వలయం -27
ఉదయ్ కి ఏమీ అర్థం కాక అయోమయంగా “మీరేం మాట్లాడుతున్నారు సార్, నన్ను అరెస్ట్ చేయడమేంటి..? నేను నా భార్య డెడ్ బాడీని తీసుకొని వెళ్లడానికి వచ్చాను అది కూడా తప్పేనా..?” అని అసలు ఏ తప్పు చేయని వాడిలా అన్నాడు..
“మీ భార్య డెడ్ బాడీ ని మీరు తీసుకుని వెళ్ళటానికి వచ్చారా..? మరి అయితే మీ భార్య చనిపోవటానికి కారణమైన మిమ్మల్ని జైల్లో పెట్టాలి అనుకుంటా..?” అని ప్రమోద్ అంటున్నప్పుడే,
ఉదయ్ భయంతో అక్కడినుంచి పరిగెడతాడు.
కానిస్టేబుల్స్ పట్టుకోండి అని ప్రమోద్ ఆర్డర్ వేశాడు.
ప్రమోద్ వెనకే ఉన్న కానిస్టేబుల్స్ అతని వెనక పరిగెట్టి పట్టుకుంటారు.
హాస్పిటల్ దాటకముందే పట్టుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు..