దేవుడా ఏదయితే జరగకూడదు అనుకున్నాను అదే జరిగిపోతుంది ఇక్కడ అనుకుంటూ భయపడుతూ అది కాదు రుద్ర గారు అత్తయ్య చెప్పినట్టు మనం నడుచుకోవడం మంచిది కదా మనం ఒక త్రీ డేస్ ఆగి పెళ్లి చేసుకుందాం అంటూ భయపడుతూ చెప్పింది
అబ్బా ఇప్పుడు చేసుకున్నా త్రీ డేస్ తర్వాత చేసుకున్న పెద్దగా డిఫరెన్స్ ఏముంటుంది నువ్వే చెప్పు అప్పుడైనా నేను నీ మెడలో తాళి కట్టాలి ఇప్పుడైనా నేనే నీ మెడలో తాళి కట్టాలి తాళి కట్టే నేను కట్టించుకునే నువ్వు ఇద్దరం మారం కదా మరి ఈ త్రీ డేస్ ని ఎందుకు వేస్ట్ చేయడం చెప్పు అడిగాడు రుద్ర
అత్తయ్య చాలా సీరియస్ గా చెప్పారు అసలు ఈ త్రీ డేస్ ఎలాంటి పనులు జరగడానికి వీల్లేదు అని త్రీ డేస్ తర్వాతే పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అని చెప్పారు అంటూ రుద్ర కి టిఫిన్ వడ్డిస్తూ చెప్పింది
ఓకే మా అమ్మ అంతలా చెప్పినప్పుడు కాదు అనడం భావ్యం కాదు అందుకే మా అమ్మ కోసం మాత్రమే ఒప్పుకుంటున్నా అంటూ చెప్పేసి టిఫిన్ తినేసి చుట్టూ చూసాడు పనివాళ్ళు అక్కడ ఎవరూ లేకపోవడంతో అమూల్య నడుము చుట్టూ చేతులు వేసి తనని తన మీదకి లాక్కొని తన పెదాల మీద ఒక చిన్న ముద్దు ఇచ్చి ఇందాక రూమ్ లో పెట్టిన ముద్దు చాలా బాగుంది నాకు మన పెళ్లి తర్వాత ప్రతిరోజు ఉదయం అలాంటి ఒక ముద్దు కావాలి ఈ బెడ్ కాఫీలు అవి నా వల్ల కాదు ఈ బెడ్ కిస్ కావాలి. ప్రిపేర్ అయిపో అంటూ మరొకసారి తనివి తీరా అమూల్య పెదాలను అందుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు
రుద్ర వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లిపోయి ఫేస్ వాష్ తో తన మొహాన్ని పదిసార్లు క్లీన్ చేసుకుని అతని ముందుకి వచ్చి తనని తాను చూసుకుంది
అప్పటికే పెదవి దగ్గర రెండు చోట్ల పంటిగాట్లు కనిపించి లైట్ గా బ్లడ్ వస్తునట్టు కూడా చూడడంతో అసలు వీడు మనిషి కాదు వీడు ఒక బీస్ట్ అనుకుంటూ ఆలోచిస్తూ మళ్ళీ బాగా ఆకలి వేయడంతో కిందకి వెళ్లి తినేసి అక్కడే కూర్చుంది
కొంచెం సేపటికి అక్కడికి వచ్చింది ఒకమ్మాయి