేదని మనల్ని ఎన్నో సార్లు అవమానించిన వాళ్ళకి ఇప్పటినుంచి నేను సమాధానం చెప్తాను.