అదంతా నీ వృధా ప్రయాస ఆవేశపడి ఆరోగ్యం పాడు చేసుకునే కంటే ఆలోచించి నాతో కాపురం చేస్తూ సర్దుకుపోవడమే నీకు మంచిది. నీకే కాదు మీ పేరెంట్స్ కూడా అదే మంచిది అని వార్నింగ్ టోన్ లో చెప్పి బయటకు వెళ్లి డోర్ లాక్ చేస్తాడు .
ఇంటికి వెళ్లిన అజయ్ కోపంతో ఊగిపోతూ వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడేస్తూ నిన్ను వదలను నా కలలనిసంజనాన్ని నాకు కాకుండా చేశారు నిన్ను ప్రాణాలతో వదలను అని గట్టిగట్టుగా అరుస్తూ ఉంటాడు.
కొడుకుని ఎలా ఆపాలో తెలియని రామారావు అజయ్ ఆగు ఏదైనా ఆలోచిస్తేనే పరిష్కారం దొరుకుతుంది ఇలా అన్ని పడగొడితే విరకొడితే కాదు కాదు అని అంటాడు.
తండ్రిని కోపంగా చూస్తూ ఇప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనం ఉంది వా నా సంజన మెడలో తాళి కట్టేశాడు తనని వాడి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు ఇంక సంజన మనకు దక్కదు చిన్నప్పుడు నుంచి వాడిని చూస్తున్నాను వాడి చాలా మొండోడు అలాంటిది ఇప్పుడు వాడు తాళి కట్టిన సంజనను ఎలా వదులుతాడు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎన్నో ప్లాన్స్ వేసాము సంజన పెళ్లి చేసుకోవాలని ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు అన్నిటికీ కారణం ఆ గౌతమ్ గాడే అని పెద్ద పెద్దగా అరుస్తూ అంటాడు .
ఇప్పుడు ఆ గౌతమ్ నుంచి సంజన ని ఎలా వేరు చేయాలి ఆ గౌతంని ఏం చేస్తే సంజన మన దగ్గరికి వస్తుందో అది ఆలోచించు ఇలా ఆవేశపడితే ఎటువంటి పనులు జరగవు ఏ సమస్యలు తీరవు ముందు మన సమస్య నుంచి ఎలా బయటపడాలి ఆలోచించు ఆ గౌతమ్ ఎలా అడ్డు తొలగించుకోవాలో అది ఆలోచించు అని కొడుకు భుజం మీద చెయ్యి వేసి వద్దుతూ చెప్తాడు రామారావు.