ఆ లెటర్ మొత్తం చదివిన అశోక్ షాకింగ్ గా రాఖి నీ చూస్తూ ఉంటే … అప్పటికే రాఖి కల్ల నిండా నీళ్లు కమ్ముకొని ఉంటాయి.
వెంటనే అక్కడ నుంచి బయటికి పరిగెత్తి … కారు ఎక్కి జాను దగ్గరికి బయలు దేరాడు. జాను గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.
ఇన్ని రోజులు జాను నీ రుద్రణి గారిని అపార్థం చేసుకున్నాడు అని గిల్టీ ఫీల్ అవుతూ … ” నిన్ను ఇంకా లైఫ్ లో ఎప్పుడు వదిలి పెట్టను రా బార్బీ డాల్” అని జాను గురించే అనుకుంటూ … జాను నీ చూడాలి అని అత్రంలో చాలా ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు.
ఇటు పక్క జాను ఏడ్చి ఏడ్చి మొహం అంతా ఉబ్బిపోయి ఉంటే మైదిలి తనని ఓదార్చి బతిమాలి వినకపోవడంతో బెదిరించి మరీ ఒక చపాతీ తినిపించి , ఒక గ్లాస్ పాలు తగ్గించి పడుకోబెట్టి .. కోపంగా విజయ్ కి కాల్ చేసి అతని మిద అరుస్తూ ఉంటుంది.