ఆయుష్ ను చూసిన ప్రణవి తనలోని యాక్టింగ్ స్కిల్స్ బయటకు తీసి చూసావా బావ ఇక్కడ ఎవరు లేరన్న ధైర్యం తో వీడు నాతో….. నాతో …….. !! అని ఏడుస్తూ చాలా నీచంగా బిహేవ్ చేశాడు నేను ఆ విషయం నీకు చెప్తాను అన్నందుకు నన్ను కొడుతున్నాడు…….. !! అని చెప్తున్న ప్రణవి వైపు అసహనంగా చూస్తూ మొహాన్ని తిప్పుకుంటాడు మున్నా……… !!
ఇద్దరినీ చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేసి ఎదురుగా వచ్చి నుంచున్న ఆయుష్ ను చూసి……….. !! బావ ప్లీస్ లీవ్ మీ అసలు నన్నెందుకు ఇలా బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పడేశావ్…….. !! నేనేం తప్పు చేశాను బావ ప్రాణంగా ప్రేమించిన నువ్వు కాదన్నావ్ నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో నన్ను ప్రేమించిన విక్రమ్ ను హార్ట్ చేసాను……. !!
ఇపుడు విక్రమ్ విలువ తెలుస్తున్నా తన లైఫ్ లోకి నేను ఎప్పటికీ ఎంటర్ అవ్వలేను అని అర్తం అయ్యాక దూరం నుండే తనను చూసి బాధ పడుతూ ఉన్నాను…….. !! కానీ నన్ను ఎందుకు ఇలా బలవంతంగా తీసుకొచ్చి పడేసావ్ ఇప్పటికీ నా మీద నీ పగ తీరక పోతే చంపెయ్ బావ ఇలా ఒక్కో రోజు చస్తూ బ్రతకడం కంటే ఒక్క సారిగా ప్రాణం పోతే ప్రశాంతంగా ఉంటుంది…….. !!
నీ కోరిక నేను ఎందుకు కాదంటాను ప్రణవి ఒకే అలాగే అంటూ పాకెట్ లో ఉన్న గన్ తీసి ప్రణవి తలకు గురి పెట్టగానే…….. !! ఆయుష్ ఇలా రియాక్ట్ అవుతాడు అని ఎక్స్పెక్ట్ చేయని ప్రణవి షాక్ అవుతూ బా…… బావ ప్లీస్ నన్ను చంపద్దు నాకు బ్రతకాలి అనుంది అంటూ ఏడుస్తూ భయంగా చెప్తుంది ……… !!
నువ్వు బ్రతికి ఇంకా ఎంత మందిని చంపాలి అనుకుంటున్నావ్ ఇంకా ఎన్ని కుట్రలు చేయాలి అనుకుంటున్నావ్ ……… ??
ఆయుష్ గంభీరమైన వాయిస్ కి ప్రణవి గుటకలు మింగుతూ చూస్తూ ఉంటుంది……… !!
నిన్నే అడుగుతుంది ఆన్సర్ టు మీ ఇంకా నా కుటుంబాన్ని ఎలా ముక్కలు చేయాలి అనుకుంటున్నావ్ ……… ??
ఎందుకిలా నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావ్ బావా……….. ?? నీ ఫ్యామిలీ అంటే నేను నీ ఫ్యామిలీ కదా అయినా నేను ఎందుకు ఫ్యామిలీ ను బ్రేక్ చేయాలి అనుకుంటాను …… !! నీ మాటలు నాకు చాలా చాలా హార్టింగ్ గా ఉన్నాయి బావ నేను ముందులా లేను ఐ ఆమ్ కంప్లీట్లీ చెంజేడ్ ………… !!
ఈ మాటలు ఇంకెవరికైనా చెప్పు నీ గురించి అన్ని తెలిసిన నాకు కాదు అంటూ ఆయుష్ మున్నా వైపు చూస్తాడు…….. !! మున్నా ఆయుష్ చూపు ను అర్తం చేసుకుంటూ ప్రణవి చేతికి, కాళ్లకు ఉన్న కట్లు విప్పగానే……… !! ఆయుష్ ప్రణవి బుగ్గలు నొక్కి పట్టుకుని పైకి లేపి ఆషి ఎక్కడ అంటూ సీరియస్ గా చూస్తూ అడుగుతాడు……… !!
ఆ…. ఆషి మహల్ లోనే ఉంది కదా బావ అన్న నెక్స్ట్ మినిట్ ఆయుష్ కొట్టిన దెబ్బకు ప్రణవి పెదవి చిట్లి బ్లడ్ వస్తూ ఉంటుంది……… !! నొప్పెడుతున్న చంప మీద చెయ్ వేసుకుని భయంగా ఆయుష్ వైపు చూస్తున్న ప్రణవి జుట్టు పట్టుకుని తన మొహం లోకి చూస్తూ……… !! ఎలా కనిపిస్తున్న నీ కంటికి హా…… !! నా ఆషి రూపం లో ఉన్నంత మాత్రానా అది నా ఆషి అవుతుందా మహల్ లో ఉంది ఆషి కాదన్న విషయం తను మహల్ కి వచ్చిన రోజే నాకు అర్తం అయింది…… !!
ఆయుష్ వాయిస్ కి ప్రణవి కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు అవుతుంది……… !! ఇన్నాళ్ళు ఆయుష్ కనిపెట్టలేక పోయాడు అని ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో ఇప్పుడు ఆయుష్ కి నిజం తెలిసిపోయింది అని నిలువెల్లా వణికిపోతూ ఉంటుంది……. !!