అలాగే అని వాళ్లు తలదించుకొని భోజనం తీసుకుని సంజన గదిలోకి వెళ్తారు ..
ఏడుస్తూ కూర్చున్న సంజన ని చూసి వాళ్లకి చాలా జాలిగా అనిపిస్తుంది భోజనం అక్కడ పెట్టి మీకోసం బాబు గారి పంపించారు అమ్మ అని చెప్పి బయటకు వెళ్తుంటే…
ఒక్క నిమిషం నేను బయటకు వస్తాను దయచేసి తలపెయ్యొద్దు నాకు భయంగా ఉంది అని ఏడుస్తూ చెప్తుంది..
మమ్మల్ని క్షమించండి అమ్మ మీరు బయటకు వస్తే బాబు గారు మమ్మల్ని చంపేస్తారు అని వాళ్ళు సైలెంట్ గా బయటకు వెళ్లి మళ్లీ డోర్ లాక్ చేసేస్తారు..
అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్న నా లైఫ్ నాకేదైనా అయితే తట్టుకోలేని స్నేహితుడు నేను ఏడిస్తే తన కళ్ళెంబట కన్నీరు కారేది ఒక్కరోజు మాట్లాడకపోయినా నాకు ఏదో అయిపోయిందేమోనని పరిగెత్తుకొని నాకోసం వచ్చే నా స్నేహితుడు ఇప్పుడు ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నాడు ఎందుకు గౌతం ఇలా మారిపోయాడు ..
అప్పుడు వాడి కళ్ళల్లో నా మీద ప్రేమ స్నేహభావం అభిమానం గౌరవం అన్ని కనిపించే ఇప్పుడు కేవలం కోపం ద్వేషం కనిపిస్తున్నాయి నేను ఏమైపోయినా పర్లేదు నా జీవితం ఏమైపోయినా పర్లేదు అని నన్ను ఇలా నాలుగు గోడల మధ్యాహ్నం బంధించాడు ఏంటిదిరా నేను ఇలా ఉండలేను ఈ ఆలోచనల మధ్య బ్రతకలేను ప్లీజ్ గౌతమ్ డోర్ తీయని మళ్లీ డోర్ దగ్గరికి వచ్చి తలుపు కొడుతుంది..
అలా కొట్టి కొట్టి అలసిపోయి ఆ డోర్ కి ఆనుకొని ఏడుస్తూ కూర్చుండిపోతుంది కొంతసేపటికి డోర్ తీస్తున్న సౌండ్ రావడంతో పైకి లేచి డోర్ ఎదురుగా నిలబడుతుంది .
ఎదురుగా ఉన్న గౌతమ్ ని చూసి ప్లీజ్ గౌతమ్ నన్ను వదిలేయ్ నేను మా అమ్మానాన్నల దగ్గరికి వెళ్ళిపోతాను మళ్ళీ నీకు కనపడను ప్లీజ్ రా నన్ను వదిలేయ్ నాకు చాలా భయంగా ఉంది అని రెండు చేతులతో కన్నీళ్ళతో బ్రతిమిలాడుతుంది..
గౌతమ్ ఒక అడుగు గదిలోకి వేసి డోర్ క్లోజ్ చేస్తాడు అతని ఒక్కడు సంజన రెండు అడుగులు వెనక్కి వేస్తుంది ఎందుకు నువ్వు లంచ్ తినలేదు అని అడుగుతారు.
నాకు ఇప్పుడు ఏమీ వద్దు నేను ఏమీ తినను నన్ను వదిలేసి ప్లీజ్ నీ కాళ్లు పట్టుకుంటాను అని బ్రతిమిలాడుతుంది …
నీకు చెప్పాను కదా సంజు ఇకనుంచి నువ్వు నా భార్యవి నా భార్య నాతోనే ఉండాలి కదా అలాంటిది నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు అని ఆమెను కూర్చోబెట్టి భోజనం ప్లేట్ తీసుకొచ్చి తన ముందు పెట్టి తిను అని అంటాడు ..
నాకు వద్దు నాకు ఆకలిగా లేదు నేను వెళ్ళిపోతాను అని అంటుంది ..