మోహిత్ కార్ డ్రైవ్ చేస్తూ ఆషి వైపు చూసి ఏంటి ఆషి నువ్వు చేసిన పని పూజారి చెప్పిన వాటికి ఎందుకు ఒకే చెప్పావ్ అవి చేయటం ఎంత కష్టమో తెలుసా అది ఎమ్ తినకుండా అన్ని పనులు చేయాలి అంటే మాటలు కాదు నా మాట విని డ్రాప్ అవ్వు దియా కి ఎమ్ కాదు తనకు లండన్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం ఆ పనులు అన్నీ చేస్తే దియా పక్కన నువ్వు పేషెంట్ లా జాయిన్ అవ్వాలి నా మాట విను ఆషి ఇది చాలా రిస్క్
ఆషి మోహిత్ వైపు చూస్తూ తెలిసీ చేసినా తెలియక చేసినా దియా అలా అవ్వడానికి నేనే కదా అన్నయ్య కారణం కాబట్టి దియా సంపూర్ణఆయుషు తో ఉంటుంది అంటే నేను ఎంత రిస్క్ అయినా చేస్తాను దియా ను అలా చూస్తూంటే గుండెళ్ళో తెలియని బాధ తనకు నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా దియా ను అలా చూస్తూంటే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అన్నయ్య ప్లీస్ నాకు అడ్డు చెప్పకు అలాగే ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు వాల్లకు తెలిస్తే నన్ను ఇలాంటి రిస్కీ పూజ చేయనివ్వరు నా కూతురి కోసం నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నా ఎటువంటి అడ్డంకులు రాకుండా ఈ పూజ పూర్తి చేయాలి అందుకు నీ హెల్ప్ కావాలీ ప్లీస్ అన్నయ్య