ఈవెనింగ్ అఫీస్ అవ్వగానే మధు అనూష ను తీసుకుని నేరుగా వైజాగ్ లో ఉన్న అతి పెద్ద బ్యూటీ సలూన్ దగ్గరకు తీసుకొని వెల్లి ఫేషియల్, మ్యానిక్యూర్, ప్రెడిక్యూర్, స్పా, ఐ లాష్ ఎక్స్టెన్షన్,నెయిల్ పెయింటింగ్ అంటూ రెండు గంటలు అక్కడే అవ్వగొట్టేసి వాల్లకు పాతిక వేలు బిల్ పే చేసి మిర్రర్ లో కనిపిస్తున్న తన రూపానికి ఇంప్రెస్ అవుతూ నవ్వుతూ సెలూన్ నుండి బయటకు వచ్చి స్కూటీ స్టార్ట్ చేసి తమ అపార్ట్మెంట్ ముందు స్కూటీ పార్క్ చేసి ఇద్దరు తమ ఫ్లాట్ కి వెళతారు
అనూష, మధు కాలేజ్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరిది హైదరాబాద్ నే అవ్వడంతో త్వరగా ఫ్రెండ్స్ అయిపోయారు స్టడీస్ అవ్వగానే నిషాన్ కంపెనీ లో ఇద్దరికీ జాబ్స్ వస్తాయి అక్కడే మధు నిషాన్ ను మూగగా ప్రేమిస్తు ఉంటుంది తప్పా ఎప్పుడు నిషాన్ కి చెప్పే ధైర్యం చేయలేక పోయింది