ప్రభాకర్ అప్పుడే మెడిసిన్ వేసుకుని నిద్రపోవడం తో చైర్ లో కూర్చుని ఆషి గురించే ఆలోచిస్తూ ఒక్క సారి ఆషి తో మాట్లాడాలి అనుంధి ఆషి కాల్ చేయ్ తల్లీ నీతో మాట్లాడకుండా ఇన్ని డేస్ ఎప్పుడూ లేను నీతో ఇలా మాట్లాడకుండా ఉండడం చాలా కష్టంగా ఉంది నాకు ఇదంతా చూస్తూంటే అప్పటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి అప్పుడు నీతో మాట్లాడకుండా నెల రోజులు ఒక యుగం లా గడిపాను మళ్లీ అలాంటి సంఘటన రాకూడదు అనుకున్నా కానీ ఈ రూపం లో మనం ఇలా దూరం అవుతాము అనుకోలేదు తల్లీ ఒక్క సారి ఈ తల్లికి కాల్ చెయ్ ఆషి అంటూ ఆషి ఫొటో చూసి బాధగా అనుకుంటుంది
అభి రెడీ అయి అక్కడికి వెళ్లి ప్రభాకర్ ను చూసి ఆయన నుదుటిన ముద్దు పెడుతూ 2 డేస్ లో వచ్చేస్తాను డాడీ జాగ్రత్త అంటూ బాధ పడుతున్న అనిత వైపు చూసి అమ్మా అంటూ ఆషి ఫొటో ను తీసుకొని అమ్మా అక్క ఎప్పటికైనా మన దగ్గరకు వస్తుంది ఆ నమ్మకం నాకుంది నువ్వు బాధ పడి నాన్న ను బాధ పెట్టకు నేను వైజాగ్ వెళ్తున్నా 2 డేస్ లో వచ్చేస్తాను నాన్న జాగ్రత్త నీకేం కావాల్సిన నా ఫ్రెండ్ ఇక్కడే వుంటాడు వాడికి చెప్పు అంటూ తల్లిని హత్తుకుని తన ఫ్రెండ్ తో బస్ స్టేషన్ కి వెళ్తుంది