జాను మాటకి రాఖి పెద్దగా నవ్వుతూ … జాను నీ హగ్ చేసుకొని ఉల్టా అతని మీదకు చేర్చుకొని .. అతను బెడ్ మీదకు చేరి .. జాను నడుము చుట్టూ అతని చేతి పట్టు బిగించి ” నువ్వు ఇంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉన్నవే బార్బీ డాల్ ” అని జాను మొహం మిద పడిన జుట్టు చెవి వెనుక పెడుతూ అడిగాడు రాఖి.
” నాకు కూడా అది తెలియదు అండి ఎందుకు ఉన్నానో మరి ” అని చాలా అమాయకంగా కను రెప్పలు టప టపా కొడుతూ చెప్పింది జాను పాప.
జాను నీ అంత అమాయకంగా చూస్తూ ఉంటే రాఖి మనసు అంతా హాయిగా , ప్రశాంతంగా ఉంటుంది.
జాను నీ దగ్గరికి తీసుకొని ఉంటే అతను ఎంత ఫ్రస్టేషన్ , చిరాకు లో ఉన్న కూడా అవి ఇట్టే మాయం అయిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది.