ఏంటి డాడీ అంతలా ఆలోచిస్తున్నావు దేని గురించి అని అడుగుతాడు అజయ్ తండ్రి దగ్గరకు వచ్చి..
మనమేమో ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి అప్పుడు ఆ విశ్వనాథ ఆస్తంతా మన చేతికి వస్తుంది అని అనుకుంటున్నాము కానీ ఆ గౌతమ్ అలా జరగనిస్తాడా అని అంటాడు ..
వాడు ఊళ్ళో లేడు డాడీ గౌతమ్ బిజినెస్ పనిమీద ఆస్ట్రేలియా వెళ్ళాడు రావడానికి ఇంకో టు డేస్ అయినా పడుతుంది అందుకే ఈలోపు సంజన తో నా పెళ్లి జరిగిపోవాలి అని తొందరపడుతున్నాను ఒక్కసారి తన మెడలో నేను తాళి కడితే ఇంకా ఎవరూ తనని నా నుంచి దూరం చేయలేరు మనం అనుకున్నవన్నీ జరుగుతాయి నువ్వు ఎక్కువ ఆలోచించకుండా పెళ్లికి ఏమేం పనులు చేయాలో చూడు అని అంటాడు.. అజయ్
ఎందుకైనా మంచిది. మన ఇంటి చుట్టూ సెక్యూరిటీ టైట్ చేయి పెళ్లిలో కూడా మండపం చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉండాలి ఒకవేళ వాడు వచ్చిన మండపంలోకి అడుగుపెట్టకుండా ఉండేవిధంగా వాడిని ఆపగలిగితే చాలు మనం అనుకున్నది సాధించినట్టే అని అంటాడు రామారావు..
నేను ఆల్రెడీ ఆ పని చేశాను నువ్వు దిగులు పడొద్దు అని తండ్రికి ధైర్యం చెప్తాడు..
ఎంతో అందంగా అలంకరించిన పెళ్లి పందిరి అతిధుల కోలాహలం పురోహితులు వధూవరులను కలిసి కూర్చోబెట్టి మంత్రాలు చెబుతూ ఇద్దరి చేత పూజ చేపిస్తారు నిండు చందమామ లాగా పెళ్ళికొడుకు ఉంటే పుత్తడి బొమ్మలాగా పెళ్లికూతురు ఉంటుంది ఆమె మనసులో ఎంత బాధ ఉన్నా దాన్ని బయటకు చూపించకుండా
మొహం మీద సంతోషాన్ని పొలుముకొని పెళ్లి లో ఒక్కొక్క ఘట్టం పూర్తి చేస్తుంది ..
ఆ జంటని అందరూ ముచ్చటగా చూస్తూ ఉంటారు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని పంతులుగారు ఇద్దరి చేతుల్లో తమలపాకు మీద జీలకర్ర బెల్లం పెట్టి ఇస్తారు అడ్డుతెర మీద నుంచి ఇద్దరు చేతులు ఒకరి తలమీద మరొకరు చేతులు చేరుతుండగా అజయ్ తల మీద సంచన చెయ్యి వన్ ఇంచ్ దూరంలో ఉండగానే ఫోర్సుగా అజయ్ పక్కకి పడిపోతాడు..
ఒక్క క్షణం అందరికీ ఏం జరిగిందో అర్థం కాదు అందరూ చూపు పడిపోయిన అజయ్ మీదే ఉంటుంది అజయ్ మాత్రం తను పడిపోవడానికి కారణమైన ఎదురుగా ఉన్న గౌతమ్ ని కోపంగా చూస్తాడు..
గౌతమ్ సంజన రెక్క పట్టుకొని పైకి లేపి ఎర్రటి అగ్నిగోలాల్లాగా మండే కళ్ళతోటి సంజన ని చూస్తూ నేను ముందే చెప్పాను నేను తప్ప నిన్ను ఎవరు పెళ్లి చేసుకోకూడదు అని అలాంటిది నువ్వు ఇవాళ వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు ..
నీకు నేను ఒక్కడిని చాలానా నీతో పడక పంచుకోవడానికి నేను కావాలి పెళ్లికి వాడు కావాలా అని చాలా అసహ్యంగా అంటాడు …
ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళంతా నోరు వెళ్ళబెట్టి చూస్తారు…
విశ్వనాథ్ కూతురు గురించి అలా మాట్లాడటం తట్టుకోలేక గౌతం నా కూతుర్ని వదులు అని కోపంగా గౌతమ్ షర్టు పట్టుకుంటాడు .