దియా ముందు అందరు ఉన్నా ఆషి కనిపించక పోయేసరికి తనను మళ్ళీ వదిలి వెళ్ళిపోయింది అని అనుకుని ఏడుస్తూ ఎవరు కంట్రొల్ చేస్తున్న వినకుండా ఆషి కోసం వెక్కిళ్లు పెడుతూ తను ఏడవడం వల్ల ఎక్కువ తన బ్రెయిన్ మీద ప్రెషర్ పడ్డం తో అప్పటీకే తల నొప్పికి బాధ పడుతున్న దియా కి అలా ప్రెషర్ పడ్డం వల్ల మామ్… మామ్ అని ఏడుస్తూనే ఆయుష్ చూస్తూ వుండగానే స్పృహ తప్పి పడిపోతుంది
దియా…. దియా..!!! ఓహ్ గాడ్ నిష్ కాల్ ది డాక్టర్ అంటూ దియా ను సరిగ్గా పడుకోబెట్టి దియా వైపు టెన్షన్ గా చూస్తూ ఉంటాడు ఈ లోపు డాక్టర్ రావడం తో డాక్టర్ ప్లీస్ ఏమైందో చూడండి సడన్ గా ఏడుస్తూ అన్ కాన్షియస్ అయ్యింది