New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 1

♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 1

చిన్ని త్వరగా లే అమ్మ మళ్ళీ కాలేజ్ కి టైమ్ అవుతుంది అని హడావుడిగా తినకుండా రెడీ అవుతావు అని అంటారు మాధురి గారు.

 

అబ్బా కొంచెంసేపు పడుకుంటాను అని అంటుంది చిన్ని. ఇలా కొంచెంసేపు కొంచెంసేపు అని గంట నుంచి చేస్తున్నావు ఈ లోపు అక్క అన్నయ్య కూడా వస్తారు. నువ్వు లేచి రెడీ అవ్వు అని అంటారు మాధురి గారు.

 

 

ఏంటి అంత టైం అయిందా? అప్పుడే అక్క అన్నయ్య వస్తారా అని త్వరగా త్వరగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి దేవుడు గదిలోకి వెళ్లి పూజ చేసి వంటగదిలోకి వెళ్తుంది వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయడానికి. 

 

 

అక్క, అన్నయ్య పేరు చెబితే కానీ నువ్వు లేవలేదు అప్పటివరకు నేను ఎన్నిసార్లు లేపాను నిన్ను అని అంటారు మాధురి గారు. 

 

 

సరేలే అమ్మ వదిలే ఇప్పుడు లేచాను కదా ఇంకెందుకు గొడవ చెప్పు అని మాదిరి గారితో మాట్లాడుతూ వంటలో హెల్ప్ చేస్తుంది చిన్ని.

 

అంతలో వాళ్ళ అక్క అమ్ము వస్తుంది. ఏంటి ఇద్దరు వంటగదిలో ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఏముంది అక్క అమ్మకి హెల్ప్ చేస్తున్నాను అని అంటుంది చిన్ని వచ్చి. 

 

ఏంటి అప్పుడే లేచావా? వర్షం ఏమన్నా వస్తదేమో అని అంటుంది అమ్ము. 

 

పో అక్క అలా అంటావేంటి అని అంటుంది చిన్ని. మరి తమరు లేవడం పెద్ద వండరే కదా అని అంటుంది అమ్ము.

 

 

ఎప్పుడు అంతే నువ్వు అన్నయ్య నన్ను ఇట్లా ఆడుకుంటానే ఉంటారు అని బుంగమూతి పెట్టుకుంటుంది చిన్ని. 

 

 

చాల్లే ఆ పంది మూతి తియ్యి దాన్ని చూడలేక చచ్చిపోతున్న పొద్దు పొద్దున్నే అని అంటుంది అమ్ము.

 

 

నేను పంది మూతి పెడితే నేను పందిని కదా అప్పుడు నా అక్క కూడా పెద్ద పందే కదా అయ్యేది అని అంటుంది చిన్ని.

 

 

చూసావా అమ్మ దీనికి నోరు ఎలా ఎక్కువ అవుతుందో అని అంటుంది అమ్మ వాళ్ళ అమ్మ మాధురి తో.

 

 

వదిలేయలే అమ్ము చిన్న పిల్ల కదా మీకంటే దాంతో మీకెందుకు నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యే రాపో కాఫీ కలుపుతాను ఈలోపు నాని గాడు కూడా వస్తాడు అని అంటారు మాధురి గారు.

 

 

సరే అని అమ్ము ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ఈలోపు వాళ్ళ తమ్ముడు నాని కూడా వస్తాడు. 

 

నువ్వు కూడా ప్రెస్ చేయరా పో నాని అక్క కూడా ఇప్పుడే వెళ్ళింది అని చెప్తుంది వాళ్ళ అమ్మ. 

 

నేను ఇప్పుడే ఫ్రెష్ అవ్వనులే అమ్మ నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. కాఫీ తాగి అక్కని అడిగి తలకు ఆయిల్ పెట్టించుకుని తర్వాత ఫ్రెష్ అవుతాను అని అంటాడు నాని. 

 

సరే అయితే కూర్చో నేను కాఫీ తీసుకొని వస్తా ముందు అని మాధురి గారు కిచెన్ లోకి వెళ్లి కాపీ కలుపుకొని వస్తారు. నాని కాఫీ తాగే లోపు అమ్ము కూడా ఫ్రెష్ అయ్యి వస్తుంది.

 

ఏంటి నాని ఫ్రెష్ అవ్వకుండా కాఫీ తాగుతున్నావు అని అంటూనే దేవుని గదికి వెళ్లి దండం పెట్టుకుని వస్తుంది.

 

 

ఏమి లేదు అక్క కొంచెం తల నొప్పిగా ఉంది నీతో తల కి ఆయిల్ పెట్టించుకుని స్నానం చేద్దామని ఆగాను అని అంటాడు నాని.

 

ఎందుకు వచ్చింది రా తల నొప్పి నైట్ సరిగ్గా నిద్ర పోవడం లేదా అని అంటూనే వెళ్ళి ఆయిల్ లైట్ గా హీట్ చేసుకొని వచ్చి సోఫా మీద కూర్చుంటుంది.

 

ఒక క్లాత్ తెచ్చుకొని ఒడిలో వేసుకొని ఆయిల్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది.

 

అరే ముందు నువ్వు కాఫీ తాగు తర్వాత నాకు ఆయిల్ పెట్టచ్చు అని అంటాడు నాని.

 

అరే కాఫీ తర్వాత అయినా తాగొచ్చు లే ముందు నువ్వు సరిగ్గా కూర్చో అని కూర్చోపెట్టి ఆయిల్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది.

 

చిన్ని కూడ వాళ్ళ అమ్మ కి హెల్ప్ చేసి కొంచెం వర్క్ ఉంటే వాళ్ళ అక్క దగ్గర కూర్చొని చేసుకుంటుంది.

 

మధ్య మధ్య లో డౌట్స్ వస్తే వాళ్ళ అక్కని అడిగి క్లియర్ చేసుకుంటుంది. 

 

నువ్వు కాలేజ్ లో చెప్పేది వినవా, ఎప్పుడు చూడు డౌట్ అని అంటూనే ఉంటావు అని అంటాడు నాని.

 

ఎందుకు వినను అన్నయ్య వింటాను కానీ వాళ్ళకి చెప్పడం సరిగ్గా రాదు,అలాంటప్పుడు డౌట్స్ రాకుండా ఎలా ఉంటుంది చెప్పు.

 

నిజమే నే నీ ఒక్క దానికే అర్థం అవ్వడం లేదు నేను, అక్క కూడా అక్కడే కదా చదివింది మరి మాకు ఎలా అర్థం అయ్యాయి అని అంటాడు నాని.

 

 

ఏమో ఆయన మీకు బాగా చెప్పి మాకు సరిగ్గా చెప్పడం లేదు ఏమో అని అంటుంది చిన్ని.

 

ఆయన బాగా చెప్పకపోవడం కాదు నువ్వు సరిగ్గా వినలేదు అని చెప్పు ఎప్పుడు చూడు నీ పక్కన ఉన్న కోతి మొహాలతో ముచ్చట్లు పెట్టడమే సరిపోతుంది. ఇంక చదువు బుర్రకి ఎక్కడ ఎక్కుతుంది అని అంటాడు నాని.

 

నేను నా ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెట్టుకుంటే నువ్వు నీ జిమ్ లో అమ్మాయిలతో పులిహోర కలుపుతున్నావా అని అంటుంది చిన్ని.

 

నీకు బాగా ఎక్కువ అయ్యింది చిన్ని నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడు.

 

నువ్వు అయితే నన్ను అనొచ్చు నా తప్పు లేకపోయినా నేను మాత్రం నువ్వు చేసేది చెప్పకూడదు అని అంటుంది చిన్ని.

 

 

అబ్బా నీ గోల ఆపు చిన్ని వాడికి అసలే తల నొప్పి అని అంటున్నాడు కదా ఎందుకు వాడితో వాదన అని అంటుంది అమ్ము.

 

నువ్వు కూడా అన్నయ్య కే సపోర్ట్ చేస్తున్నావు కదా అక్క అని అంటుంది చిన్ని.

 

ఏ చిన్ని నువ్వు గొడవ పడకుండా చదువుకో ముందు అని అంటారు మాధురి గారు.

 

 

కొంచెం సేపు సైలంట్ గా ఉంటుంది ఇంట్లో. నాని ఆయిల్ రాయించుకొని వాళ్ళ అక్క ఒడిలో కూర్చునే నిద్ర పోతాడు.

 

అమ్ము చిన్నగా నాని ని కింద పిల్లో వేసి పడుకోబెట్టింది.

 

చేతులు కడుక్కొని వచ్చిన తర్వాత మళ్ళీ చిన్ని డౌట్స్ ఎక్స్ప్లిన్ చేసి మాధురి గారు కాఫీ ఇస్తే తాగి తనకి కూడా ప్రాజెక్ట్ వర్క్ ఉంటే చేసుకుంటూ ఉంది.

 

 

ఆ వర్క్ అయిపోయాక ఇంకా ఏమైనా పని ఉందేమో అని చూస్తుంది వాళ్ళ అమ్మ కి హెల్ప్ చెయ్యడానికి.

 

చిన్న చిన్న పనులు ఉంటే అవి కూడా పూర్తి చేసింది.

 

ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.

 

 

వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే నాని కూడా లేచి వీళ్ళతో మాటలు మొదలు పెట్టాడు.

 

అక్క మీ కాలేజీలో ఇంటర్వ్యూ జరుగుతున్నాయి అన్నావు కదా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయా మరి అని అంటుంది చిన్ని. 

 

వస్తున్నాయి రా కానీ ఇప్పుడు చాలా వరకు జాబ్స్ కష్టంగానే ఉన్నాయి.  

 

 

ఒక్క మా కాలేజ్ కే కాదు అన్ని కాలేజీల కి కొంచెం టఫ్ కండిషనే . ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఇంజనీరింగ్  స్టూడెంట్స్ బయటికి వెళ్తున్నారు.

 

జాయిన్ అయ్యేవాళ్ళు అవుతున్నారు, బయటికి వెళ్ళే వాళ్ళు వెళుతున్నారు.

 

ఇన్ని వేల మందికి జాబ్ లు ఎక్కడి నుండి వస్తాయి. ప్రతి ఒక్కరూ ఇంజినీరింగ్ అని అందులోనే జాయిన్ అవుతున్నారు.

 

ఎంతెంత ఫీజులు కట్టి అయినా సరే అందులోనే జాయిన్ అవుతున్నారు.

 

వేళల్లో స్టూడెంట్స్ బయటికి వస్తె వందల్లో జాబ్స్ ఉన్నాయి. అలా ఉంది బయట పరిస్థితి.

 

మన లాంటి వాళ్ళు కనీసం పార్ట్ టైం జాబ్ అయినా చేస్తున్నాం.

 

కొంత మంది అయితే అన్ని డబ్బులు ఫీజులు కట్టి ఇలాంటి జాబులు మేమెందుకు చెయ్యాలి అని అనుకుంటున్నారు.

 

 

ఇప్పుడు ఉన్న ai ఎఫెక్ట్ వల్ల చాలా మంది ఉద్యోగులు ఇంటి దారి పడుతున్నారు.

 

 

ఎప్పుడు ఎవరి జాబ్ ఉంటుందో ఎవరి జాబ్ పోతుందో కూడా తెలియదు. టెక్నాలజీ మనిషి ని బాగుచేస్తుందో తెలియదు ఇబ్బంది పెడుతుందో తెలియడం లేదు.

 

మొన్నటికి మొన్న ai తో మార్ఫింగ్ ఫోటోలు వల్ల ఎవరో ప్రాణాలు తీసుకున్నారు అంట.

 

 

 

టెక్నాలజీ నీ చదువు విషయంలో ఉపయోగించ కుండా ఇటువంటి పనికి మాలిన పనులు చెయ్యడం లో ఉపయోగిస్తున్నారు.

 

 

ప్రతి ఒక్క దానికి సంబంధించిన పరిష్కారం ai లో ఉంటుంది.

 

 

హమ్ ఏం చేస్తాం అక్క ఇప్పుడు లోకం లో కష్టపడి పని చేసేవారికి విలువ లేదు. పై పైన చేసినట్టు బిల్డప్ ఇస్తారు చూసావా వాళ్ళకే విలువ ఉంటుంది.

 

హా అక్క చెప్పడం మర్చిపోయా మన ఇంటికి కొంచెం దూరం లో ఒక స్కూల్ ఉంది అందులో ట్యూషన్ చెప్పడానికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు.

 

కాకపోతే కొంచెం దూరం ఉంటుంది. 

 

 

అందుకేనా మీ ఫ్రెండ్ స్కూటీ నేర్చుకుంటూ కింద పడ్డావు.

 

అది అక్క మరి అది కాదు అక్క నువ్వు అన్నయ ఇద్దరూ జాబ్ చేస్తున్నారు. మరి నేను కలిగానే ఉన్నాను కదా అందుకే నేను కూడా ఏదో ఒకటి చేద్దాం అని అనుకున్నాను అని అంటుంది చిన్ని.

 

 

ఇంతలో మాధురి గారు అయింట్ మెంట్ తీసుకుని వస్తె అది అమ్ము తీసుకొని చిన్ని మోచేతికి,మోకాలికి రాస్తూ చూడు చిన్ని నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా చదువుకో.

 

 

నేను నాని ఉన్నాము కదా మేము ఇద్దరం చూసుకుంటాము. నువ్వు అమ్మకి తోడుగా ఇంట్లో ఉండు.ఇప్పటికే అమ్మ మేము ఏదో తెగ కష్ట పడిపోతున్నాము అని బాధ పడుతుంది. ఇంక నువ్వు కూడా అంటే ఇంకేం లేదు. అందుకే నువ్వు అటువంటి ఆలోచనలు మానుకో 

 

అంతగా మనకి ఇబ్బంది అయితే స్కూల్ టైమింగ్స్, నా కాలేజ్ టైమింగ్స్ చూసుకొని నేను వెళ్తాను అని అంటుంది అమ్ము.

 

అక్క నువ్వు అంత కష్ట పడే పని ఉండదు అక్క. ఇప్పుడు మీ కాలేజ్ లో ఇంటర్వ్యూ లు జరుగుతున్నాయి కదా. నువ్వు ఏదో ఒక మంచి కంపెనీ లో మంచి పొజిషన్ ఉన్న జాబ్ లో కచ్చితంగా సెలెక్ట్ అవుతావు చూడు.

 

నువ్వు చెప్పినట్టు జరిగితే ఇంకేమి కావాలి చిన్ని అని అంటుంది అమ్ము.

 

 

ఇంకా ఉంది.

ప్లీస్ ఇగ్నోర్ మిస్టేక్స్.

ప్లీస్ ఫాలో మీ ♥️